పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్ విడుదల చేసిన బజాజ్

By Anil
Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight

దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో విపణిలోకి తమ ఫుల్లీ ఫెయిర్డ్ పల్సర్ ఆర్ఎస్200 బైకును సరికొత్త కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 ఇప్పుడు సరికొత్త రేసింగ్ రెడ్ కలర్ స్కీమ్‌లో కూడా లభిస్తోంది.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ ఎడిషన్ నాన్-ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.23 లక్షలు మరియు ఏబిఎస్ వేరియంట్ ధర రూ. 1.35 లక్షలు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్

సరికొత్త పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్ ఎరుపు మరియు తెలుపు రంగు కాంబినేషన్స్‌ అగ్రెసివ్ లుక్‌లో ఉంది. డిజైన్ పరంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. రెడ్ కలర్ ఆప్షన్‌తో పాటు, రేసింగ్ బ్లూ మరియు గ్రాఫైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తోంది.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్

రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్స్‌లో గల ఫ్రంట్ ఫెయిరింగ్, రియర్ ఫ్యానల్స్ రేసింగ్ రెడ్ ఎడిషన్ పల్సర్ ఆర్ఎస్200 కు స్టన్నింగ్ లుక్ తీసుకొచ్చాయి. అయితే, ఇందులో ఉన్న సైడ్ ప్యానల్స్ బ్లాక్ ఫినిషింగ్‌లో ఉండటంతో బ్లాక్ కలర్‌లో ఉన్న పెరిమీటర్ ఫ్రేమ్‌తో కలిసిపోయాయి.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్‌లో రెడ్ కలర్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అయితే, కేవలం ముందువైపు మాత్రమే రెడ్ కలర్ అల్లాయ్ వీల్‌ కలదు, వెనుక వైపున బ్లాక్ అల్లాయ్ వీల్ కలదు.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్

సాంకేతికంగా బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకులో 199.5సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్, ట్రిపుల్ స్పార్క్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌ 24.1బిహెచ్‌పి పవర్ మరియు 18.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ పవర్ మరియు టార్క్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ గుండా రియర్ వీల్‌కు సరఫరా అవుతుంది. పల్సర్ ఆర్ఎస్200 గరిష్ట వేగం గంటకు 141కిలోమీటర్లుగా ఉంది.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్

రేసింగ్ మోటార్ సైకిల్‌కు ఉండాల్సిని తప్పనిసరి ఫీచర్లను బజాజ్ తమ ఆర్ఎస్200లో అందించింది. అందులో, ట్విన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పదునైన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్, డిజిటల్ అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, పొట్టిగా లావుగా ఉన్న ఎగ్జాస్ట్ పైపు మరియు అత్యుత్తమ హ్యాండ్లింగ్ మరియు సుపీరియర్ రైడింగ్ కల్పించే పెరీమీటర్ ఫ్రేమ్ కలదు.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్

పల్సర్ ఆర్ఎస్200లో ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ నైట్రోక్స్ అబ్జార్వర్, బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందువైపున 300ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 230ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఫ్రంట్ వీల్‌కు సింగల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు వెనుక చక్రానికి సెన్సార్ గల రియర్-వీల్ లిఫ్ట్-ఆఫ్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఉంది.

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 రేసింగ్ రెడ్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో తమ పల్సర్ ఆర్ఎస్200 ఎంట్రీ లెవల్ రేసింగ్ బైకులో మరో కొత్త కలర్ ఆప్షన్స్ జోడించింది. సరికొత్త రేసింగ్ రెడ్ కలర్ పరిచయంతో ఇప్పుడిది మొత్తం విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. సాంకేతికంగా మరియు ఫీచర్లు పరంగా ఎలాంటి అప్‌డేట్స్ జరగకపోయినా ఈ న్యూ కలర్ బైకులో ఒక ఫ్రెష్ లుక్ తీసుకొచ్చింది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Bajaj Pulsar RS200 Racing Red Edition Launched In India; Prices Start At Rs 1.23 Lakh
Story first published: Saturday, February 3, 2018, 11:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X