కెటిఎమ్ 250పై ఆధిపత్యానికి పల్సర్ 250 బైకును సిద్దం చేస్తున్న బజాజ్ ఆటో

Written By:

బజాజ్ ఆటో కొత్త తరం పల్సర్ సిరీస్ బైకులను బిఎస్-6 ఉద్గార ప్రమాణాలను పాటించే ఇంజన్‌లతో సిద్దం చేస్తోంది. నూతన శ్రేణి బజాజ్ పల్సర్ సిరీస్ బైకుల్లో డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్ల పరంగా భారీ చోటు చేసుకోనున్నాయి.

తాజాగా అందిన సమాచారం మేరకు, బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ 250 బైకును కూడా అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది.

బజాజ్ పల్సర్ 250

రిపోర్ట్స్ ప్రకారం, యుజి6 పల్సర్ శ్రేణిలోని 150సీసీ నుండి 250సీసీ సిరీస్‌లో ఉన్న ఇంజన్‌లను కొత్తగా డిజైన్ చేస్తోంది. ప్రస్తుతం, 220సీసీ పల్సర్ బైకును బజాజ్ విక్రయిస్తోంది. దీనికి అదనంగా అత్యంత పాపులర్ చెందిన 250సీసీ సెగ్మెంట్లోకి పల్సర్ బ్రాండును పరిచయం చేసిన సరికొత్త పల్సర్ 250 బైకును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

బజాజ్ పల్సర్ 250

ప్రస్తుతం, బజాజ్ పల్సర్ పలు రకాల ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. విభిన్న కస్టమర్లను అకట్టుకునేందుకు 135, 150, 180 మరియు 200తో పాటు పల్సర్ ఆర్ఎస్200, ఎన్ఎస్200 మరియు ఎన్ఎస్160 బైకులు విపణిలో ఉన్నాయి.

బజాజ్ పల్సర్ 250

బజాజ్ నుండి ఇటీవల అందిన రిపోర్ట్స్ మేరకు, బజాజ్ తమ ఎంట్రీ లెవల్ పల్సర్ మోడల్ పల్సర్ 135 బైకును ఆశించిన సేల్స్ లభించకపోవడంతో మార్కెట్ నుండి తొలగించింది. పల్సర్ శ్రేణి యొక్క నూతన 2018 వెర్షన్ బైకులను పలు కాస్మొటిక్ అప్‌డేట్స్‌తో రానున్న రోజుల్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ 250

నూతన పల్సర్ 250 మోటార్ సైకిల్ పలు అధునాత ఫీచర్లు మరియు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌తో లభించే అవకాశం ఉంది. ఫ్యూయల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, ఇప్పటి వరకు పరిచయం కానీ మరియు అత్యంత అగ్రెసివ్ శైలిలో ఉండే డిజైన్ వంటి ప్రత్యేకతలు ఈ నూతన పల్సర్ 250 సొంతం అని చెప్పవచ్చు.

బజాజ్ పల్సర్ 250

యుజి6 పల్సర్ సిరీస్ బైకుల కోసం సిద్దం చేస్తున్న నూతన ఇంజన్ ఫ్లాట్‌ఫామ్ 2019 నాటికి పరిచయం చేసే అవకాశం ఉంది. మరియు పల్సర్ 250 బైకును కూడా 2019లోనే విడుదల చేయవచ్చు. అయితే, పల్సర్ 250 విడుదలతో పల్సర్ 220 బైకును మార్కెట్ నుండి తొలగించే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ 250

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బైకుల్లో బజాజ్ పల్సర్ బ్రాండ్ ఒకటి. బజాజ్ పల్సర్ శ్రేణిలో ఉన్న అన్ని బైకులు ధరకు తగ్గ విలువలు మరియు అత్యుత్తమ పనితీరుకు నిదర్శనం. తాజాగా, పల్సర్ 250 బైకును అభివృద్ది చేస్తుండటంతో మార్కెట్లో ఈ బైకు భారీ మార్పులకు తెరదించనుంది.

ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే, విపణిలో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 250 మరియు యమహా ఎఫ్‌జడ్25 బైకులతో పోటీపడనుంది.

బజాజ్ పల్సర్ 250

1. కొని నెల కూడా కాలేదు బుగ్గిపాలైన 30 లక్షల కారు

2.సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లోకి ప్రవేశించిన రాయల్ ఎన్ఫీల్డ్

3.2018లో భారతదేశపు 10 బెస్ట్ ఎయిర్‌లైన్స్

4.ఇండియాలో ఎక్కువగా ఇష్టపడుతున్న, అసహ్యించుకుంటున్న కార్ కలర్

5.10 లక్షల ధరతో విలాసవంతమైన ఫీచర్లు ఉన్న 12 బెస్ట్ కార్లు

Source: Autocar India

Read more on: #bajaj #బజాజ్
English summary
Read In Telugu: Bajaj Pulsar 250 In The Works — Launch Details Revealed
Story first published: Wednesday, April 11, 2018, 9:30 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark