రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ - వివరాలు

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ, తమ కస్టమర్ల కోసం ఓ సరికొత్త రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ స్కీమ్ క్రింద ఏథర్ ఎనర్జీ స్కూటర్లను కలిగిన ఓనర్లు మరియు కొత్త కస్టమర్లు ఆకర్షనీయమైన తగ్గింపులు మరియు డిస్కౌంట్లను పొందే అవకాశం ఉంది. చెన్నై, బెంగుళూరు నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ - వివరాలు

ఏథర్ రెఫరల్ ప్రోగ్రామ్‌లో భాగంగా, ఇప్పటికే ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగిన ఉన్న యజమానులు వారి స్నేహితులతో రెఫెరల్ కోడ్‌ను పంచుకోవడానికి ఏథర్ అనుమతిస్తుంది. కొత్త కస్టమర్లు ఈ రెఫెరల్ కోడ్‌ను ఉపయోగించి స్కూటర్‌ను కొనుగోలు చేస్తే, రెఫరర్ మరియు రెఫరీ ఇద్దరూ ఒక్కొక్కరికి రూ.2,500 విలువైన క్యాష్ బెనిఫిట్స్ పొందుతారు.

రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ - వివరాలు

అంతేకాకుండా, ఈ రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసిన వారికి అధిక వెయిటింగ్ పీరియడ్ లేకుండా, వేగంగా స్కూటర్ డెలివరీలు జరుగుతాయని కంపెనీ ప్రకటించింది. ముందస్తుగా ఆర్డర్ చేసిన ఏథర్ 450 స్కూటర్లను కంపెనీ పేమెంట్ చేసిన మూడు వారాల్లోనే డెలివరీ చేస్తోంది.

MOST READ:లాంగ్ డ్రైవ్ చేయాలనుకునే వారికి 5 ఉత్తమ పర్యాటక ప్రదేశాలు & ఉత్తమ బైక్‌లు ఇవే

రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ - వివరాలు

ఏథర్ ఎనర్జీ ఇప్పటికే ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వంటి సులభమైన యాజమాన్య విధానాలను కూడా ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కస్టమర్లు ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఏదైనా పెట్రోల్ ద్విచక్ర వాహనాన్ని ఎక్సేంజ్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా, లీజింగ్ సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టింది. స్కూటర్‌ను నేరుగా కొనుగోలు చేయకుండా, కొంత కాలం పాటు లీజుకు తీసుకునే సదుపాయాన్ని ఏథర్ ఎనర్జీ కల్పిస్తోంది.

రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ - వివరాలు

రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఫోకెలా మాట్లాడుతూ, "చాలా మంది ఏథర్ 450 యజమానులు ఈ మోడల్‌ను కొత్త కస్టమర్లకు సిఫారసు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మా ఉత్పత్తి మరియు బ్రాండ్‌పై వారు ఉంచిన విశ్వాసానికి ప్రతిఫలంగా ఈ రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టామని" అన్నారు.

MOST READ:హైస్పీడ్ వాహనాలను గుర్తించే హై-స్పీడ్ కెమెరాలు.. వచ్చేస్తున్నాయ్

రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ - వివరాలు

ఆయన మాట్లాడుతూ.. "మా యజమానుల సంఘం మరియు ఏథర్ ఫోరంలు రెండింటి ద్వారా మాకు మద్దతు తెలిపే వారు విమర్శించే వారి వలన ఈ రంగంలో మేము మరింత ఎదగడానికి మరియు మా ఉత్పత్తులను మెరుగుపరచడానికి వీలు కలుగుతోంది. ఏథర్ 450 ప్రారంభించినప్పటి నుండి మార్కెట్లో మేము ఒక బలమైన పునాదిని నిర్మించాము. కస్టమర్లతో కూడా బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి. రాబోయే నెలల్లో మేము మా ఏథర్ 450 ఎక్స్ మోడల్‌ను మరిన్ని కొత్త మార్కెట్లలోకి ప్రవేశపెట్టాలని తద్వారా మా సంఘాన్ని బలోపేతం చేయాలని మేము ఆశిస్తున్నామని" అన్నారు.

రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ - వివరాలు

ఏథర్ ఎనర్జీకి సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ ఈ ఏడాది నవంబర్ నాటికి పూణేలో కార్యకలాపాలు ప్రారంభించాలని యోచిస్తోంది. అలాగే, ప్రతిదీ సరిగ్గా జరిగితే, 2020 డిసెంబర్ నాటికి ముంబైలోనూ, మరికొద్ది వారాల్లో ఢిల్లీ మార్కెట్లోనూ ప్రవేశించనున్నట్లు కంపెనీ తెలిపింది.

MOST READ:45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్‌ప్రెస్‌వే.. చూసారా !

రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ - వివరాలు

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా ఈవీ విధానంతో, ఆ రాష్ట్రంలో వ్యాపారాన్ని ఏర్పాటు చేయాలనే సంస్థ ప్రణాళికలకు గట్టి ప్రోత్సాహాన్నిచ్చింది. ఢిల్లీ సర్కారు ప్రవేశపెట్టిన కొత్త ఈవీ పాలసీ వలన ఈవీల తయారీదారులు మరియు ఈవీల కొనుగోలుదారులు ఇద్దరికీ లబ్ధి చేకూరుతుంది.

రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ - వివరాలు

ఏథర్ ఎనర్జీ 2021 చివరి నాటికి 20 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. దీనికి అదనంగా, కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా, ప్రస్తుతం హోసూర్‌లో ఏర్పాటు చేయబడుతున్న కొత్త ఉత్పాదక ప్లాంట్ సామర్థ్యాన్ని కూడా పెంచను్ననారు. ఈథర్ ఎనర్జీ ప్రకారం, ఈ కొత్త ప్లాంట్ 400,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది, ఇది ఏటా 100,000 యూనిట్లను ఉత్పత్తి చేసేలా రూపొందించబడింది.

MOST READ:ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులపై ప్రతీకారం తీర్చుకున్న ఇ-బోర్డు ఉద్యోగి, ఎలాగో తెలుసా

రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన ఏథర్ ఎనర్జీ - వివరాలు

ఏథర్ ఎనర్జీ రెఫరల్ ప్రోగ్రామ్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ క్రమంగా పెరుగుతోంది. ఏథర్ ఎనర్జీ అందిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు దాని సాంకేతికత మరియు ఆధునిక డిజైన్ కారణంగా వాడకానికి చాలా ప్రాక్టికల్‌గా అనిపిస్తాయి. కంపెనీ ప్రవేశపెట్టిన కొత్త రెఫరల్ ప్రోగ్రామ్‌తో దేశంలో ఏథర్ ఎనర్జీ అమ్మకాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Ather Energy has launched a new referral programme for its customers in Bengaluru and Chennai. Under the new scheme, both owners and new customers will be rewarded with exciting discounts and offers. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X