Just In
- 1 hr ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 2 hrs ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 3 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 4 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- Sports
యువరాజ్ సింగ్ ట్వీట్‌పై దుమారం.. ఈ లెక్కన కోహ్లీ 200 సెంచరీలు చేసేవాడా?
- News
చంద్రబాబు చచ్చిన పాముతో సమానం..ఎక్కడికెళ్ళినా పీకేదేం లేదు: విజయసాయి రెడ్డి ధ్వజం
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Movies
ఈ సినిమా చేస్తే కొడతారని చెప్పింది.. అందుకే కాజల్‌కు ఫోన్ చేశా: మంచు విష్ణు
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
త్వరపడండి.. దీపావళి సందర్భంగా బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్‌పై భారీ ఆఫర్స్
బెనెల్లి ఇండియా దీపావళి పండుగ సందర్భంగా తన ఇంపీరియల్ 400 బైక్‌లపై భారీ తగ్గింపును ప్రకటించింది. భారతీయ మార్కెట్లో బిఎస్-6 కాలుష్య నిబంధనలకు అనుగుణంగా కంపెనీ ఇంపీరియల్ 400 బైక్‌ను మాత్రమే విక్రయిస్తోంది. దీని గురించి మరింత తెలుసుకుందాం..

భారతీయ రెట్రో క్లాసిక్ బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్‌పై ఇప్పుడు రూ. 12 వేల వరకు తగ్గింపును ప్రకటించింది. దీపావళి పండుగకు బెనెల్లి ఇండియా తమ వినియోగదారులకు ఒక మంచి ఆఫర్ ను అందించింది. రెడ్ అండ్ వైట్ కలర్ లో బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ అందుబాటులో ఉంది. ఈ దీపావళి ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే లభిస్తుంది.

బెనెల్లి రెట్రో ఇంపీరియల్ 400 కూడా బైక్‌పై ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్‌ను అందిస్తోంది. కంపెనీ గరిష్టంగా 4,999 రూపాయల ఇఎమ్ఐ మరియు ఎక్స్-షోరూమ్ ధరలో గరిష్టంగా 85 శాతం కలిగి ఉంది. ఇండియన్ ఎక్స్-షోరూమ్ ప్రకారం కొత్త బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ ధర రూ. 1.99 లక్షలతో ప్రారంభమవుతుంది. ఇంపీరియల్ 400 బైక్‌కు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
MOST READ:టాటా మోటార్స్ అక్టోబర్ సేల్స్ రిపోర్ట్ ఎలా ఉందో చూసారా?

బెనెల్లి 2019 లో ఇంపీరియల్ 400 ను ఆవిష్కరించారు. ఈ బైక్ 374 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ బిఎస్-6 కాలుష్య నియమానికి అనుగుణంగా నవీకరించబడింది. ఈ ఇంజిన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద 20 బిహెచ్‌పి శక్తిని మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 29 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

బిఎస్-6 కాలుష్య నియమానికి అనుగుణంగా ఇంజిన్ నవీకరించబడింది తప్ప, ఇందులో ఇతర మార్పులు చేయలేదు. కొత్త ఇంపీరియల్ 400 బైక్ వెనుక 19 ఇంచెస్ ఫ్రంట్ మరియు 18 ఇంచెస్ టైర్లను కలిగి ఉంది.
MOST READ:ట్రాక్టర్ అమ్మకాలలో దూసుకెళ్తున్న సోనాలికా.. కారణం ఏంటో తెలుసా !

కొత్త బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ క్లాసిక్ లుక్ కలిగి ఉంది. ఈ బెనెల్లి ఇంపీరియల్ 400 బైక్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో క్లాసిక్ లుక్ కోసం గుండ్రని హెడ్‌ల్యాంప్‌లు అందించబడతాయి. అదనంగా ఈ బైక్‌ను ట్విన్ పాడ్ ఇన్‌స్టాన్స్ ట్రూ క్లస్టర్‌తో అందిస్తున్నారు.

ఇంపీరియల్ 400 బైక్ భారత మార్కెట్లో జావా మరియు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇంపీరియల్ 400 బైక్‌పై గొప్ప ఆఫర్‌ను అందిస్తుంది, ఇది ఈ పండుగ సీజన్‌లో ఎక్కువ బైకులను విక్రయించడానికి సహాయపడుతుంది. ఏది ఏమైనా పండుగ సీజన్లో వినియోగదారులు ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమే.
MOST READ:రూ. 30 వేల విలువైన స్కూటర్‌కి రూ. 42 వేలు ఫైన్.. చివరికి ఏమైందంటే ?