రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బుల్లెట్ బైకు: ఇక మీదట ఆ సౌండ్ లేనట్లేనా..?

Written By:

రాయిల్ ఎన్ఫీల్డ్ బైకుల ఎగ్జాస్ట్ పైపు నుండి వచ్చే ఆ శబ్దమే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీకి ప్రాణం. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఎంచుకునే కస్టమర్లు ఎక్కువగా ఆ సౌండ్ కోసమే తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ శబ్దం లేకుండా బైకులను ఉత్పత్తి చేస్తే, మరి రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి...?

 రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

సమాధానం గురించి తల బద్దలుకొడితే, ఆధారం లేని ఆన్సర్స్ ఎన్నో బుర్రను చేరుతాయి. గర్వంగా ఫీల్ అయ్యే ఆ సౌండ్ ఇచ్చి బైకుల ఉత్పత్తిని నిలిపివేయడం, లేదా వాటి స్థానంలో కొత్త బైకులను ప్రవేశపెట్టడం. ఏదైనప్పటికీ ఈ మార్పును చాలా మంది కస్టమర్లు అంగీకరించకపోవచ్చు.

Recommended Video - Watch Now!
Watch Now | Indian Navy's MiG-29K Crashed In Goa Airport | Full Details - DriveSpark
 రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

అసలు విషయానికి వస్తే, తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ సిఇఒ సిద్దార్థ్ లాల్ ఎప్పటికైనా భవిష్యత్తులో టూ వీలర్లు పూర్తి స్థాయిలో విభాగంలోకే మారాల్సి ఉంటుందని వెల్లడించాడు. అంటే రాయల్ ఎన్పీల్డ్ కూడా తమ అదే పాత డిజైన్ శైలిలో ఎలక్ట్రిక్ టూ వీలర్లను ఉత్పత్తి చేస్తుందన్నమాట.

 రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

ఇటీవలె, రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఫోటోలు కొన్ని ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టాయి. థాయిలాండ్ లోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్‌లో ప్రదర్శించిన ఎలక్ట్రిక్ బైక్ ఫోటోలు అని తెలుస్తోంది.

 రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

ఇంజన్ స్థానంలో బ్యాటరీ సిస్టమ్ అమర్చడానికి ఛాసిస్‌ రీడిజైన్ చేయబడింది. సాధారణ బైకులో ఉండే చైన్ డ్రైవ్ బదులుగా ఈ ఎలక్ట్రిక్ బైకులో బెల్ట్ డ్రైవ్ ఉంది. అంతే కాకుండా ఇందులో స్మార్ట్ ఫోన్ అనుసంధానిత ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. అయితే, ఎగ్జాస్ట్ పైప్ ఇచ్చే ఫేమస్ సౌండ్ ఇందులో మిస్సయ్యింది.

 రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

చూడటానికి ఇది క్లాసిక్ 350 మోడల్‌ను పోలి ఉంటుంది మినహాయిస్తే,రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకు గురించి కంపెనీ నుండి ఎలాంటి సమాచారం లేదు. వెనుక వైపున ఓహ్లిన్స్ కంపెనీ నుండి సేకరించిన సస్పెన్షన్ కలదు.

Trending On DriveSpark Telugu:

రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్లు... ఇక మీ ఆటలు సాగవు

మొన్న థండర్‌బర్డ్ 500X నేడు 350Xతో పట్టుబడిన రాయల్ ఎన్ఫీల్డ్

2018 మారుతి స్విఫ్ట్ ధరలు వచ్చేశాయ్!! రూ. 4.99 లక్షలకే కొత్త తరం స్విఫ్ట్

 రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ ఎలక్ట్రిక్ బైకు ప్రాజెక్ట్‌ను నిజంగానే రాయల్ ఎన్ఫీల్డ్ అభివృద్ది చేసిందా... లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ అభిమాని ఇలా రూపొందించాడా అనే విషయం తెలియాల్సి ఉంది.

 రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకు గురించిన వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. 2005లో ఇంగ్లాండుకు చెందిన ఓ వ్యక్తి 11 నిస్సాన్ లీఫ్ బ్యాటరీలను రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 బైకులో అమర్చాడు. సింగల్ ఛార్జింగ్‌తో 100కిమీలు ప్రయాణించిన అది, గరిష్టంగా గంటకు 110కిమీల వేగాన్ని అందుకుంది.

 రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్ పెట్రోల్‌తో బుసలు కొట్టి, అరుదైన శబ్దాన్నిచ్చే బైకును ఇంకా అభివృద్ది చేస్తూనే ఉంది. కాబట్టి, రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడప్పుడే శాశ్వతంగా ఎలక్ట్రిక్ టూ వీలర్ల అభివృద్ది మరియు తయారీ మీదకు మళ్లే అవకాశాలు దాదాపు తక్కువే.

కాబట్టి, ఎవరో రాయల్ ఎన్ఫీల్డ్ ఔత్సాహికులు ఇలా ఇంజన్‌ను తొలగించి దాని స్థానంలో ఎలక్ట్రిక వ్యవస్థను ఏర్పాటు చేసి రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకు అంటూ రూమర్లు క్రియేట్ చేసి ఉండవచ్చు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Royal Enfield Electric Motorcycle Showcased At Company's Thailand Showroom
Story first published: Wednesday, January 3, 2018, 19:11 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark