Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రివోల్ట్ ఆర్వి400 ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ లాంచ్ డేట్ ఖరారు
రివోల్ట్ మోటార్స్, ఢిల్లీ ఆధారిత ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్ట్-అప్ కంపెనీ తన మొదటి ఉత్పత్తి ఆర్వి400 భారతదేశంలో ప్రారంభ తేదీని ప్రకటించింది. కొత్త రివోల్ట్ ఆర్వి400 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఆగస్టు 28 వ తేదీ నుంచి అమ్మకానికి వెళ్లనుంది అని కంపెనీ ప్రకటించింది.

ఇది భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటెలిజెంట్ ఎనేబుల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్, ఇక డెలివరీల విషయానికి వస్తే ఇది విడుదలైన వెంటనే ప్రారంభం అవుతుందని చెప్పారు. ఇది రివోల్ట్ ద్వారా గతంలో జూలై 22 న మరియు తరువాత ఆగస్టు 7 న ప్రయోగాన్ని ముందుగా ప్రకటించింది.

ఈ రెండూ తేదీలలో వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. రివోల్ట్ ఆర్వి400 ను జూన్ 2019 న మొదటిసారి ప్రదర్శించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కు సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే రూ.1000 ల ధరతో ప్రారంభమయ్యాయి.

ఈ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ అధికారిక వెబ్ సైట్ లేదా Amazon.in వెబ్ సైట్ ద్వారా గాని బుకింగ్ లు లభిస్తాయి అని రివోల్ట్ ఎప్పుడో వెల్లడించింది. ఢిల్లీ, పుణేలతో ప్రారంభమయ్యే ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ను దశల వారీగా విక్రయిస్తారు.

రివోల్ట్ ఆర్వి400 యొక్క అమ్మకాలు, తరువాత దశలో ముంబై, బెంగళూరు మరియు హైద్రాబాద్ వంటి ఇతర నగరాలకు విస్తరించబడుతుంది. రివోల్ట్ ఆర్వి400 అద్భుతమైన ఫీచర్లు మరియు అధునాతన పరికరాలతో వస్తుంది.

ఇందులో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డ్రిల్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్ మరియు పూర్తిగా-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన రివోల్ట్ యాప్ కూడా ఉంటుంది, ఇది జియోఫెన్సింగ్, యాప్ ద్వారా బైక్ ను ప్రారంభించవచ్చు, లైవ్ లొకేషన్ మరియు ఇతర వేహికల్ డయాగ్నస్టిక్స్ వంటి అదనపు ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ ఆధారిత ఫీచర్లను ఇందులో అందిస్తున్నారు.
Most Read:హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది

రివోల్ట్ ఆర్వి400 ఇంకా అధికారికంగా బ్యాటరీ యొక్క సాంకేతిక వివరాలను మరియు ఈ మోటారు సైకిల్ పై ఉపయోగించిన మోటారును ప్రకటించాల్సి ఉంది. అయితే రివోల్ట్ ఆర్వి400 ఒకసారి చార్జ్ చేస్తే 152కిమీ గరిష్ట దూరాన్ని, 85కిమీ/గం టాప్ స్పీడ్ ను కలిగి ఉంటుందని చెప్పారు.
Most Read:జీఎస్టీ ఎఫెక్ట్.. ఒకినవ ఎలక్ట్రిక్ స్కూటర్ లపై ధరల తగ్గింపు

రివోల్ట్ ఆర్వి400 పై అనేక ఛార్జింగ్ విధానాలను అందించటం జరుగుతుంది వాటిలో ఫ్లగ్ ఇన్ ఛార్జర్లు నుంచి స్విప్పబుల్ బ్యాటరీలను మరియు బ్యాటరీ హోమ్ డెలివరీలను కూడా చేయనుంది. రివోల్ట్ ఆర్వి400 దేశంలో భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ ఎనేబుల్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అని చెప్పవచ్చు.
Most Read:కొత్త విధానంతో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న హీరో మోటోకార్ప్

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కు పోటీతత్వంతో కూడిన ధర ఉండనుంది, అయితే ఇటీవల జరిగిన జిఎస్టి రేట్లు తగ్గింపు మరియు ప్రభుత్వం యొక్క ఫేమ్ 2 వంటి ప్రోత్సాహల వలన ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ దేశీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందనుంది. భారత మార్కెట్లో రివోల్ట్ ఆర్వి400 రూ.1 లక్ష ధరతో ఉండనుంది.