బిఎమ్‌డబ్ల్యూ కొత్త బైకులు: వీటిని కొనలేం కానీ.. కనీసం ఫోటోలైనా చూద్దాం రండి

బిఎమ్‌డబ్ల్యూ ఖరీదైన కార్లు మాత్రమే... అంతే ఖరీదైన బైకులు కూడా విక్రయిస్తోంది. ఇండియన్ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ పేరుతో అత్యంత ఖరీదైన లగ్జరీ బైకుల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా విపణిలోకి రెండు అత్యంత ఖరీదైన మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది. కొత్తగా విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్‌టి, వీటి ధరలు రూ. 15.95 లక్షలు మరియు రూ. 22.50 లక్షలు‌గా ఉన్నాయి.

పెద్ద పెద్ద లగ్జరీ కార్లతో పోటీపడుతున్న ఈ బైకుల్లో ఉన్న ప్రత్యకతలేంటో చూద్దాం రండి...

బిఎమ్‌డబ్ల్యూ కొత్త బైకులు: వీటిని కొనలేం కానీ.. కనీసం ఫోటోలైనా చూద్దాం రండి

ఈ రెండు మోటార్ సైకిళ్లను పూర్తిగా విదేశాల్లో తయారైన యూనిట్లుగా దిగుమతి చేసుకుని ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్నారు. బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్‌టి మోడళ్లను 3 లక్షల రూపాయల బుకింగ్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చని పూణే డీలర్లు స్పష్టం చేశారు. వీటిపై మూడు నెలల వెయింటింగ్ పీరియడ్ ఉన్నట్లు కూడా వివరించారు.

బిఎమ్‌డబ్ల్యూ కొత్త బైకులు: వీటిని కొనలేం కానీ.. కనీసం ఫోటోలైనా చూద్దాం రండి

సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్ బైక్ బాడీ ఫిట్నెస్‌లో బ్లాక్ కలర్ ఫినిషింగ్ గల బాడీ పార్ట్స్ చూడవచ్చు. ఫ్రంట్ ఫెండర్, ఫ్యూయల్ ట్యాంక్ పక్కవైపునున్న ట్రిమ్స్, ఫ్రంట్ స్పాయిలర్ మరియు రియర్ ప్యానల్స్ ఇలా దాదాపు అన్ని డిజైన్ ఎలిమెంట్లు బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లోనే ఉన్నాయి. ఈ బైక్ బ్లాక్ స్టార్మ్ మెటాలిక్ ఫినిష్ అనే కలర్ ఆప్షన్‌లో లభ్యమవుతోంది.

బిఎమ్‌డబ్ల్యూ కొత్త బైకులు: వీటిని కొనలేం కానీ.. కనీసం ఫోటోలైనా చూద్దాం రండి

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్‌టి విషయానికి వస్తే.. ఇది బ్లూ పెయిట్ మెటాలిక్ మరియు స్పార్ల్కింగ్ స్టార్మ్ మెటాలిక్ అనే రెండు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది. ఈ బైక్ బాడీ ఎక్ట్సీరియర్‌లో ఎన్నో రకాల డిజైన్ ఎలిమెంట్లు పలు రకాల కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. హ్యాండిల్ బార్ మరియు విండ్‌షీల్డ్ మీద క్రోమ్ సొబగులు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ కొత్త బైకులు: వీటిని కొనలేం కానీ.. కనీసం ఫోటోలైనా చూద్దాం రండి

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్‌టి రెండు బైకుల్లో కూడా రెండు విభిన్న రైడింగ్ మోడ్స్ తప్పనిసరి ఫీచర్లుగా వచ్చాయి. వీటికి అదనంగా ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ASC), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), కార్నరింగ్ ఏబీఎస్ మరియు హిల్ స్టార్ట్ కంట్రోల్ సిస్టమ్ వంటి అదనపు సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ కొత్త బైకులు: వీటిని కొనలేం కానీ.. కనీసం ఫోటోలైనా చూద్దాం రండి

కొత్తగా విడుదలైన ఈ రెండు బిఎమ్‌డబ్ల్యూ మోటార్ సైకిళ్లలో హీటెడ్ సీట్లు, సెంట్రల్ లాకింగ్, టైర్ ప్రెజర్ పర్యవేక్షించే వ్యవస్థ మరియు యాంటీ-థెఫ్ట్ అలారమ్ ఉన్నాయి. అంతే కాకుండా డైనమిక్ ఇఎస్ఏ, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ రైడ్ మరియు పగటి పూట వెలిగే లైట్లు వచ్చాయి.

బిఎమ్‌డబ్ల్యూ కొత్త బైకులు: వీటిని కొనలేం కానీ.. కనీసం ఫోటోలైనా చూద్దాం రండి

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్‌టి రెండింటిలో ఫుల్-కలర్ టిఎఫ్‌టి స్క్రీన్, బ్లూటూత్, రేడియో సాఫ్ట్‌వేర్ మరియు ఇంటిగ్రేటెడ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ మల్టీ-కంట్రోలర్ వంటి ఎన్నో కనెక్టివిటీ ఫీచర్లు వచ్చాయి. ఆర్ మోడల్‌లో 6.5-అంగుళాల స్క్రీన్ మరియు ఆర్‌టి మోడల్‌లో 5.7 అంగుళాల పరిమాణంలో ఉన్న స్క్రీన్ కలదు.

బిఎమ్‌డబ్ల్యూ కొత్త బైకులు: వీటిని కొనలేం కానీ.. కనీసం ఫోటోలైనా చూద్దాం రండి

బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1250 ఆర్‌టి బైకుల్లో సాంకేతికంగా 1254సీసీ కెపాసిటీ గల రెండు సిలిండర్ల ఇన్-లైన్ బాక్సర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 134బిహెచ్‌పి పవర్ మరియు 143ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. గోల్డెన్ బ్రేక్ కాలిపర్లు, రేడియేటర్ కవర్ మరియు స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంక్ కవర్ వంటి అరుదైన ఫీచర్లు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ కొత్త బైకులు: వీటిని కొనలేం కానీ.. కనీసం ఫోటోలైనా చూద్దాం రండి

బిఎమ్‌డబ్ల్యూ కంపెనీకి చెందిన షిఫ్ట్‌క్యామ్ టెక్నాలజీ (వేరిబుల్ క్యామ్ షాప్ట్ కంట్రోల్) రైడర్‌కు అత్యుత్తమ రైడింగ్ అనుభూతినిస్తుది మరియు అన్ని దశలలో కూడా ఇంజన్ అత్యుత్తమ పవర్ అందిస్తుంది. ఉద్గారాలు మరియు ఇంధన వినియోగం మరియు ఇంజన్ పనితీరు పరంగా ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ కొత్త బైకులు: వీటిని కొనలేం కానీ.. కనీసం ఫోటోలైనా చూద్దాం రండి

జర్మన్ నాణ్యత మరియు సామర్థ్యాన్ని ఏదీ అధిగమించలేదు. రెండు కొత్త మోటార్ సైకిళ్ల విడుదలతో జర్మన్ దిగ్గజం ఇది నిజమని నిరూపించింది. పూర్తి స్థాయిలో తయారైన బైకులను దిగుమతి చేసుకుని ఈ రెండు బైకులను కస్టమర్లకు అందుబాటులో ఉంచారు. టెక్నాలజీ, పనితీరు, డిజైన్ మరియు ధరకు తగ్గ విలువల ఎన్నో అంశాల పరంగా ఈ రెండు మోడళ్లు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయి.

Most Read Articles

English summary
BMW Motorrad R 1250 R And R 1250 RT Motorcycles Launched In India: Prices Start At Rs 15.95 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X