ఆటో ఎక్స్‌పో 2018: సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ ఆవిష్కరణ

Written By:

ఆటో ఎక్స్‌పో 2018: జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం సుజుకి మోటార్ సైకిల్స్ ఢిల్లీలో జరుగుతున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. సుజుకి లైనప్‌లో ఉన్న బర్గ్‌మ్యాన్ శ్రేణి నుండి ఎంట్రీ లెవల్ వెర్షన్ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125సీసీ స్కూటర్‌ను భారత మార్కెట్ కోసం తీసుకొచ్చింది.

సరికొత్త సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ గురించి మరిన్ని వివరాలు మరియు ఫోటోల కోసం...

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125సీసీ స్కూటర్‌లో కటింగ్-ఎడ్జ్ ప్రీమియమ్ డిజైన్ కలదు. యురోపియన్ స్కూటర్ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా దీనిని డెవలప్ చేశారు. విభిన్న డిజైన్ శైలితో ఈ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో గేమ్ చేంజర్‌గా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Recommended Video - Watch Now!
Honda XBlade First Look Walkaround, Specs, Details, Features - DriveSpark
సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్

దేశీయంగా వ్యక్తిగత రవాణాకు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ పునర్ఃనిర్వచినం ఇస్తుందని సుజుకి ఇండియా తెలిపింది. సరికొత్త హ్యాండిల్ బార్ డిజైన్, రైడర్ మరియు పిలియన్‌కు సౌకర్యవంతమైన పొడవాటి సీటు, పలుచగా రీడిజైన్ చేయబడిన స్టైలిష్ టెయిల్ లైట్ మరియు రియర్ సెక్షన్ ఉన్నాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌లో ఎన్నో సరికొత్త ఫీచర్లు ఉన్నాయి. నూతన ఎల్ఇడి హెడ్‌ల్యాంప్స్, బాడీ మౌంట్ విండ్‌స్క్రీన్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ వీల్‌కు డిస్క్ బ్రేక్, పొడవాటి ఫుట్ పొజిషన్ వంటివి ఉన్నాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 గురించి ఎలాంటి సాంకేతిక వివరాలు వెల్లడించలేదు. అయితే, ఈ ఏడాదిలోపే పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదల చేస్తున్నట్లు సమాచారం.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్

సాంకేతికంగా ఇందులో సుజుకి ఇండియా యొక్క బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ యాక్సెస్ 125లో ఉన్న అదే 125సీసీ స్కూటర్‌ను ఇందులో అందించే అవకాశం ఉంది. అయితే, ఇది ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్‌లో వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్

బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 మినహా, జపాన్ దిగ్గజం సుజుకి ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శన వేదిక మీద స్కూటర్లు మరియు బైకులను కలుపుకొని మొత్తం 17 విభిన్న మోడళ్లను ఆవిష్కరించింది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్

సుజుకి ఆవిష్కరించిన మరో అతి ముఖ్యమైన మోడల్ 1000సీసీ సెగ్మెంట్లోని జిఎస్ఎక్స్-ఎస్750. హయాబుసా తరువాత సుజుకి మేడిన్-ఇండియా చొరవతో దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న రెండవ అతి పెద్ద మోటార్ సైకిల్ జిఎస్ఎక్స్-ఎస్750.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో 125సీసీ సెగ్మెంట్లో ప్రీమియమ్ స్కూటర్ ప్రవేశపెట్టాలనే ఉద్దేశ్యంతో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ రూ. 60,000 ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Auto Expo 2018: Suzuki Burgman Street Scooter Revealed — Expected Launch Date, Price And Images
Story first published: Tuesday, February 13, 2018, 10:52 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark