రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X బిఎస్6: సీక్రెట్ ఫోటోలు లీక్!

రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త తరంలో వెలువడనున్నరాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్350 యొక్క ఉత్పత్తులలో ప్రస్తుతం బిజీగా ఉంది. కానీ ఈ మోటారు సైకిళ్ళు ఉత్పత్తి ఇప్పటికి ఇంకా సిద్ధంగా లేదు. చెన్నైకి చెందిన ఒక సంస్థ ఆధారంగా వీటిని 2020 నాటికి బిఎస్6 ని కొన్ని నిబంధనల ఆధారంగా ప్రారంభించాలనుకుంటున్నది. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ తన ప్రస్తుత 350 సిసి లైనప్ ను కొన్ని మార్పు చేర్పులతో బిఎస్ 6 కి అప్ డేట్ చేయాలనీ ఆలోచిస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X బిఎస్6 సీక్రెట్ ఫోటోలు లీక్!

దాదాపు గత కొన్ని నెలలుగా కొత్త తరం రాయల్ ఎన్ఫీల్డ్ తయారు చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు 2020 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ కి సంబంధించిన అన్ని డిజైన్ వివరాలు వివరంగా లీక్ అయ్యాయి. కానీ లీక్ అయిన వాటిలో కూడా అంచనాలకు అందనటువంటి కొన్ని వైవిధ్యాలు ఉంటాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X బిఎస్6 సీక్రెట్ ఫోటోలు లీక్!

2020 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ ఎక్స్ మొత్తం రూపకల్పన చాల సమగ్రంగా ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికి ఇది ముందు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క సూత్రాలను పాటిస్తుంది. అంటే ఇంతకు ముందున్న వాహనాల యొక్క సౌందర్యం మొదలైన వాటిని రాబోయే ఈ వాహనం కూడా ఫాలో అవుతుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X బిఎస్6 సీక్రెట్ ఫోటోలు లీక్!

సింగిల్-పాడ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ పూర్తిగా క్రొత్తగా ఉంటుంది . దీని యొక్క టెస్ట్ మ్యూల్‌లో టాకోమీటర్ సంకేతాలు ఉండవు. ఎందుకంటే కుడి వైపున ఖాళీ డయల్ హౌసింగ్ ఉంటుంది. హ్యాండిల్ గ్రిప్ లు కూడా కొత్తగా కనిపిస్తాయి. మరియు ఇరువైపులా ఉన్న నియంత్రణలు లైటింగ్ కోసం మరియు టోగుల్ స్విచ్‌లతో తయారు చేయబడి ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X బిఎస్6 సీక్రెట్ ఫోటోలు లీక్!

రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క వెనుక భాగం ముందు వాహనాలలో మాదిరిగానే ఉంటుంది. నంబర్ ప్లేట్ మరియు సూచికలు క్రింద వేలాడుతూ ఉంటాయి. వాహనానికి వెనుక భాగంలో కనిపించే సస్పెన్షన్ యూనిట్లు ప్రస్తుతం కనిపించే వాటికి ఉదాహరణలు కాదు. ఇంక ఇందులోని ఇంజిన్ విషయానికి వస్తే ఆకారం మరియు పరిమాణంలో ప్రస్తుత 346 సిసి యుసిఇ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ల కంటే కొంత భిన్నంగా ఉంటాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X బిఎస్6 సీక్రెట్ ఫోటోలు లీక్!

గడిచిన కొన్ని నెలలుగా వీటిపై అనేక నివేదికలు వెలువడ్డాయి. ఇందులో అమ్మకాలు సరిగ్గా లేవని అందుకే రాయల్ ఎన్‌ఫీల్డ్ 499 సిసి యుసిఇ ఇంజిన్‌లు ముంచేస్తున్నాయని ఈ నివేదికల్లో ఉన్నట్లు సమాచారం. కానీ అసలు విషయం ఏమిటంటే ఎన్‌ఫీల్డ్ లో 650 యొక్క కాంటినెంటల్ జిటి మరియు ఇంటర్‌సెప్టర్ లు మరియు 500 మోడల్ల ధరలు చూస్తే సహేతుకమైన మార్జిన్ లో లభిస్తున్నాయి. ఇటువంటి కొన్ని కారణాలవల్ల వీటిని నిలిపివేయడం సరైనదని అనుకుంటున్నారు.

Read More:ఆటోమేటిక్ కార్లలో కూడా మారుతి సుజుకినే కింగ్

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X బిఎస్6 సీక్రెట్ ఫోటోలు లీక్!

ప్రస్తుతం ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ 350 మోడల్స్ ఏవంటే బుల్లెట్, క్లాసిక్, థండర్బర్డ్, ట్రయల్స్, మొదలైనవి. ఇవన్నీ కూడా 346 మోటార్ నుండి 19.8 బిహెచ్‌పి మరియు 28 ఎన్ఎమ్ టార్క్ టార్క్ తయారు చేస్తాయి. ఇంకా ఇది ఇంజిన్ 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ తో జతకలుపబడతాయి. ఎందుకంటే కొత్తగా విడుదలయ్యే తరంలో మెరుగైన శక్తీ గణాంకాలను చూడాలని ఆశిస్తున్నారు.

Read More:5 లక్షల రూపాయలు ధర తగ్గించిన మిత్సుబిషి

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350X బిఎస్6 సీక్రెట్ ఫోటోలు లీక్!

ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని వాహనాలతో పోటీ పడాల్సిన సమయం వచ్చింది. జావా మరియు బెనెల్లి ఇంపీరియేల్ 400 వంటివాటితో పోటీ పడనుంది. ఏది ఏమైనా వీటితో పోటీ కొంత కఠినంగా ఉండబోతోంది.

Source: Bikewale

Most Read Articles

English summary
BS6 Royal Enfield Thunderbird X 350 close up shots – Spied- Read in Telugu
Story first published: Wednesday, December 18, 2019, 14:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X