టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్ విడుదల

Written By:

టీవీఎస్ మోటార్ కంపెనీ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ బైకులను సరికొత్త మ్యాట్ సిరీస్‌లో లాంచ్ చేసింది. సరికొత్త విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్ ప్రారంభ ధర రూ. 55,890 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్

టీవీఎస్ కొత్తగా విడుదల చేసిన విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్ రెండు కొత్త కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది. అవి, మ్యాట్ బ్లూ(వైట్ కలర్‌తో) మరియు మ్యాట్ సిల్వర్(రెడ్ కలర్‌తో).

Recommended Video - Watch Now!
Bangalore Bike Accident At Chikkaballapur | Full Details - DriveSpark
టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్

మ్యాట్ కలర్ స్కీమ్‌తో పాటు టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్ బైకులో క్రోమ్ సొబగులు మరియు డ్యూయల్ టోన్ బీజి సీట్ ఉంది. టీవీఎస్ సెప్టెంబర్ 2017లో విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ బైకును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్

ఆకర్షణీయమైన డిజైన్, స్పోర్టివ్ బాడీ గ్రాఫిక్స్ మరియు బెస్ట్ టెక్నాలజీని అందివ్వడంతో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు అత్యుత్తమ ఫలితాలు సాధించింది. దీంతో విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ బైకును మ్యాట్ ఫినిషింగ్ గల పెయింట్ స్కీములో పరిచయం చేసింది.

టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్

టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్ బైకులో సాంకేతికంగా 109.7సీసీ కెపాసిటి గల త్రీ-వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 9.3బిహెచ్‌పి పవర్ మరియు 9.4ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరియు దీని మైలేజ్ లీటర్‌కు 72కిమీలుగా ఉంది.

టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్

టీవీఎస్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ ఫినిషింగ్ కలర్ ఆప్షన్‌లతో పాటు బ్లాక్ కలర్ మరియు యెల్లో గ్రాఫిక్స్ అదే విధంగా రెడ్ కలర్ మరియు గోల్డ్ గ్రాఫిక్స్‌తో లభిస్తోంది. విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ కేవలం డిస్క్ బ్రేకుతో మాత్రమే లభ్యం కాగా, రెగ్యులర్ వెర్షన్ విక్టర్ డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌లలో ఎంచుకోవచ్చు.

Trending On DriveSpark Telugu:

మారుతి నుండి మరో కొత్త ఎస్‌యూవీ: పూర్తి వివరాలు!!

సరదా కోసం చేసిన బైక్ రైడ్‌లో 11 ఏళ్ల చిన్నారిని చంపేశాడు, చితకబాదిన గ్రామస్థులు

భారత్‌లో అంబాసిడర్ బ్రాండుకు మళ్లీ ప్రాణం పోస్తున్న ప్యూజో

టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్

టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్‌లో సైడ్ ప్యానల్స్ మీద క్రోమ్ సొబగులు మరియు గోల్డ్ డిటైలింగ్ గల ఇంజన్ కవర్ రైడర్‌కు ప్రీమియమ్ ఫీల్ కలిగిస్తాయి. అంతే కాకుండా, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు క్రోమ్ క్రాష్ గార్డ్స్ కూడా ఉన్నాయి.

టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ మోటార్ కంపెనీ వీలైనంత వరకు ఎక్కువ కస్టమర్లను చేరుకునే ఉద్దేశ్యంతో తమ బెస్ట్ సెల్లింగ్ కమ్యూటర్ మోటార్ సైకిల్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ బైకును రెండు మ్యాట్ ఫినిష్ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేసింది. నూతన అప్‌డేట్స్‌తో ఎన్నో ఆకర్షణీయమైన రూపాన్ని సొంతం చేసుకుంది. అద్భుతమైన ఇంజన్, ఫీచర్లు, అట్రాక్టిల్ స్టైలిష్ డిజైన్ అంశాల పరంగా టీవీఎస్ విక్టర్ ప్రీమియమ్ ఎడిషన్ మ్యాట్ సిరీస్ బైకు ధరకు తగ్గ విలువలను కలిగి ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: TVS Victor Premium Edition Matte Series Launched In India; Priced At Rs 55,890

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark