రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు 2020 నుండి తేలికైన వాహనాలుగా మారబోతున్నాయా...? అయితే ఇప్పుడే చూడండి!

ప్రస్తుతం కుర్రకారుని బాగా ఆకర్షించి ఉర్రూతలూగిస్తున్న బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్. ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా కొంత ప్రత్యేకమైన ఫీచర్స్ని కలిగి ఉంటుంది. సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆకారంలో చూడటానికి పెద్దదిగా ఉండి బరువునుకూడా అదే రీతిలో కలిగి ఉంటుంది. అధిక బరువు కలిగిన కారణంగా కొంతమంది మహిళా రైడర్లకు ఇది అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి కొంతమంది రైడర్లను దృష్టిలోపెట్టుకుని ఇంకా రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ కొంత తేలికైనదిగా మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పుడు దానిగురించి తెలుసుకుందాం?

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు 2020 నుండి తేలికైన వాహనాలుగా మారబోతున్నాయా...? అయితే ఇప్పుడే చూడండి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతీయ మార్కెట్ కోసం కొత్తగా రాబోయే వాహనాన్ని మరింత తేలికగా ఉండేట్లు తయారు చేస్తుంది. ఎందుకంటే మొదటిసారిగా మహిళా రైడర్లను లక్ష్యంగా చేసుకుని ఈ రకమైన వాహనాలను తయారుచేయడం జరుగుతోంది. వాహనం అధిక బరువు ఉంటే మహిళా రైడర్లకు అంత సౌక్యంగా ఉండదు కావున తేలికగా వున్నట్లైతే వాహనాలను నడపడానికి సులభంగా ఉంటుందని ఈ విధమైన తేలికపాటి బైక్ లను ఎన్‌ఫీల్డ్ తయారు చేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు 2020 నుండి తేలికైన వాహనాలుగా మారబోతున్నాయా...? అయితే ఇప్పుడే చూడండి!

ఆటో మోటార్ ఇండియా ప్రకారం భారతదేశంలో ఇప్పటికే అమ్మకానికి ఉన్న క్లాసిక్, బుల్లెట్ మరియు థండర్బర్డ్ మొదలైన మోడళ్లతో పోలిస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి వచ్చే కొత్త శ్రేణి మోటార్ సైకిళ్ళు బరువులో గణనీయమైన వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. కొత్తగా రాబోతున్న బైక్‌లకు అంతర్గతంగా ‘జె 1 సి' అనే సంకేతనామం పెట్టబడిందని అంటే కాకుండా ఇది కొత్త ఎక్స్‌ప్లోరర్ సబ్ బ్రాండ్ కింద విక్రయించబడుతుందని నివేదికలు తెలియజేస్తున్నాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు 2020 నుండి తేలికైన వాహనాలుగా మారబోతున్నాయా...? అయితే ఇప్పుడే చూడండి!

మహిళలు మరియు యువ రైడర్స్ నుండి చాలా స్పందనలు వచ్చిన తరువాత ఈ బ్రాండ్ నుండి తేలికపాటి మోటార్ సైకిళ్లను అందించే నిర్ణయం వచ్చింది. కొత్త తేలికపాటి మోటారుసైకిల్ శ్రేణి దేశంలో మహిళా రైడర్స్ మరియు మొదటిసారి బైకర్లను ఆకర్షించడానికి మరిన్ని అవకాశాలను అందిస్తుందని రాయల్ ఎన్ఫీల్డ్ తెలియజేసింది. ముఖ్యంగా గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ & చండీగర్ వంటి కొన్ని రాష్ట్రాల్లోఈ రకమైన తేలికపాటి వాహనాలను అందించనుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు 2020 నుండి తేలికైన వాహనాలుగా మారబోతున్నాయా...? అయితే ఇప్పుడే చూడండి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి వస్తున్న ఈ కొత్త తేలికపాటి వాహనాలు 2020 మొదటి మూడు నెలలనుండి విక్రయించబడుతుంది అని భావిస్తున్నారు. కొత్త తేలికపాటి మోటారు సైకిళ్ళు మాత్రమే కాకుండా వీటి నవీనీకరణలకు బిఎస్-6 చాలా కృషి చేస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 2020 ప్రారంభంలో భారతదేశంలో ప్రవేసిస్తున్నట్లు తెలుస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు 2020 నుండి తేలికైన వాహనాలుగా మారబోతున్నాయా...? అయితే ఇప్పుడే చూడండి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రతినిధి ఇటి ఆటోతో మాట్లాడుతూ భవిష్యత్ ఉత్పత్తి శ్రేణుల గురించి మేము చెప్పలేము ఎందుకంటే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిళ్లను అందరికీ అందుబాటులో ఉండేలా మరియు అందరికీ చేరువలో ఉండటానికి మేము కృషి చేస్తున్నాము అన్నారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు 2020 నుండి తేలికైన వాహనాలుగా మారబోతున్నాయా...? అయితే ఇప్పుడే చూడండి!

ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వెయిట్ మోటార్‌సైకిల్ పై ఆలోచనలు:

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ళు ఇప్పటివరకు సుమారు 200 కిలోల బరువు కలిగివున్నాయి. ఈ విభాగంలో చాలా మంది ప్రత్యర్థులతో పోలిస్తే ఇది భారీ మోటార్‌సైకిల్‌గా మారుతుంది. ఏది ఏమైనా కొత్త తేలిక పాటి వాహనాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ విదంగా తేలికపాటి వాహనాలను తయారు చేయడం వాళ్ళ వీటి అమ్మకాలు ఇంకా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అని చెప్పవచ్చు.

Read More:భారతదేశంలో నిలిపివేయబడిన కవాసకి నింజా 300

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు 2020 నుండి తేలికైన వాహనాలుగా మారబోతున్నాయా...? అయితే ఇప్పుడే చూడండి!

ఇప్పటిదాకా రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలను వినియోగించే మహిళా రైడర్లు చాల తక్కువగా ఉండేవారు. ఒక్క సారి ఈ తేలికపాటి వాహనాలను విడుదల చేసినట్లయితే మహిళా రైడర్ల సంఖ్యకూడా బాగా పెరుగుతుంది. ఇదే కాకుండా కొత్త రైడర్లకు కూడా ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందువల్ల కొత్త తేలికపాటి ఎన్‌ఫీల్డ్ ని మార్కెట్లో ప్రవేశపెట్టడం వల్ల వినియోగదారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

Source:ET Auto

Most Read Articles

English summary
Royal Enfield Bikes To Be Lightweight From 2020: New Range Of Lightweight Models To Launch Soon- Read in telugu
Story first published: Saturday, December 28, 2019, 10:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X