సుజుకి జిక్సర్ ఏబిఎస్ వెర్షన్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్

జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి జిక్సర్ బైకును యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ జోడింపుతో లాంచ్ చేసింది.

By Anil Kumar

జపాన్ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి జిక్సర్ బైకును యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ జోడింపుతో లాంచ్ చేసింది. సరికొత్త సుజుకి జిక్సర్ ఏబిఎస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 87,250 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

సుజుకి జిక్సర్ ఏబిఎస్ వెర్షన్ విడుదల

టూ వీలర్ల సేఫ్టీలో అత్యంత కీలమైన ఏబిఎస్ టెక్నాలజీని సుజుకి ఎట్టకేలకు తమ జిక్సర్ శ్రేణిలో పరిచయం చేసింది. జిక్సర్ బైకులోని ఫ్రంట్ వీల్‌కు సింగల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ పరిచయం అయ్యింది.

సుజుకి జిక్సర్ ఏబిఎస్ వెర్షన్ విడుదల

ఏబిఎస్ ఫీచర్‌తో విడుదలైన జిక్సర్ శ్రేణి బైకులో డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. చూడటానికి అచ్చం స్టాండర్డ్ వేరియంట్‌నే పోలి ఉంటుంది. గతంలో, సింగల్ ఛానల్ ఏబిఎస్ జిక్సర్ ఫుల్లీ ఫెయిర్డ్ జిక్సర్ ఎస్ఎఫ్ బైకులో ఆప్షనల్‌గా మాత్రమే లభించేది. ఇప్పుడు సుజుకి బెస్ట్ సెల్లింగ్ బైకు జిక్సర్‌లో తప్పనిసరిగా ఫీచర్‌గా లభ్యమవుతోంది.

సుజుకి జిక్సర్ ఏబిఎస్ వెర్షన్ విడుదల

జిక్సర్ ఫ్రంట్ వీల్ వద్ద ఉన్న డిస్క్ బ్రేక్ వద్ద స్పీడ్ సెన్సార్ ఉంటుంది, ఇది వీల్ స్పీడును గమనిస్తుంది. సడెన్ బ్రేకులు వేసినపుడు వీల్ లాక్‌ను నివారిస్తుంది. దీంతో ఎంతటి వేగంలో అయినా సడెన్ బ్రేకులు వేస్తే చక్రాలు స్కిడ్ కాకుండా కేవలం క్షణాల్లోనే గణనీయంగా తగ్గిస్తుంది.

సుజుకి జిక్సర్ ఏబిఎస్ వెర్షన్ విడుదల

సుజుకి జిక్సర్ ఏబిఎస్ బైకులో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు. అదే మునుపటి 154.9సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 14.5బిహెచ్‌‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్‌ను సమర్థవంతంగా, వేగంగా చల్లబరిచేందుకు సుజుకి జెట్ కూలింగ్ సిస్టమ్ కూడా అందివ్వడం జరిగింది.

సుజుకి జిక్సర్ ఏబిఎస్ వెర్షన్ విడుదల

అంతే కాకుండా ఏబిఎస్ ఫీచర్ అప్‌‌డేటెడ్ సుజుకి జిక్సర్‌లో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్లు అత్యంత ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

సుజుకి జిక్సర్ ఏబిఎస్ వెర్షన్ విడుదల

అంతే కాకుండా, జిక్సర్ ఏబిఎస్ వెర్షన్‌లో చుట్టుకొలత ఎక్కువగా ఉన్న ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి. ఇవి, బైకు ముందు వైపున ధృడత్వాన్ని పెంచి పటిష్టమైన గ్రిప్ కల్పిస్తుంది. దీంతో రైడింగ్‌లో ఉన్నపుడు బైకు బరువు ఉన్నట్లు ఏ మాత్రం అనిపించదు.

సుజుకి జిక్సర్ ఏబిఎస్ వెర్షన్ విడుదల

ఇతర కీలకమైన ఫీచర్లలో... స్పోర్టివ్ ట్విన్ ఎగ్జాస్ట్, త్రీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, టు పీస్ సీట్ కాకుండా స్పోర్టివ్ స్టెప్ సీటు ఉంది. జిక్సర్ ఏబిఎస్ మూడు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. అవి, మెటాలిక్ ట్రిటన్ బ్లూ/గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, క్యాండీ సొనోమా రెడ్/మెటాలిక్ సోనిక్ సిల్వర్ మరియు గ్లాస్ స్పార్కిల్ బ్లాక్.

సుజుకి జిక్సర్ ఏబిఎస్ వెర్షన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి ఎట్టకేలకు జిక్సర్ ఏబిఎస్‌ను పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ చేసింది. గతంలో జిక్సర్ ఎస్ఎఫ్ బైకులో సింగల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఆప్షనల్‌గా అందించింది. అయితే, తాజా విడుదలతో జిక్సర్ శ్రేణిలోని అన్ని వేరియంట్లలో ఏబిఎస్ లభ్యమవుతోంది. ఏబిఎస్ అందివ్వడంతో జిక్సర్ బైకుల్లో బ్రేకింగ్ పనితీరు గణనీయంగా మెరుగుపడింది.

సుజుకి జిక్సర్ ఏబిఎస్ వెర్షన్ విడుదల

నూతన ప్రమాణాల మేరకు, ఏప్రిల్ 2019 నుండి ఇండియన్ మార్కెట్లో లభించే అన్ని 125సీసీ మరియు అంత కంటే ఎక్కువ కెపాసిటీతో లభించే టూ వీలర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను తప్పనిసరి చేసింది. సరికొత్త జిక్సర్ ఏబిఎస్ విపణిలో ఉన్న హోండా సిబి హార్నెట్ 160ఆర్ ఏబిఎస్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్160, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి మరియు యమహా ఎఫ్‌జడ్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki Gixxer ABS Launched In India; Priced At Rs 87,250
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X