Just In
Don't Miss
- Finance
పరిహారం చెల్లించకపోతే ఆ ఆస్తులు జఫ్తు చేస్తాం: భారత్‌కు కెయిర్న్ తీవ్ర హెచ్చరిక
- News
తెలంగాణ పీఆర్సీ నివేదిక విడుదల... ఫిట్మెంట్,హెచ్ఆర్ఏ,బేసిక్ పేలపై కమిటీ కీలక ప్రతిపాదనలివే...
- Lifestyle
గోధుమ రవ్వ పాయసం
- Sports
వేలంలో మిచెల్ స్టార్క్ కోసం ఆర్సీబీ ఎంత ధరైనా చెల్లిస్తుంది: ఆకాశ్ చోప్రా
- Movies
డిజిటల్ రిలీజ్ కు సిద్దమైన మాస్టర్.. ఇక బాక్సాఫీస్ రికార్డులకు బ్రేక్ పడినట్లే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ విడుదల; ధర, ఫీచర్లు
భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీల్లో ఒకటైన బజాజ్ ఆటో, దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ పాపులర్ పల్సర్ సిరీస్‌లో మరో కొత్త వేరియంట్‌ను మార్కెట్లో విడుదల చేసింది. బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ పేరిట కంపెనీ ఓ కొత్త మోడల్‌ను విడుదల చేసింది. పల్సర్ సిరీస్‌లో బేస్-వేరియంట్‌గా వచ్చిన ఈ మోడల్ ధర రూ.73,274 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ డ్రమ్ బ్రేక్ బేస్ వేరియంట్ చూడటానికి దాని టాప్ ఎండ్ వేరియంట్ మాదిరిగానే ఉంటుంది. ఇందులో ప్రధానమైన మార్పు ఏంటంటే, ముందు వాపు డిస్క్ బ్రేక్ స్థానంలో డ్రమ్ బ్రేక్ ఉంటుంది. ఈ రెండు మోడళ్ల డిజైన్, ఫీచర్లు ఒకేలా ఉంటాయి. ఎంట్రీ లెవల్ మోడల్‌గా వచ్చిన పల్సర్ 125 స్ప్లిట్ సీట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్‌లో ముందు వైపు 170 మిమీ మరియు వెనుక వైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి.

అదే, బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ టాప్ ఎండ్ వేరియంట్ అయిన డిస్క్ బ్రేక్ మోడల్‌తో పోలిస్తే, దాని ముందు భాగంలో 240 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటుంది.
MOST READ:మహీంద్రా స్కార్పియోలో ఇప్పుడు అదిరిపోయే కొత్త ఫీచర్; ఏంటో తెలుసా?

కొత్త బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ యొక్క బేస్ మోడల్‌లో డిస్క్ బ్రేక్‌ను తొలగించిన కారణంగా, దీని ధర కూడా భారీగా తగ్గింది. టాప్ ఎండ్ (డిస్క్) వేరియంట్‌తో పోలిస్తే బేస్ (డ్రమ్) వేరియంట్ ధర సుమారు 7,000 రూపాయలు తక్కువగా ఉంది. ఈ ఒక్క మార్పు మినహా ఈ రెండు వేరియంట్లలో వేరే ఏ ఇతర మార్పులు లేవు. ఇవి రెండూ బ్లాక్ రెడ్ మరియు బ్లాక్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

బజాజ్ పల్సర్‌ను దాదాపు 15 సంవత్సరాల క్రితం విడుదల హెడ్‌లైట్ కౌల్‌తో చేసిన సంగతి తెలిసినదే. ఇప్పటికీ అదే డిజైన్ క్యారీ చేస్తున్న పల్సర్ మోటార్‌సైకిళ్లలో బజాజ్ పల్సర్ 125 ఒకటి. ఇది ఇప్పటికీ భారత మార్కెట్లో కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన డిజైన్‌గా కొనసాగుతూనే ఉంది.
MOST READ:భారత మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో లాంచ్ డీటైల్స్

పల్సర్ 125 ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల ట్విన్ గ్యాస్-షాక్ అబ్జార్బర్స్ యూనిట్ ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ రెండు చివర్లలో ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

పల్సర్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, రెండు పైలట్ ల్యాంప్స్‌తో కూడిన హాలోజన్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడి టెయిల్ ల్యాంప్, ట్యాంక్ ష్రుడ్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 11.5-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, ఇంజన్ కౌల్, బ్లాక్-అవుట్ మజిక్యులర్ లుకింగ్ ఎగ్జాస్ట్, స్ప్లిట్ గ్రాబ్-రైల్స్ మరియు క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్స్ మొదలైనవి ప్రధానంగా చెప్పుకోవచ్చు.
MOST READ:ప్రైవేట్ బస్సుకు రూ. 5 లక్షలకుపైగా జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

ఇంజన్ విషయానికి వస్తే, బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ మోడల్‌లో 124.4 సిసి ఎయిర్-కూల్డ్ డిటిఎస్-ఐ ఇంజన్‌ను ఉపయోగించారు ఈ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 11.3 బిహెచ్‌పి శక్తిని మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 10.8 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్టాండర్డ్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
బజాజ్ ఆటో తమ పాపులర్ పల్సర్ సిరీస్‌లో చవకైన వేరియంట్‌ను అందించేందుకు గాను పల్సర్ 125 స్ప్లిట్ సీట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ఈ విభాగంలో హీరో గ్లామర్ మరియు హోండా ఎస్‌పి 125 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.
MOST READ:కొత్త కలర్స్‌లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ NS & RS బైక్స్ ; ఇప్పుడు వీటి రేటెంతో తెలుసా ?