హీరో ఎక్స్‌ట్రీమ్ బైకును సుజుకి హయాబుసా సూపర్ బైకులా చేశారు

Written By:

హీరో ఎక్స్‌ట్రీమ్ బైకు ధర రూ. 77 వేలు, సుజుకి హయాబుసా సూపర్ బైక్ ధర రూ. 14 లక్షలుగా ఉంది. ధర, ఇంజన్, డిజైన్ మరియు ఫీచర్ల పరంగా రెండింటి మధ్య ఇసుమంత పోలిక కూడా లేదు. కానీ ఓ బైక్ మోడిఫికేషన్ బృందం హయాబుసాకు అచ్చు వేసినట్లుగా హీరో ఎక్స్‌ట్రీమ్‌ను మార్చేశారు.

మోడిఫైడ్ హీరో ఎక్స్‌ట్రీమ్

అద్భుతమైన మోడిఫికేషన్ పరిజ్ఞానంతో ఇండియన్ స్ట్రీట్ బైకు ఎక్స్‌ట్రీమ్‌ను అత్యంత ఖరీదైన సూపర్‌ బైకుగా రూపొందించారు. బైకు ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ మోడిఫైడ్ హయాబుసా ఎక్స్‌ట్రీమ్ బైకు గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

Recommended Video - Watch Now!
[Telugu] Mahindra KUV100 NXT Launched In India - DriveSpark
మోడిఫైడ్ హీరో ఎక్స్‌ట్రీమ్

ఢిల్లీకి చెందిన జిఎమ్ కస్టమ్ మోడిఫికేషన్ బృందం హీరో ఎక్స్‌ట్రీమ్ బైకును సుజుకి హయాబుసా సూపర్ బైకు రూపంలోకి మోడిఫై చేశారు.

మోడిఫైడ్ హీరో ఎక్స్‌ట్రీమ్

ఇందులో చేసిన అతి ప్రదానమైన మార్పు బాడీ ఫ్రేమ్ వర్క్. హీరో ఎక్స్‌ట్రీమ్ బాడీ డీకాల్స్ మొత్తాన్ని తొలగించిన హయాబుసాను పోలి ఉండే ఫ్రేమ్‌ను ఫిట్ చేశారు. దీనికి తోడుగా రియర్ సస్పెన్షన్ సిస్టమ్‌ను పట్టి ఉంచేందుకు నూతన కస్టమైజ్డ్ స్వింగ్ ఆర్మ్ అందించారు.

మోడిఫైడ్ హీరో ఎక్స్‌ట్రీమ్

సస్పెన్షన్ కోసం వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లు మరియు ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ అందివ్వడం జరిగింది. అత్యుత్తమ బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు రెండు డిస్క్ బ్రేకులు, రియర్ వీల్‌కు సింగల్ డిస్క్ బ్రేక్ అందివ్వడం జరిగింది.

మోడిఫైడ్ హీరో ఎక్స్‌ట్రీమ్

మార్కెట్లో లభించే అల్లాయ్ వీల్స్ మరియు రబ్బర్ టైర్లను జోడించారు. ఇక డిజైన్ మరియు ఇస్ట్రుమెంట్ క్లస్టర్ పరంగా హయాబుసాను పోలి ఉండేందుకు పూర్తి స్థాయి డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, హయాబుసా లోగో మరియు స్విచ్చులను అందించారు.

మోడిఫైడ్ హీరో ఎక్స్‌ట్రీమ్

ఎక్ట్సీరియర్ బాడీ వర్క్ మినహాయిస్తే, సాంకేతికంగా ఎక్స్‌ట్రీమ్‌లో ఉన్న అదే ఇంజన్ కలదు. నిజానికి హీరో ఎక్స్‌ట్రీమ్ ఫేస్‌లిఫ్ట్ 2014లో విడుదలయ్యింది. అయితే కొంత కాలం తరువాత మార్కెట్ నుండి వైదొలగింది. దీని స్థానంలోకి ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ లాంచ్ అయ్యింది.

మోడిఫైడ్ హీరో ఎక్స్‌ట్రీమ్

సాంకేతికంగా ఇందులో 149.2సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 8,500ఆర్‌పిఎమ్ వద్ద 15.2బిహెచ్‌పి పవర్ మరియు 6,500ఆర్‌పిఎమ్ వద్ద 12.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

English summary
Read In Telugu: Hero Xtreme modified into a Suzuki Hayabusa replica
Story first published: Thursday, November 23, 2017, 20:42 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark