బజాజ్ పల్సర్ 150 బైకులో ఇప్పుడు ట్విన్ డిస్క్ బ్రేకులు

Written By:

బజాజ్ ఆటో విపణిలోకి తమ పాపులర్ మోటార్ సైకిల్ పల్సర్ 150 డిటిఎస్ఐ బైకును సరికొత్త వేరియంట్లో లాంచ్ చేసింది. ఈ నూతన వెర్షన్ బజాజ్ పల్సర్ 150 లో ట్విన్ డిస్క్ బ్రేకులు వచ్చాయి. వీటితో పాటు అదనంగా పలు ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్ జరిగాయి. ట్విన్ డిస్క్ బ్రేక్ వేరియంట్ బజాజ్ పల్సర్ 150 డిటిఎస్ఐ ప్రారంభ ధర రూ. 78,016 లు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ బ్రేకులు

సరికొత్త బజాజ్ పల్సర్ 150 బైకులో రివైజ్ చేయబడిన గ్రాఫిక్స్, రెండుగా విభజించిన సీటు మరియు పిలియన్ గ్రాబ్ రెయిల్, పొడవాటి వీల్ బేస్, వెడల్పాటి టైర్లు ఇంకా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ బ్రేకులు

ట్విన్ డిస్క్ బ్రేక్ వేరియంట్ బజాజ్ పల్సర్ 150 మూడు విభిన్న కలర్ కాంబినేషన్స్‌లో లభిస్తుంది. అవి, బ్లాక్ బ్లూ, బ్లాక్-రెడ్ మరియు బ్లాక్ క్రోమ్. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బజాజ్ ఆధీకృత డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొన్న వెంటనే డెలివరీ కూడా ఇస్తారు.

బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ బ్రేకులు

దేశవ్యాప్తంగా విక్రయించే 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి గల అన్ని టూ వీలర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరి చేయడానికి ముందే బజాజ్ ఆటో తమ పల్సర్ 150 బైకులో అదనంగా రియర్ డిస్క్ బ్రేక్ జోడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏప్రిల్ 1, 2019 నుండి అమల్లోకి రానుంది.

బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ బ్రేకులు

ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు, 2018 ఏప్రిల్ 1 నుండి విపణిలోకి కొత్తగా విడుదలయ్యే 125సీసీ కంటే ఎక్కువ కెపాసిటి గల స్కూటర్లు మరియు బైకుల్లో ఏబిఎస్ తప్పనిసరి చేసింది. ప్రభుత్వం ప్రకటన మేరకు, బజాజ్ పల్సర్ 150బైకులో ఏప్రిల్ 1, 2019 నాటిటికి ఏబిఎస్ ఉండాలి. ఈ గడువుకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో ఇప్పుడు ఏబిఎస్ అందివ్వలేదు.

బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ బ్రేకులు

తాజాగా పల్సర్ 152 డిటిఎస్ఐ బైకుల్లో ట్విన్ డిస్క్ బ్రేకులు పరిచయం చేసిన నేపథ్యంలో, తమ లైనప్‌లో దాదా అన్ని మోడళ్లు వేరియంట్లలో ట్విన్ డిస్క్ బ్రేకులను అందివ్వనుంది. వచ్చే ఏడాదికి ఎలాగో అన్ని మోడళ్లలో ట్విన్ డిస్క్ బ్రేకులు ఉంటాయి కాబట్టి, ఏబిఎస్ అందివ్వడం సులభమవుతుంది.

బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ బ్రేకులు

సాంకేతికంగా బజాజ్ పల్సర్ 150 డిటిఎస్ఐ బైకులో 150సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 14పిఎస్ పవర్ మరియు 13.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ బ్రేకులు

బజాజ్ మోటార్‌సైకిల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ మాట్లాడుతూ, "మెరుగైన పవర్ మరియు టార్క్ కోసం ఇంజన్‌ను మరింత మెరుగుపరిచినట్లు తెలిపాడు. అంతే కాకుండా, నాయిస్, వైబ్రేషన్స్ మరియు హార్స్‌నెష్ లెవల్స్ కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. దీంతో రైడ్ క్వాలిటీ పెరిగి, మంచి రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ బ్రేకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

150సీసీ సెగ్మెంట్లో అత్యధిక అమ్ముడవుతున్న బ్రాండ్ పల్సర్ 150 మోటార్‌సైకిల్. స్పోర్టివ్ తత్వానికి మరియు కండలు తిరిగిన షార్ప్ డిజైన్‌కు పల్సర్ 150 పర్యాయ పదం అని చెప్పుకోవచ్చు. సౌకర్యవంతమైన పనితీరు మరియు అత్యుత్తమ మైలేజ్ కోరుకునే యువ కస్టమర్లను టార్గెట్ చేసుకుని బజాజ్ ఆటో తమ పల్సర్ 150 బైకులో ట్విన్ డిస్క్ బ్రేకులను అందించింది.

English summary
Read In Telugu: Bajaj Pulsar 150 DTSi sporty commuter motorcycle with twin disc brakes launched in India
Story first published: Thursday, April 19, 2018, 13:25 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark