బిఎస్ 6 బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ : ధర & ఇతర వివరాలు

బెనెల్లి ఇండియా, ఇంపీరియల్ 400 బిఎస్ 6 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త బిఎస్-6 కంప్లైంట్ బెనెల్లి ఇంపీరియల్ 400ప్రారంభ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇది బిఎస్-4 మోడల్ కంటే 20,000 రూపాయల ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బిఎస్ 6 బెనెల్లి ఇంపీరియర్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ మీకోసం..

బిఎస్ 6 బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ : ధర & ఇతర వివరాలు

కొత్త బెనెల్లి ఇంపీరియల్ 400 బిఎస్ 6 మోడల్‌ను ఇప్పుడు భారతదేశం అంతటా ఏదైనా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా 6,000 రూపాయలకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. దీని కోసం డెలివరీలు వచ్చే నెలలో ఎప్పుడైనా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

బిఎస్ 6 బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ : ధర & ఇతర వివరాలు

ఎక్స్-షోరూమ్ (ఇండియా) ప్రారంభ ధర రూ. 1.69 లక్షలతో గత ఏడాది అక్టోబర్‌లో ఈ మోటార్‌సైకిల్‌ను విడుదల చేశారు. ఈ కొత్త బైక్ 374 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 20 బిహెచ్‌పి మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 29 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:పేద ప్రజల వైద్య సేవకు మొబైల్ క్లినిక్ వ్యాన్ అందించిన ఫోక్స్‌వ్యాగన్ & స్కోడా

బిఎస్ 6 బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ : ధర & ఇతర వివరాలు

ఈ బైక్ లో బిఎస్ 6 ఇంజిన్ అప్‌డేట్ మినహా, ఇతర మార్పులు చేయలేదు. ఇంపీరియల్ 400 దాని బిఎస్ 4 మోడల్ మాదిరిగానే 205 కిలోల బరువును కలిగి ఉంది. సస్పెన్షన్ ముందు భాగంలో అదే 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో షాక్ అబ్జార్బర్స్ చేత నిర్వహించబడుతున్నాయి.

బిఎస్ 6 బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ : ధర & ఇతర వివరాలు

ఈ బైక్ యొక్క బ్రేకింగ్ వ్యవస్థను గమనించినట్లయితే దీని ముందు మరియు వెనుక వైపు వరుసగా 300 మిమీ మరియు 240 మిమీ డిస్కులచే నిర్వహించబడుతుంది. అంతే కాక ఇందులో స్టాండర్డ్ డ్యూయెల్ ఛానల్ ఎబిఎస్ కూడా ఉంటుంది.

MOST READ:టాటా నానో కారును ఢీ కొట్టి దెబ్బతిన్న హోండా సిటీ కార్ ; [వీడియో]

బిఎస్ 6 బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ : ధర & ఇతర వివరాలు

ఈ మోటారుసైకిల్ అదే రెట్రో-క్లాసిక్ డిజైన్‌ కలిగి ఉంటుంది. ఇందులో టియర్-డ్రాప్ ఆకారపు ఇంధన ట్యాంక్, క్లీన్ లైన్లు, రెట్రో-తీమ్డ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు వైపులా స్పోక్ వీల్స్ కలిగి ఉంటుంది.

బిఎస్ 6 బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ : ధర & ఇతర వివరాలు

బెనెల్లి ఇంపీరియల్ 400 బిఎస్ 6 కూడా అదే మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అవి రెడ్, బ్లాక్ మరియు సిల్వర్ కలర్స్.

MOST READ:15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాహనాలు తిరగటం నిషేధించిన NGT ; ఎందుకంటే ?

బిఎస్ 6 బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ : ధర & ఇతర వివరాలు

భారతదేశంలో బెనెల్లి ఇంపీరియల్ 400 బిఎస్ 6 లాంచ్ పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

బెనెల్లి ఇంపీరియల్ 400 భారత మార్కెట్లో చాలామంది వినియోగదారులను ఆకర్షించింది. ఈ ఇంపీరియల్ 400 బైక్ జావా మోటార్ సైకిల్స్ మరియు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ బైక్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి మంచి డ్రైవింగ్ అనుభూతిని కూడా ఇస్తుంది.

Most Read Articles

Read more on: #benelli
English summary
Benelli Imperiale 400 BS6 Launched In India. Read in Telugu.
Story first published: Friday, July 10, 2020, 14:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X