2018 అవెంజర్ సిరీస్ బైకులను విడుదల చేసిన బజాజ్

Written By:

బజాజ్ ఆటో విపణిలోకి 2018 సిరీస్ అవెంజర్ బైకులను విడుదల చేసింది. అవెంజర్ సిరీస్‌లో ఇది వరకు ఉన్న క్రూయిజ్ 220, స్ట్రీట్ 220 మరియు స్ట్రీట్ 150 బైకులను 2018 ఎడిషన్‌లో లాంచ్ చేసింది.

2018 బజాజ్ అవెంజర్ బైకులు

వీటి ధరలు, అవెంజర్ క్రూయిజ్ 220 మరియు అవెంజర్ స్ట్రీట్ 220 ధర రూ. 93.466 లు, మరియు అవెంజర్ స్ట్రీట్ 150 ధర రూ. 81,459. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

2018 బజాజ్ అవెంజర్ బైకులు

వీటి ధరలు, అవెంజర్ క్రూయిజ్ 220 మరియు అవెంజర్ స్ట్రీట్ 220 ధర రూ. 93.466 లు, మరియు అవెంజర్ స్ట్రీట్ 150 ధర రూ. 81,459. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

2018 బజాజ్ అవెంజర్ బైకులు

అవెంజర్ సిరీస్ బైకుల్లో మూడు మోడళ్లలో అప్‌డేటెడ్ హెడ్ ల్యాంప్స్ మరియు న్యూ కలర్ స్కీమ్స్ వచ్చాయి. 2018 అవెంజర్ 220 క్రూయిజ్ బైకులో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో కొత్తగా డిజైన్ చేసిన క్లాసిక్ హెడ్ ల్యాంప్ మరియు స్వల్ప మార్పులకు గురైన సైడ్ ప్యానల్స్ ఉన్నాయి.

2018 బజాజ్ అవెంజర్ బైకులు

ఫ్రంట్ డిజైన్‍‌లో పొడవాటి విండ్ స్క్రీన్, క్రోమ్ బ్రాకెట్ మరియు క్రూయిజ్ వేరియంట్లో పిలియన్ రైడర్ బ్యాక్ రెస్ట్ వంటివి ఉన్నాయి. పెద్దగా ఉన్నఅవెంజర్ చిహ్నం మరియు కొత్త డీకాల్స్ ఉన్నాయి. 2018 అవెంజర్ బైకుల్లో అదనంగా వచ్చిన మరో నూతన ఫీచర్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్.

2018 బజాజ్ అవెంజర్ బైకులు

అవెంజర్ క్రూయిజ్ మరియు స్ట్రీట్ రెండు బైకుల్లో నీలం మరియు ఆరేంజ్ రంగుల్లో ఉండే క్లస్టర్ బ్యాక్ లైట్ మరియు సూర్యరశ్మి సరాసరి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మీద పడకుండా ఉండేందుకు ప్రత్యేకమైన గిన్నెలాంటి ఆకారం ఒకటి ఉంది.

2018 బజాజ్ అవెంజర్ బైకులు

2018 బజాజ్ అవెంజర్ 220 క్రూయిజ్ బైకులో ఇరువైపులా స్పోక్ వీల్స్, కొత్తగా డిజైన్ చేయబడిన సీటు, విశాలమైన హైవే కంఫర్ట్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి. సరికొత్త అవెంజర్ క్రూయిజ్ 220 ఆబర్న్ బ్లాక్ మరియు మూన్‌లైట్ వైట్ రంగుల్లో లభ్యమవుతోంది.

Trending On DriveSpark Telugu:

2018 హీరో హెచ్ఎఫ్ డాన్ బైక్ లాంచ్: ధర రూ. 37,400 లు

మహీంద్రా నుండి మోజో యుటి300 బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్

హైవే మీద ఆల్టో కార్ల రేసింగ్: నుజ్జునుజ్జయిన కార్లు

2018 బజాజ్ అవెంజర్ బైకులు

అవెంజర్ లోని స్ట్రీట్ 220 మరియు 150 బైకుల్లో వచ్చిన హెడ్ ల్యాంప్ చూడటానికి ఎల్ఇడి డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్‌తో రోడ్‌స్టర్ డిజైన్‌ను పోలి ఉంటుంది. అయితే, వీటిలో పొడవాటి విండ్ స్క్రీన్ మిస్సయ్యింది, కానీ స్థానంలో చిన్న పరిమాణంలో ఉన్న బ్లాక్ కౌల్ ఒకటి వచ్చింది, స్ట్రీట్ వేరియంట్లో చిన్న హ్యాండిల్ బార్, అల్లాయ్ వీల్స్ మరియు నూతన గ్రాబ్ రెయిల్ కలవు.

2018 బజాజ్ అవెంజర్ బైకులు

బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 220 మరియు 150 బైకులు బజాజ్ వి సిరీస్ బైకుల తరహా ప్రత్యేకమైన బాడీ డీకాల్స్ కలిగి ఉన్నాయి. టెయిల్ ల్యాంప్ కూడా కాస్త పలుచగా ఉంటుంది. అవెంజర్ స్ట్రీట్ 220 మ్యాట్ బ్లాక్ మరియు మ్యాట్ వైట్ రంగుల్లో మరియు అవెంజర్ స్ట్రీట్ 150 కేవలం మిడ్ నైట్ బ్లూ పెయింట్ స్కీమ్‌లో మాత్రమే లభ్యమవుతోంది.

2018 బజాజ్ అవెంజర్ బైకులు

అవెంజర్ క్రూయిజ్/స్ట్రీట్ 220 బైకుల్లో 220సీసీ కెపాసిటి గల ట్విన్ స్పార్క్ ఆయిల్ కూల్డ్ సింగల్ సిలండర్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 18.7బిహెచ్‌పి పవర్ మరియు 17.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2018 బజాజ్ అవెంజర్ బైకులు

అదే విధంగా బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150 బైకులో 150సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది 14.34బిహెచ్‌పి పవర్ మరియు 12.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2018 అవెంజర్ సిరీస్ బైకుల్లో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

2018 బజాజ్ అవెంజర్ బైకులు

2018 అవెంజర్ క్రూయిజ్/స్ట్రీట్ 220 బైకుల్లో బ్రేకింగ్ విధుల కోసం ముందు చక్రానికి 260ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక చక్రానికి 130ఎమ్ఎమ్ డ్రమ్ కలదు. అవెంజర్ స్ట్రీట్ 150 బైకులో ఫ్రంట్ వీల్‌కు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు. బజాజ్ తమ అవెంజర్ శ్రేణి బైకుల్లో కనీసం ఆప్షనల్‌గా కూడా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందివ్వలేదు.

2018 బజాజ్ అవెంజర్ బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త తరం అవెంజర్ సిరీస్ బైకులు డిజైన్ పరంగా చాలా కొత్తగా ఉన్నాయి. సరికొత్త హెడ్ ల్యాంప్ మరియు ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ అవెంజర్ బైకుల్లో జరిగిన అతి ప్రధానమైన మార్పులు. అవెంజర్ అన్ని బైకులు సుజుకి కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఇంట్రూడర్ 150 మోటార్ సైకిల్‌కు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: 2018 Bajaj Avenger Launched In India; Prices Start At Rs 81,459
Story first published: Thursday, January 18, 2018, 18:48 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark