మరోసారి పెరిగిన బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ధర; ఈసారి ఎంత పెరిగిందంటే?

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, మార్కెట్లో విక్రయిస్తున్న బజాజ్ పల్సర్ 200 ఎన్ఎస్ మోటార్‌సైకిల్ ధరను కంపెనీ సైలెంట్‌గా పెంచింది. ఈసారి బజాజ్ పల్సర్ 200 ఎన్ఎస్ ధరను రూ.2,219 మేర పెంచారు. తాజా పెంపు తర్వాత ఈ మోడల్ ధర ఇప్పుడు రూ.1.31 లక్షలు, ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది.

మరోసారి పెరిగిన బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ధర; ఈసారి ఎంత పెరిగిందంటే?

ఈ ఏడాది ప్రారంభంలో పల్సర్ 200ఎన్ఎస్ మోడల్‌లో బిఎస్6 అప్‌డేట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత దీని ధరలు పెరగడం ఇది వరుసగా మూడవసారి. బజాజ్ ఆటో ఏప్రిల్ 2020లో బిఎస్6 కంప్లైంట్ బజాజ్ పల్సర్ 200 ఎన్ఎస్‌ను రూ.1.25 లక్షల ధరకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేశారు.

మరోసారి పెరిగిన బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ధర; ఈసారి ఎంత పెరిగిందంటే?

పల్సర్ 200ఎన్ఎస్ మోడల్ ధరలను మొదటిసారిగా మే 2020లో పెంచారు. అప్పట్లో ఈ మోడల్ ధరను రూ.3000 మేర పెంచారు. ఆ తర్వాత రెండవసారి రూ.1000 మేర గడచిన జూలై నెలలో పెంచారు. కాగా.. ఈ ధరల పెరుగుదలకు సంబంధించిన కారణాన్ని బజాజ్ ఆటో ఇంకా వెల్లడించలేదు. పెరిగిన ఉత్పాదక వ్యయాలే ఇందుకు కారణమని తెలుస్తోంది.

MOST READ:భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

మరోసారి పెరిగిన బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ధర; ఈసారి ఎంత పెరిగిందంటే?

ధరల పెరుగుదల మినహా, బజాజ్ పల్సర్ 200 ఎన్ఎస్‌లో వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇందులో కెటిఎమ్ డ్యూక్ 200 నుండి గ్రహించిన 199.5 సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9,700 ఆర్‌పిఎమ్ వద్ద 24 బిహెచ్‌పి శక్తిని మరియు 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

మరోసారి పెరిగిన బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ధర; ఈసారి ఎంత పెరిగిందంటే?

పల్సర్ ఎన్ఎస్200 ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో ప్రీ-లోడ్ డ్యాంపింగ్ కోసం సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 300 మిమీ డిస్క్‌లు మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్‌లు ఉంటాయి. ఇది సింగిల్ ఛానెల్ ఏబిఎస్‌ను స్టాండర్డ్‌గా కలిగి ఉంటుంది.

MOST READ:కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

మరోసారి పెరిగిన బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ధర; ఈసారి ఎంత పెరిగిందంటే?

ఈ మోటార్‌సైకిల్‌కు రెండు వైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు 100/80 మరియు వెనుక వైపు 130/70 ప్రొఫైల్ టైర్లు ఉంటాయి. బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ బ్లాక్, వైట్, యల్లో, రెడ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

మరోసారి పెరిగిన బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ధర; ఈసారి ఎంత పెరిగిందంటే?

ఇందులో ఆఫర్ చేస్తున్న ప్రధాన ఫీచర్లను గమనిస్తే, పల్సర్ 200ఎన్ఎస్‌లో సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది, ఇది అనలాగ్ టాకోమీటర్‌ను కూడా కలిగి ఉంటుంది. క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, చిన్న విండ్‌స్క్రీన్, హాలోజన్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్, స్ప్లిట్-సీట్ వంటి ఫీచర్లు ఇందులో ప్రధానమైనవి.

MOST READ:హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

మరోసారి పెరిగిన బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ధర; ఈసారి ఎంత పెరిగిందంటే?

కాగా.. పల్సర్ ఎన్ఎస్200 మోటార్‌సైకిల్‌లో కంపెనీ మరిన్ని కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త పెయింట్ స్కీమ్స్ కోసం బజాజ్ ఆటో ఇప్పటికే ఓ టెలివిజన్ కమర్షియల్‌ను సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ టీజర్‌ను కూడా కంపెనీ రిలీజ్ చేసింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

మరోసారి పెరిగిన బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ ధర; ఈసారి ఎంత పెరిగిందంటే?

బజాజ్ పల్సర్ 200 ఎన్ఎస్ ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ భారతదేశంలో లభిస్తున్న బెస్ట్ 200సీసీ నేక్డ్ మోటార్‌సైకిళ్లలో ఒకటిగా ఉంది. ఈ మోటార్‌సైకిల్‌లోని ఇంజన్‌ను కెటిఎమ్ బ్రాండ్ నుండి గ్రహించారు. ఇది ఈ విభాగంలో కెటిఎమ్ డ్యూక్ 200, టివిఎస్ అపాచీ ఆర్టిఆర్ 200 4వి మరియు హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:ట్రక్ దొంగలించిన కొంత సమయానికే పట్టుబడ్డ దొంగల ముఠా.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా ?

Most Read Articles

English summary
Bajaj Auto has silently hiked the prices of its Pulsar 200NS motorcycle in the Indian market. The Bajaj Pulsar 200NS is now priced at Rs 1.31 lakh, ex-showroom (Delhi). The motorcycle received a price hike of Rs 2,219 over its previous pricing in the market. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X