Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 12 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 13 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 13 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎలక్ట్రిక్ మోటార్‌తో నడిచే బైకులను సిద్దం చేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్
ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో తలపడటానికి సిద్దమైన మరో టూ వీలర్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్. దేశీయ మరియు అంతర్జాతీయ విపణిలో రెట్రో మోటార్ సైకిళ్ల తయారీ సంస్థగా పేరుగాంచిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లోకి నూతన ఉత్పత్తులను ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది.


తాజాగా, రాయల్ ఎన్ఫీల్డ్ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ ఆటోమొబైల్ మీడియాతో మాట్లాడుతూ, ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల అభివృద్ది మీద మరియు పలు కొత్త మోడళ్లను డెవలప్ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఇంజన్ నుండి వచ్చే సౌండ్ ద్వారానే ఎంతో మంది అభిమానుల్ని కూడగట్టుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకుల పరిశ్రమలో ప్రవేశిస్తోందంటే ఆశ్చర్యం వేస్తోంది కదూ...
రాయల్ ఎన్ఫీల్డ్ ప్రెసిడెంట్ ఇంటర్వ్యూలో తెలిపిన మరిన్ని వివరాలు మరియు రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల గురించి పూర్తి వివరాలు నేటి కథనంలో చూద్దాం రండి...

రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైకులను నిర్మించడానికి కావాల్సిన ప్రత్యేక ఎలక్ట్రిక్ ఫ్లాట్‌ఫామ్‌ను అభివృద్ది చేసుకున్నట్లు మరియు ఈ నూతన ఫ్లాట్‌ఫామ్ ఆవిష్కరణ గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ, రుద్రతేజ్ సింగ్ కథనం మేరకు, ఎలక్ట్రిక్ బైకుల తయారీ కోసం ప్రత్యేక్ ఆర్ఇ ఎలక్ట్రిక్ ఫ్లాట్‌ఫామ్ నిర్మిస్తున్నట్లు తెలిపాడు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులంటే, ఇంజన్ నుండి వచ్చే విభిన్నమైన థంప్ శబ్దం మరియు ఎలాంటి రోడ్లమీదనైనా... ఎంతటి బరువునైనా సునాయసంగా లాగడానికి అవసరమయ్యే గరిష్ట టార్క్ మరియు వీటి రెట్రో స్టైల్ డిజైన్‌కు పెట్టింది పేరు.

మరి ఎలక్ట్రిక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు మరియు సాధారణ రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల మధ్య ఎలాంటి వ్యత్యాసాలు ఉండనున్నాయి. కస్టమర్లు ఎలక్ట్రిక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఏం మిస్ అవుతారు...? నిజమే, థంప్... థంప్... అనే శబ్దాన్ని కోరుకునే కస్టమర్లకు ఈ బైకులు ఏ మాత్రం సూట్ అవ్వవు.

కానీ, టార్క్ విషయంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఏదో ఒక అద్భుతం చేయనుంది. పెట్రోల్‌తో నడిచే ఇంజన్ తొలగించడంతో బైకు మొత్తం బరువు సుమారుగా తగ్గనుంది. దీనికి తోడు శక్తివంతమైన మరియు వివేకవంతమైన ఎలక్ట్రిక్ సిస్టమ్ అందిస్తే కస్టమర్లను సంతృప్తిపరిచే టార్క్ సాధ్యం కావడం పెద్ద విషయమేమీ కాదు.

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లకు డిమాండ్ మరియు ఆదరణ పెరగడం అదే విధంగా, కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బైకుల కొనుగోలు ప్రభుత్వ రాయితీలు కూడా అందించే అవకాశం ఉంది. కాబట్టి కస్టమర్లు రాయల్ ఎన్ఫీల్డ్ నుండి కోరుకునే థంప్ శబ్దాన్ని కూడా మరిచిపోయి ఎలక్ట్రిక్ బైకులను ఎంచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ ప్రతినిత్యం ఫాలో అయ్యే కస్టమర్లు ప్రస్తుతం ఉన్న అన్ని రెగ్యులర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులును గమనిస్తే, షోరూమ్ నుండి వచ్చిన బైకులు పెద్ద శబ్దాన్ని ఇవ్వవు. కానీ కస్టమర్లే, సైలన్సర్లను వదులు చేయడం మరియు కంపెనీ సైలెన్సర్ స్థానంలో మోడిఫైడ్ సైలెన్సర్లను ఏర్పాటు చేసుకోవడంతో ఎగ్జాస్ట్ నుండి శబ్దం బిగ్గరగా వస్తుంది.

కాబట్టి రెగ్యులర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు మరియు ఎలక్ట్రిక్ బైకుల మధ్య ఉన్న ఇంజన్ సౌండ్ అంశం ఎక్కువ కాలం నిలవలేకపోవచ్చు. ఏదేమైనప్పటకీ రాయల్ ఎన్ఫీల్డ్ ప్రెసిడెంట్ మాటలు బట్టి చూస్తే, ఎలక్ట్రిక్ బైకుల పరిశ్రమను రాయల్ ఎన్ఫీల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ది చేసిన ట్విన్-సిలిండర్ ఇంజన్‌లను ప్రత్యేకంగా రూపొందించిన కాంటినెంటల్ జిటి మరియు ఇంటర్‌సెప్టార్ మోటార్ సైకిళ్లను గత ఏడాది అంతర్జాతీయ ఆవిష్కరణ చేసింది. కాంటినెంటల్ జిటి 650 మరియు ఇంటర్‌సెప్టార్ 650 బైకులను అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయాడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

Source: AutoCarIndia