విపణిలోకి విడుదలైన 2018 బజాజ్ డామినర్ 400: ఇవీ ప్రత్యేకతలు!!

Written By:
Recommended Video - Watch Now!
Indian Army Soldiers Injured In Helicopter Fall - DriveSpark

బజాజ్ ఆటో విపణిలోకి 2018 ఎడిషన్ డామినర్ 400 బైకును లాంచ్ చేసింది. డామినర్ 400 స్పోర్ట్స్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ ఎక్ట్సీరియర్‌లో మూడు విభిన్న రంగుల్లో మరియు పలు రకాల కాస్మొటిక్ మెరుగులతో లాంచ్ చేసింది.

2018 ఎడిషన్ డామినర్ 400

2018 ఎడిషన్ డామినర్ 400 బైకులు 2017 మోడల్ ధరలతోనే అందుబాటులోకి వచ్చాయి. ఎలాంటి ధరల పెంపు చేపట్టకుండానే అప్‌డేటెడ్ వెర్షన్ డామినర్ 400 బైకులను బజాజ్ లాంచ్ చేసింది.

2018 బజాజ్ డామినర్ 400

ప్రస్తుతం, బజాజ్ డామినర్ 400 నాన్-ఏబిఎస్ వెర్షన్ ప్రారంభ ధర రూ. 1.42 లక్షలు మరియు ఏబిఎస్ వెర్షన్ డామినర్ 400 ధర రూ. 1.56 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

2018 బజాజ్ డామినర్ 400

2018 ఎడిషన్ డామినర్ 400లో చోటు చేసుకున్న ప్రధాన మార్పుల్లో కొత్త కలర్ ఆప్షన్స్ కీలకం. డామినర్ 400 ఇప్పుడు రాక్ మ్యాట్ బ్లాక్, క్యానాన్ రెడ్ మరియు గ్లాసీయర్ బ్లూ. 2018 డామినర్ 400 బైకులో గోల్డెన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

2018 బజాజ్ డామినర్ 400

సాంకేతికంగా 2018 డామినర్ 400 స్పోర్ట్స్ క్రూయిజర్ బైకులో అదే మునుపటి ఇంజన్ కలదు. కెటిఎమ్ నుండి సేకరించిన 373.3సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

2018 బజాజ్ డామినర్ 400

స్లిప్పర్ క్లచ్ పరిజ్ఞానంతో 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 34.5బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Trending On DriveSpark Telugu:

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

ఎప్పటికీ మరచిపోలేని టైటానిక్ విషాదం గురించి చరిత్ర మిగిల్చిన నిజాలు

2018 బజాజ్ డామినర్ 400

సస్పెన్షన్ కోసం ముందు వైపున కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు 320ఎమ్ఎమ్ మరియు రియర్ వీల్‌కు 230ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు అందివ్వడం జరిగింది.

2018 బజాజ్ డామినర్ 400

యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఆప్షనల్ ఫీచర్‌గా అందివ్వడం జరిగింది. దీనితో పాటు, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యూయల్ ట్యాంక్ మీద సెకండరీ డిస్ల్పే, ఎల్ఇడి లైటింగ్ గల స్టైలిష్ హెడ్ ల్యాంప్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ మరియు స్లిప్పర్ అనే ప్రీమియమ్ ఫీచర్లు ఉన్నాయి.

2018 బజాజ్ డామినర్ 400

బజాజ్ డామినర్ 400లో 13-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్ లాంగ్ రైడింగ్ చక్కగా సరిపోతుంది. బైకు మొత్తం బరువు 182కిలోలుగా ఉంది. బజాజ్ డామినర్ 400 గరిష్టంగా గంటకు 145కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

2018 బజాజ్ డామినర్ 400

బజాజ్ ఆటో డామినర్ 400 బైకులను పూనేలోని చకన్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది.ఈ స్పోర్ట్స్ క్రూయిజర్ బైకును ఇండియన్ మార్కెట్‌తో పాటు పలు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తోంది. అయితే, 2018 ఎడిషన్‌లో డామినర్ 400 లాంచ్ చేయడంతో సేల్స్ ఊపందుకునే అవకాశం ఉంది.

2018 బజాజ్ డామినర్ 400

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లోకి 2016 చివరిలో భారీ అంచనాలతో డామినర్ 400 బైకును లాంచ్ చేసింది. భారత మార్కెట్ మీద పెట్టుకున్న అంచనాలు తారుమారయ్యాయి. కానీ, విదేశీ విపణిలో డామినర్ 400కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. దేశీయంగా ఎలాగైనా రాణించేందుకు ఇప్పుడు భారీ మార్పులతో అవే పాత ధరలకు 2018 ఎడిషన్ డామినర్ 400 బైకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఈసారైనా ఆశించిన ఫలితాలు సాధిస్తుందో లేదో చూడాలి మరి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: 2018 Bajaj Dominar 400 Launched In India; Now Comes With Vibrant Colours
Story first published: Friday, January 12, 2018, 10:42 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark