రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కస్టమైజ్ బైకులు

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు అదే పాత డిజైన్ మరియు అవే కలర్ ఆప్షన్‌లలో ఉంటాయి. కానీ అవే బైకులను కస్టమైజ్ చేస్తే, బోర్‌గా అనిపించే పాత డిజైన్ లుక్‌ను పూర్తిగా మార్చేస్తాయి. కస్టమైజ్ చేసిన బైకులు పూర్తిగా అందుబాటులోకి వస్తే, రాయల్ ఎన్ఫీల్డ్ పాత డిజైన్ శకం ముగిసినట్లే.

రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కస్టమైజ్ బైకులు

నాలాంటి బైకు లేదా నాలాంటి కారు ఎవరివద్దా ఉండకూడదు అనుకునే వారు తమ వెహికల్స్‌తో కస్టమైజేషన్ సెంటర్ల వద్దకు వెళ్లి ఇష్టమొచ్చినట్లు రూపురేఖలన్నీ మార్చేస్తారు. పాశ్చ్యాత దేశాల్లో సహజంగా ఉండే ఈ సంస్కృతి దేశీయంగా మంచి డిమాండ్ సొంతం చేసుకుంటోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కస్టమైజ్ బైకులు

ఈ తరుణంలో కస్టమైజేషన్‌కు అనువుగా ఉండే రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఎంచుకుని, రాయల్ ఎన్ఫీల్డ్ సైతం ఆశ్చర్యపోయేవిధంగా మార్చేస్తున్నారు. ఇలాంటి బైకులకు పెరుగుతున్న డిమాండ్ పసిగట్టి రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఇక మీదట కస్టమర్లు కోరుకునే విధంగా రూపొందించనున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కస్టమైజ్ బైకులు

కస్టమర్లకు కస్టమైజ్ బైకులను అందివ్వడానికి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ నాలుగు కస్టమ్ బైకు బిల్ట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఔత్సాహికులు కోరుకున్న రీతిలో బైకులను కస్టమైజ్ చేయించి, అందజేయనున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కస్టమైజ్ బైకులు

కస్టమైజేషన్‌లో మంచి అనుభవం గడించిన ఇన్‌లైన్ త్రీ, టిఎన్‌టి మోటార్‌సైకిల్స్, బుల్ సిటి కస్టమ్స్ మరియు బాంబే కస్టమ్ వర్క్స్ వంటి సంస్థలు రాయల్ ఎన్ఫీల్డ్ వారి రెండు బైకులను కస్టమైజ్ చేయనున్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కస్టమైజ్ బైకులు

ఈ ఒప్పందం ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ మోడల్స్ అయిన క్లాసిక్ 500 మరియు కాంటినెంటల్ జిటి మోటార్ సైకిళ్లను వ్యక్తిగతంగా ఎంచుకునేవారికి కస్టమైజేషన్ ఆప్షన్ చాలా ఉపయోగపడనుంది. ఈ సంధర్భంగా ఈ నాలుగు కస్టమైజేషన్ కంపెనీల నుండి సేకరించిన కొన్ని నూతన డిజైన్ మోడళ్లను ఆవిష్కరించడం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కస్టమైజ్ బైకులు

ప్రస్తుతం జనరేషన్‌లో విభిన్న కలర్ ఆప్షన్స్, క్రోమ్ ఎలిమెంట్స్, కాపర్ మరియు కలప విడి భాగాల జోడింపుతో మెటల్ మరియు లెథర్ మెటీరియల్ ఉన్న బైకులకు ఎక్కువ డిమాండ్ ఉంది. బైకులకు మాత్రమే కాకుండా, వాటిని నడిపే వారి కోసం కూడా కస్టమైజ్ కంపెనీల పేరుతో ఉన్న టి-షర్ట్స్ అందివ్వనున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కస్టమైజ్ బైకులు

అంతే కాకుండా క్రోమ్, కార్బన్ మరియు బైక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్న హెల్మెట్లను, గ్లూవ్స్, బెల్ట్, బ్యాడ్జెస్ మరియు బూట్లు వంటి కంప్లీట్ రైడ్ కలెక్షన్‌ను కస్టమైజ్‍‌డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఎంచుకోవడం ద్వారా పొందవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కస్టమైజ్ బైకులు

ఈ మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమైజ్ బైకులను అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్, కంపెనీ స్టోర్స్, మరియు ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లో అదే విధంగా, ఇ-కామర్స్ పోర్టల్స్ అయిన "ఫ్లిప్‌కార్ట్ "మరియు "మింత్రా"లలో వీటిని కొనుగోలు చేయవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కస్టమైజ్ బైకులు

రాయల్ ఎన్ఫీల్డ్ యాక్ససరీ బిజినెస్ హెడ్ సామ్రాట్ సామ్ మాట్లాడుతూ, "దేశీయ పరిజ్ఞానంతో మోటార్ సైకిళ్లకు కస్టమైజేషన్స్ నిర్వహిస్తున్న నాలుగు దేశీయ కస్టమ్ బైక్ బిల్ట్ కంపెనీల భాగస్వామ్యంతో, కస్టమర్లకు నచ్చిన స్టైల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఎంచుకునే అవకాశాన్ని కల్పించినట్లు చెప్పుకొచ్చాడు".

రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కస్టమైజ్ బైకులు

భారీ ధర వెచ్చించి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను కొనుగోలు చేసి, మళ్లీ వాటికి మోడిఫికేషన్స్ నిర్వహించడం చాలా భారంగా మారుతోంది. ఈ తరుణంలో రాయల్ ఎన్ఫీల్డ్ తమ బైకులకు కస్టమైజేషన్ నిర్వహించి అందివ్వడం ద్వారా విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Royal Enfield Ties Up With Designers; Reveals Four Custom Builds
Story first published: Wednesday, June 21, 2017, 20:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark