టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్ విడుదల: ధర రూ. 79,715 లు

Written By:

దక్షిణ భారత దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచే ఆర్‌టిఆర్ 160 బైకును రేస్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 79,715 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

రేస్ ఎడిషన్ గ్రాఫిక్స్ గల కాస్మొటిక్ అప్‌డేట్స్ మినహాయి, అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్ బైకులో సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్

టీవీఎస్ గత ఏడాది విడుదల చేసిన అపాచే ఆర్‌టిఆర్ 160 మ్యాట్ రెడ్ ధరలోనే రేస్ ఎడిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 79,715 లు మరియు రియర్ డిస్క్ బ్రేక్ గల రేస్ ఎడిషన్ మోడల్ ధర రూ. 82,044 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్

కొత్తగా విడుదలైన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్‌లోని ఫ్రంట్ మడ్ గార్డ్, ఫ్యూయల్ ట్యాంక్ మరియు సైడ్ డీకాల్స్ వంటివి కేవలం వైట్ కలర్ బాడీ మీద రెడ్ గ్రాఫిక్స్‌ను కలిగి ఉన్నాయి. అంతే కాకుండా అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్ మీద త్రీడీ టీవీఎస్ లోగో ఫ్యూయల్ ట్యాంక్ మీద ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్

సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్‌లో అదే మునుపటి పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇందులో ఉన్న 159.7సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ 14.9బిహెచ్‌పి పవర్ మరియు 13.03ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి, 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్‌లో సస్పెన్షన్ కోసం ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విధుల కోసం ముందు చక్రానికి 270ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ మరియు వెనుక వైపున 200ఎమ్ఎమ్ డిస్క్ లేదా 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్

సరికొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు నూతన టీవీఎస్ త్రీడీ లోగో మినహాయిస్తే, అపాచే ఆర్‌‌టిఆర్ 160 చూడటానికి అచ్చం స్టాండర్డ్ వేరియంట్‌నే పోలి ఉంటుంది, ఇందులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్

ప్రస్తుతం, రేస్ ఎడిషన్ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 బైకులో కనీసం ఆప్షనల్‌గా కూడా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ రాలేదు. అయితే, నూతన ప్రమాణాల ప్రకారం ఏప్రిల్ 2019 నుండి విపణిలో ఉన్న అన్ని 125సీసీ అంత కంటే ఎక్కువ కెపాసిటి గల టూ వీలర్లలో ఏబిఎస్ ఫీచర్ తప్పనిసరిగా రానుంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ మధ్యనే అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకును రేస్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు, దానికి చిన్న వెర్షన్ ఆర్‌టిఆర్ 160 బైకును రేస్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టింది. రేస్ ఎడిషన్ బాడీ గ్రాఫిక్స్ గల టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160, హోండా సిబి హార్నెట్ 160ఆర్, సుజుకి జిక్సర్ మరియు యమహా ఎఫ్‌జడ్ వి2 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 రేస్ ఎడిషన్

1. కెటిఎమ్ 250పై ఆధిపత్యానికి పల్సర్ 250 బైకును సిద్దం చేస్తున్న బజాజ్ ఆటో

2.సిబిఆర్1000ఆర్ఆర్ మీద 2.54 లక్షలు ధర తగ్గించిన హోండా

3.బజాజ్ అవెంజర్ స్ట్రీట్ 150 మోటార్‌సైకిల్‌కు వీడ్కోలు

4.హోండా టూ వీలర్స్‌కు చుక్కలు చూపిస్తున్న గ్రాజియా స్కూటర్ సేల్స్

5.టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి: మిడిల్ క్లాస్ రేసింగ్ ప్రియుల బెస్ట్ ఛాయిస్

English summary
Read In Telugu: TVS Apache RTR 160 Race Edition Launched In India; Prices Start At Rs 79,715
Story first published: Thursday, April 12, 2018, 18:06 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark