మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; వివరాలు

దేశీయ మార్కెట్లో బజాజ్ సంస్థ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటి. ఈ బజాజ్ కంపెనీ తన చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 2020 ప్రారంభంలో మార్కెట్లో ప్రవేశపెట్టబడింది. ఈ స్కూటర్లు ప్రస్తుతం పూణే మరియు బెంగళూరులలో విక్రయించబడుతోంది. కానీ సంస్థ ఇప్పుడు 2022 మార్చి నాటికి 30 కొత్త నగరాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు, ఇటీవల కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ ధృవీకరించారు.

మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; ఎందుకో ఊహించగలరా..!

ఫేజ్-1 విస్తరణ ప్రణాళిక పూర్తయిన తర్వాతే దేశవ్యాప్తంగా బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ తీసుకురావడానికి ప్రణాళికను తీసుకురావచ్చు. బజాజ్ సంస్థ చకన్‌ ప్లాంట్ లో రెండవ సదుపాయాన్ని తీసుకువస్తోంది. రెండవ సదుపాయం అందుబాటులోకి వచ్చిన తరువాత ఉత్పత్తి పెంచే అవకాశం ఉంది. ఆ ఆతర్వాత వీటిని దేశవ్యాప్తంగా తీసుకువచ్చే అవల్కసం ఉంది.

మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; ఎందుకో ఊహించగలరా..!

బజాజ్ సంస్థ ఈ నెల ప్రారంభంలో కొత్త ఉత్పత్తి సదుపాయాన్ని వెల్లడించింది, ఇది చకన్ లోని కంపెనీ యొక్క రెండవ ప్లాంట్. ఈ ప్లాంట్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ తో పాటు ట్రయంఫ్, కెటిఎమ్ మరియు హస్క వర్ణా మోడళ్లను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది.

MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి

మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; ఎందుకో ఊహించగలరా..!

బజాజ్ కంపెనీ ఈ కొత్త సదుపాయం కోసం రూ. 650 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. 2023 నాటికి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ ఉత్పత్తి ఈ సదుపాయంలో ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఈ సదుపాయంలో ప్రీమియం బైక్‌లు, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేయనున్నట్లు రాకేశ్ శర్మ అధికారికంగా ప్రకటించారు.

మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; ఎందుకో ఊహించగలరా..!

బజాజ్ యొక్క చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ప్రీమియం ద్విచక్ర వాహనం, ఇది దేశవ్యాప్తంగా విస్తరించడానికి ముందు కస్టమర్ల అభిప్రాయాల కోసం రెండు మెట్రో నగరాలకు మాత్రమే తీసుకురాబడింది, అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ వాహనాల విస్తరణకు కొంత ఆటంకం కలిగింది. ఈ కారణంగా ఉత్పత్తి నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

MOST READ:పెట్రోల్ బంక్‌లోనే బ్యాటరీ ఎక్స్చేంజ్ సెంటర్స్ ప్రారంభించనున్న హెచ్‌పి ; వివరాలు

మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; ఎందుకో ఊహించగలరా..!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ ఈ కారణంగా చాలా నెలలుగా నిలిపివేయవలసి వచ్చింది. కాబట్టి సంస్థ ఓల్డ్ ఆర్డర్స్ పూర్తి చేయడానికి పూనుకుంది. గత సంవత్సరంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ కారణంగా సంస్థ ఇప్పుడు ఉత్పత్తిని మెరుగుపరచడంపై దృష్టి సారించింది.

మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; ఎందుకో ఊహించగలరా..!

బజాజ్ కంపెనీ మొదట టైర్ 1 మరియు టైర్ 2 నగరాల్లో తన డీలర్‌షిప్‌లను విస్తరించాలని ఆశిస్తోంది. మొదటి దశలో ఢిల్లీ, చెన్నై, వైజాగ్, హైదరాబాద్, జైపూర్, గోవా వంటి ప్రదేశాలలో కంపెనీ రాబోతోంది. బజాజ్ యొక్క అమ్మకాల విషయానికి వస్తే గత మూడు నెలల్లో 800 యూనిట్లు అమ్ముడైనట్లు నివేదికలు తెలిపాయి.

MOST READ:మీ ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవాలా? అయితే ఇలా చేయండి!

మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; ఎందుకో ఊహించగలరా..!

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో ఏథర్ 450 ఎక్స్, టివిఎస్ ఐక్యూబ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. చేతక్ యొక్క బుకింగ్స్ సెప్టెంబరులో మూసివేసిన సంగతి తెలిసిందే, కానీ బుకింగ్స్ త్వరలో ప్రారంభం కానుంది. భారతదేశంలో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణంగా వాహన తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై ద్రుష్టి సారిస్తున్నారు.

మరో 30 నగరాలకు విస్తరించనున్న బజాజ్ చేతక్ ; ఎందుకో ఊహించగలరా..!

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వాడకాలు తక్కువ కావడానికి ప్రధాన కారణంగా, ఎలక్ట్రిక్ వాహనాలకు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం. కానీ ఇటీవల కాలంలో ప్రభుత్వాల సహకారంతో వాహనసంస్థలు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రానున్న కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెద్ద ఎత్తున సాగనున్నట్లు అర్థమవుతుంది.

MOST READ:వెహికల్ ఛార్జింగ్ కోసం మొబైల్ ఛార్జింగ్ రోబోట్స్ ; పూర్తి వివరాలు

Most Read Articles

English summary
Bajaj Chetak Electric To Launch In New Cities. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X