2018 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.87 లక్షలు

Written By:
Recommended Video - Watch Now!
Ford Freestyle Walk-Around In 360

సుజుకి మోటార్ సైకిల్ ఇండియా విపణిలోకి 2018 హయాబుసా బైకును విడుదల చేసింది. కొత్త తరం 2018 సుజుకి హయాబుసా ధర రూ. 13.87 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నట్లు సుజుకి పేర్కొంది.

2018 సుజుకి హయాబుసా

సరికొత్త 2018 సూపర్ బైకులో కాస్మొటిక్ అప్‍డేట్స్ మాత్రమే చోటు చేసుకున్నాయి. నూతన కలర్ ఆప్షన్స్‌తో ప్రత్యేకమైన బాడీ గ్రాఫిక్స్ మరియు బాడీ డీకాల్స్ మీద స్వల్ప అప్‌డేట్స్ జరిగాయి.

2018 సుజుకి హయాబుసా

సరికొత్త సుజుకి హయాబుసా ఇప్పుడు మరో రెండు విభిన్న కలర్ ఆప్షన్స్‌లో లభ్యమవుతోంది అవి, పర్ల్ మిరా రెడ్/పర్ల్ గ్లేజియర్ వైట్ మరియు గ్లాస్ స్పార్కిల్ బ్లాక్. 2017 హయాబుసా మోడల్‌కు భిన్నంగా గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ కలర్ మోడల్ అదనంగా రెడ్ గ్రాఫిక్స్ పొందింది.

2018 సుజుకి హయాబుసా

సుజుకి ఇండియా 2016లో దేశీయంగా తయారయ్యే జిఎస్ఎక్స్1300ఆర్ హయాబుసాను విపణిలోకి తెచ్చింది. దిగుమతి చేసుకుని విక్రయించే మోడళ్ల మీద పన్ను భారం తగ్గించేందుకు గుర్గావ్ లోని మానేసర్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది.

2018 సుజుకి హయాబుసా

2018 సుజుకి హయాబుసా సూపర్ బైకులో అదే 1,340సీసీకెపాసిటి గల ఇన్-లైన్ నాలుగు సిలిండర్ల ఫ్యూయల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ డిఒహెచ్‌సి పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 197బిహెచ్‌పి పవర్ మరియు 155ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 సుజుకి హయాబుసా

సుజుకి హయాబుసా సూపర్ బైకు కేవలం 2.74 సెకండ్ల వ్యధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 299కిలోమీటర్లుగా ఉంది.

2018 సుజుకి హయాబుసా

సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా ఈ సరికొత్త 2018 హయాబుసా సూపర్ బైకును ఫిబ్రవరి 7 నుండి 14 మధ్య జరగబోయే 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శనలో ప్రదర్శించనుంది.

2018 సుజుకి హయాబుసా

ఈ కొత్త తరం హయాబుసా బైకుతో మరిన్ని కొత్త మోడళ్లను కూడా సుజుకి ఆవిష్కరించనుంది. అందులో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ప్రీమియమ్ స్కూటర్ మరియు వి-స్ట్రోమ్ 650 అడ్వెంచర్ మోటార్ సైకిల్ ఉన్నాయి.

2018 సుజుకి హయాబుసా

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో ప్రసిద్ది చెందిన సూపర్ బైకుల్లో సుజుకి హయాబుసా ఒకటి. హయాబుసాను తక్కువ ధరతో అందించేందుకు 2016లో జపాన్ దిగ్గజం సుజుకి తమ సూపర్ బైకు తయారీని ఇండియాలో చేపట్టింది. 2017లో తొలి మేడిన్ ఇండియా హయాబుసాను లాంచ్ చేసింది.

2018 సుజుకి హయాబుసా

ఇప్పుడు, బాడీ అప్‌డేట్స్ మరియు కాస్మొటిక్ మెరుగులు అద్ది 2018 వెర్షన్ హయాబుసా సూపర్ బైకును లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో రూ. 19.7 లక్షల ధరతో ఉన్న కవాసకి జడ్ఎక్స్-14ఆర్ నోరు మూయించనుంది.

English summary
Read In Telugu: 2018 Suzuki Hayabusa Launched In India; Priced At Rs 13.87 Lakh
Story first published: Thursday, February 1, 2018, 11:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark