టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఏబిఎస్ విడుదల: ధర మరియు ఫీచర్లు

Written By:
Recommended Video - Watch Now!
Auto Rickshaw Explodes In Broad Daylight

దక్షిణ భారత టూ వీలర్ల తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ విపణిలోకి అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకును ఏబిఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసింది. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోటార్ సైకిల్ కార్బోరేటర్ వేరియంట్ ఇప్పుడు డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS)పొందింది.

కార్బోరేటర్ వేరియంట్లో ఏబిఎస్ వచ్చిన తొలి మోడల్ కూడా ఇదే. టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఏబిఎస్ వెర్షన్ ధర రూ. 1.07 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్

కొత్తగా విడుదలైన టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులో కొత్త తరం డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కలదు. గరుకు మరియు జారుడు స్వభావం ఉన్న అన్ని రోడ్ల కోసం టీవీఎస్ బృందం ఈ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సిస్టమ్‌ను స్వయంగా అభివృద్ది చేసింది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్

యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ గల టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి లో మరో విన్నూతన రియర్ వీల్ లిఫ్ట్-ఆఫ్ ప్రొటెక్షన్ (RLP) ఫీచర్. అధిక వేగం మీద ఉన్నపుడు మలుపుల్లో వెనుక చక్రం గాల్లోకి లేవడం, స్లిప్ అవ్వడాన్ని నివారించి రైడింగ్‌లో ఉన్నపుడు అత్యుత్త డైనమిక్ స్టెబిలిటి వీల్ లాక్ జరకుండా చూస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్

ఏబిఎస్ మరియు నాన్-ఏబిఎస్ వేరియంట్ల రెండూ చూడటానికి ఒకేలా ఉంటాయి. అయితే, వీటిలో ఏబిఎస్ వేరియంట్‌ను గుర్తించడానికి కుడివైపు ఫ్రంట్ మడ్ గార్డ్ పైభాగంలో ఏబిఎస్ స్టిక్కర్ ఉంటుంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్

డూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) మరియు రియర్ వీల్ లిఫ్ట్-ఆఫ్ ప్రొటెక్షన్ (RLP) ఫీచర్ల జోడింపు మినహా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. సాంకేతికంగా అదే 197.75సీసీ కెపాసిటి గల గాలి/లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్

డూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) మరియు రియర్ వీల్ లిఫ్ట్-ఆఫ్ ప్రొటెక్షన్ (RLP) ఫీచర్ల జోడింపు మినహా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. సాంకేతికంగా అదే 197.75సీసీ కెపాసిటి గల గాలి/లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మోడల్ ఏబిఎస్ వెర్షన్ డిజైన్ పరంగా చూడటానికి రెగ్యులర్ మోడల్‌నే పోలి ఉంటుంది. అయితే, ఫ్రంట్ మడ్ గార్డ్ మీద ఏబిఎస్ అని సూచించే స్టిక్కర్ ఉంటుంది. ఇందులో పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్ ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఏబిఎస్ వేరియంట్లో సస్పెన్షన్ పరంగా ముందు వైపు టెలిస్పోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనోషాక్ అబ్జార్వర్ ఉంది. బ్రేకింగ్ విధుల కోసం ఫ్రంట్ వీల్‌‌కు 270ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ మరియు రియర్ వీల్‌కు 240ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ బ్రేకులు డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ మోటార్స్ ఎట్టకేలకు తమ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ఎంట్రీ లెవల్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ బైకులో సేఫ్టీ పరంగా అతి ముఖ్యమైన టెక్నాలజీ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS)ను పరిచయం చేసింది. అయితే, కార్బోరేటర్ వెర్షన్‌లో మాత్రమే అందించింది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్

ఏబిఎస్ జోడింపుతో అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులో పనితీరు మరింత మెరుగుపడింది. అత్యవసర పరిస్థితుల్లో సడెన్ బ్రేకులు వేస్తే, వీల్ లాక్ అయ్యి, జారిపోకుండా ఉంచేందుకు వీల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ చక్కగా పనిచేస్తోంది.

200సీసీ ఇంజన్ కెపాసిటి గల సెగ్మెంట్లోని బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 200 మరియు తాజాగా హీరో మోటోకార్ప్ ఆవిష్కరించిన ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకుల్లో కూడా ఏబిఎస్ ఉంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: TVS Apache RTR 200 4V ABS Launched In India; Priced At Rs 1.07 Lakh
Story first published: Saturday, February 3, 2018, 13:49 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark