ఆటో ఎక్స్‌పో 2018: జెప్లిన్ క్రూయిజర్ కాన్సెప్ట్ బైకును ఆవిష్కరించిన టీవీఎస్

Written By:

ఆటో ఎక్స్‌పో 2018: దక్షిణ భారత దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ ఢిల్లీలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పోలో సరికొత్త జెప్లిన్ క్రూయిజ్ కాన్సెప్ట్ బైకును ఆవిష్కరించింది. టీవీఎస్ కంపెనీ యొక్క తొలి క్రూయిజర్ మోడల్‌కు జెప్లిన్ అనే పేరును ఖరారు చేసింది.

టీవీఎస్ జెప్లిన్‌లో ఫ్యూచర్ మరియు క్లాసిక్ డిజైన్ అంశాలను పొందుపరిచి డిజైన్ చేశారు. టీవీఎస్ జెప్లిన్ గురించి పూర్తి వివరాలు మరియు ఫోటోల కోసం...

టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ బైక్

జెప్లిన్ క్రూయిజర్ మోటార్ సైకిల్ పర్ఫామెన్స్ సెగ్మెంట్‌కు చెందిన బైక్ అని టీవీఎస్ వెల్లడించింది. చూడటానికి స్పోర్టివ్ రా మెటల్ లుక్ కలిగి ఉన్న జెప్లిన్‌లో బైకులో 220సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ అందించింది.

Recommended Video - Watch Now!
UM Renegade Thor Electric Cruiser Bike India Launch Details, Price, Specifications - DriveSpark
టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ బైక్

టీవీఎస్ పేటెంట్ హక్కులు పొందిన ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్(ISG) ఫీచర్ ఇ-బూస్ట్ ఆప్షన్‌తో వచ్చింది. ఇది ఇంజన్‌ను వేగంగా స్టార్ట్ చేయడానికి మరియు అత్యుత్తమ మైలేజ్ మరియు పవర్ ఇవ్వడానికి సహకరిస్తుంది.

టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ బైక్

టీవీఎస్ జెప్లిన్ కాన్సెప్ట్ క్రూయిజర్ బైకులో 1,200వాట్ సామర్థ్యం ఉన్న రీజనరేటివ్ అసిస్ట్ మోటార్ మరియు 48 వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీ వ్యవస్థ కలదు. ఇది బైక్‌కు అవసరమైనపుడు 20 శాతం వరకు టార్క్ ఈ వ్యవస్థ నుండి అందుతుంది.

టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ బైక్

దూర ప్రాంత ప్రయాణాలకు మోటార్ సైకిళ్లను ఎంచుకునే రైడర్లను దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ మోటార్స్ ఈ జెప్లిన్ కాన్సెప్ట్ క్రూయిజర్ మోటార్ సైకిల్‌ను అభివృద్ది చేసింది.

టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ బైక్

స్లీక్ మెటల్ బాడీ ఫినిషింగ్‌లో ఉన్న మ్యాట్ బ్లాక్ మరియు రస్టిక్ బ్రౌన్ కలర్ ఫినిషింగ్ కలదు. ఫ్రంట్ సస్పెన్షన్ కోసం గోల్డెన్ కలర్ అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్స్క్ ఉన్నాయి. బైక్‌కు విభిన్న రూపాన్ని తీసుకొచ్చేందుకు చిన్న పరిమాణంలో ఉన్న హెడ్ ల్యాంప్ అందించారు.

టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ బైక్

అగ్రెసివ్ రైడింగ్ కోసం పొట్టిగా ఉన్న సీటు, వెడల్పాటి హ్యాండిల్ బార్, కాస్తంత ఎత్తులో ఉన్న రైడర్ ఫ్రంట్ ఫుట్ పెగ్స్, తక్కువ ఎత్తులో ఉన్న సీటు ఉన్నాయి. టీవీఎస్ జెప్లిన్‌లో అత్యుత్తమ క్రూయిజర్ రైడింగ్ ఫీల్‌తో పాటు సౌకర్యవంతమైన రైడ్ కూడా పొందవచ్చు.

టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ బైక్

టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ బైకులో ఉన్న ఇతర ప్రధాన ఫీచర్లలో తేలికపాటి బరువున్న ట్యూబ్ లెస్ స్పోక్ వీల్స్, 41ఎమ్ఎమ్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్, డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు బెల్ట్ డ్రైవ్ ఉన్నాయి.

టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ బైక్

టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ కాన్సెప్ట్‌లో పూర్తి స్థాయి ఎల్ఇడి లైటింగ్ సిస్టమ్, ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ స్మార్ట్ బయో-కీ, ఎలక్ట్రానిక్ స్పీడోమీటర్ మరియు ఆన్‌లైన్ కనెక్టివిటి, అంతే కాకుండా అడ్వెంచర్ రైడింగ్‌లో ఉన్నపుడు రికార్డింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ హెచ్‌డి కెమెరా వంటి స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ బైక్

టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ కాన్సెప్ట్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఫీచర్లు మరియు డిజైన్‌తో ఆధునిక కాలంలో కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా వచ్చిన అత్యుత్తమ క్రూయిజర్ మోటార్ సైకిల్. ఇది విపణిలో ఉన్న బజాజ్ అవెంజర్ 220 క్రూయిజర్ మోటార్ సైకిల్‌కు గట్టి పోటీనిస్తుంది.

English summary
Read In Telugu: Auto Expo 2018: TVS Zeppelin Cruiser Concept Unveiled - Specifications, Features & Images
Story first published: Tuesday, February 13, 2018, 12:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark