నమ్మినా... నమ్మకపోయినా... ఇది ఖచ్చితంగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకే...!!

బైక్ మోడిఫికేషన్స్‌కు ప్రసిద్దిగాంచిన ప్రముఖ బుల్లెటీర్ కస్టమ్స్ బృందం తమ అద్భుతమైన మోడిఫికేషన్స్ నెపుణ్యంతో రెగ్యులర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకును ఎవరి ఊహకు తట్టని రీతిలో బ్లాక్‌ఔట్ పేరుతో రూపొందించి.

By Anil Kumar

Recommended Video

India Car Stunts Caught On Camera

రాయల్ ఎన్ఫీల్డ్ తలచుకోగానే, మన మనస్సులో మెదిలే బైకులు క్లాసిక్, బుల్లెట్, థండర్‌బర్డ్. కానీ, ఈ మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకు మీ మనస్సును ఔరా అనిపించడం ఖాయం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇంకా నమ్మశక్యం కాలేదు కదూ...?

మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్

మీరే కాదు, ఎన్నో మోడిఫైడ్ బైకుల గురించి ప్రచురించిన డ్రైవ్‌స్పార్క్ కూడా దీనిని మొదట్లో చూసినపుడు నమ్మలేకపోయింది. కానీ ఖచ్చితంగా నమ్మితీరాల్సిందే. ప్రతి రైడర్ హృదయాన్ని దోచుకునే ఈ మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫోటోలు మరియు ఇతర వివరాలు ఇవాళ్టి కథనంలో...

మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్

భారత్‌లో బైక్ మోడిఫికేషన్స్‌కు ప్రసిద్దిగాంచిన ప్రముఖ బుల్లెటీర్ కస్టమ్స్ బృందం తమ అద్భుతమైన మోడిఫికేషన్స్ నెపుణ్యంతో ఒక రెగ్యులర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకును ఎవరి ఊహకు తట్టని రీతిలో రూపొందించి బ్లాక్‌అవుట్ అనే పేరును పెట్టింది.

మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్

ఈ మోడిఫైడ్ ఎన్ఫీల్డ్ డిజైన్ పరంగా ఔత్సాహికులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఫ్రంట్ డిజైన్‌లో అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, ఆధునిక వీల్స్ మరియు రబ్బరు టైర్లు బైకు మొత్తాన్నికి ఒక కొత్త లూక్ తీసుకొచ్చాయి.

మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్

ఫ్రంట్ హెడ్ ల్యాంప్ ఇప్పటికి వరకు మీరు చూసిన వాటికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఎల్ఇడి ఇల్యుమినేషన్ జోడింపుతో సహా ఉన్న ఫ్లష్ ఫిట్టింగ్ ఫెండర్ రౌండ్ హెడ్ ల్యాంప్ ఉంది.

మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్

బైకు ఇంజన్ మరియు ఇతర వివరాలను తెలుసుకునేందుకు సింపుల్‌గా ఉన్న సింగల్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, స్టాండర్డ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ ఉన్నాయి. ఇంజన్, ఫ్రేమ్ మరియు బాడీ వర్క్ మొత్తం బ్లాక్ ఫినిషింగ్‌లో ఉంది.

  • సుజుకి హయాబుసా రూపంలోకి మారిపోయిన హీరో ఎక్స్‌ట్రీమ్
  • రాయల్ ఎన్ఫీల్డ్‌కు ప్రాణం పోసిన కస్టమైజేషన్
  • ఇకపై మీకు నచ్చిన స్టైల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు
  • మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్

    కస్టమైజ్ చేసిన శాడిల్‌ను సరాసరిదా గ్యాస్‌తో నింపిన రియర్ షాక్ అబ్జార్వర్ల మీద నిర్మించారు. తక్కువ ఎత్తులో ఉన్న బకెట్ స్టైల్ సింగల్ సీట్, విభిన్న బాడీ డీకాల్స్ మరియు అధునాతన ఫ్యూయల్ ట్యాంక్ బైకు మొత్తానికి న్యూ లుక్ తీసుకొచ్చాయి.

    మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్

    బుల్లెటీర్ కస్టమైజేషన్ బృందం అందించిన ఫాక్స్ ఎగ్జాస్ట్ పైపులు, పెద్ద పరిమాణంలో ఉన్న రియర్ టైర్, నూతన డిజైన్‌లో ఉన్న ఫ్రంట్ అండ్ రియర్ వీల్స్, స్మింగ్ ఆర్మ్ ప్రత్యేక ఆర్షణగా నిలిచాయి.

    మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్

    ఒక్క ఇంజన్ మినహాయి, ఈ బైకులో అన్ని కొత్తవే. అందుకే కాబోలు చూసిన వెంటనే ఎవ్వరూ ఒక పట్టాన రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒప్పుకోరు. ఏదేమైనప్పటికీ రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో ఏ బైక్ ఆధారంగా దీనిని నిర్మించారో తెలియరాలేదు.

    మోడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్

    మీకు కూడా ఇలాంటి కస్టమైజ్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కావాలంటే వారి అఫీషియల్ ఫేస్‌బుక్ ద్వారా లేదంటే ఈ ఇ-మెయిల్([email protected]) అండ్రస్ ద్వారా బుల్లెటీర్ కస్టమ్స్ బృందాన్ని సంప్రదించండి.

    Trending DriveSpark Telugu YouTube Videos

    Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Picture credit: Bulleteer Customs

More from DriveSpark

Article Published On: Friday, February 2, 2018, 12:46 [IST]
English summary
Read In Telugu: Modified Royal Enfield: If The Streetlights Go Out, Blame It On The Blackout
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+