ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు సైకిళ్లను ఆవిష్కరించిన హీరో

హీరో ఎలక్ట్రిక్ తాజాగా మూడు అంతర్జాతీయ ఉత్పత్తులను మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఆవిష్కరించడాని సిద్దం చేసింది.

By Anil

Recommended Video

Auto Rickshaw Explodes In Broad Daylight

భారతదేశపు అతి పెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ దిగ్గజం హీరో ఎలక్ట్రిక్ తాజాగా మూడు అంతర్జాతీయ ఉత్పత్తులను మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఆవిష్కరించడాని సిద్దం చేసింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

హీరో ఎలక్ట్రిక్ సిద్దం చేసిన మూడు ఉత్పత్తులలో ఏ2బి స్పీడ్ మరియు కువొ బూస్ట్ అనే రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లు మరియు ఏఎక్స్ఎల్ హెచ్ఇ-20 కోడ్ పేరుతో అభివృద్ది చేసిన ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

హీరో ఎలక్ట్రిక్ ఈ మూడు మోడళ్లను వివిధ దశలలో 2018 చివరి నాటికల్లా మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో పదేళ్లు పూర్తి చేసుకున్నందుకుగాను "10 ఇయర్స్ ఎహెడ్" అనే క్యాంపెయిన్ ప్రారంభించింది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

హీరో ఎలక్ట్రిక్ గత దశాబ్దం కాలంలో 15 ఎలక్ట్రిక్ స్కూటర్లను విపణిలోకి విడుదల చేసి, ఎలక్ట్రిక్ స్కూటర్ల సెగ్మెంట్లో 65 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

కంపెనీ విడుదలకు సిద్దం చేసిన ఏఎక్స్ఎల్ హెచ్ఇ-20 ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో 4,000-వాట్ సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. దీని గరిష్ట పవర్ 6,000-వాట్స్.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

గంటకు 85కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల ఈ స్కూటర్ సింగల్ ఛార్జింగ్‌తో 110కిమీలు ప్రయాణిస్తుంది. ఇందులోని లిథియం-అయాన్ బ్యాటరీ నాలుగు గంటల్లో పూర్తీగా ఛార్జ్ అవుతుంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ స్కూటర్‍‌లో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు. ఇది స్కూటర్ పనితీరును మెరుగుపరిచి మరియు బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. కీలెస్ ఎంట్రీ మరియు జిపిఎస్ ట్రాకింగ్ ఇంకా ఎన్నో ఫీచర్లు గల ప్రత్యేక యాప్ కూడా ఉంది. అంతే కాకుండా స్కూటర్‌ను క్లౌడ్ పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటే రెగ్యులర్ సర్వీసింగ్ గురించి ఓనర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

హీరో ఎలక్ట్రిక్ నూతన స్కూటర్‌తో పాటు రెండు సరికొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను కూడా సిద్దం చేసింది. ఏ2బి స్పీడ్ సైకిల్‌లోని 500-వాట్ సామర్థ్యం గల ఎలక్ట్రి మోటార్‌‌కు 36 వోల్ట్ బ్యాటరీ నుండి పవర్ అందుతుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్‌తో 70కిలోమీటర్ల వరకు నడిచే దీని గరిష్ట వేగం గంటకు 45కిమీలుగా ఉంది.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

హీరో ఎలక్ట్రిక్ మరో సైకిల్ ఏ2బి కువొ బూస్ట్. ఇందులో కాస్త తక్కువ సామర్థ్యం గల 350-వాట్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. గంటకు 32కిమీలు ప్రయాణించే ఈ సైకిల్ సింగల్ ఛార్జింగ్‌తో 60కిమీలు నడుస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్ మీద తయారు చేసిన ఈ సైకిళ్ల బరువు 20కిలోలుగా ఉంది. వీటిలో, ఏ2బి కువొ బూస్ట్ సైకిల్‌ను మడిపేయవచ్చు.

హీరో ఎలక్ట్రిక్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎలక్ట్రిక్ వాహన రవాణాలో ఎలక్ట్రిక్ స్కూటర్లు కీలకపాత్ర పోషించనున్నాయి. దేశీయంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో హీరో ఎలక్టిక్ సింహ భాగంలో ఉంది. హీరో ఇప్పటికే విభిన్న ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు చేపట్టింది.

ఫ్యూచర్ కోసం హీరో సిద్దం చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లను మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించి, ఆ తరువాత విడతల వారీగా లాంచ్ చేయనుంది. మరిన్ని ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం డ్రైవ్‌‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Hero Electric Unveils Two New Bicycles And Scooter In India
Story first published: Monday, February 5, 2018, 10:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X