డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

ఇటాలియన్ సూపర్ బైక్ కంపెనీ డ్యుకాటి, ఓ సరికొత్త మోటార్‌సైకిల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 ఇప్పుడు బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌గా నిలుస్తుంది.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

డ్యుకాటి మల్టీస్ట్రాడా ఇప్పుడు స్టాండర్డ్, వి4 ఎస్ మరియు వి4 ఎస్ స్పోర్ట్ అనే మూడు వేరియంట్లలో లభ్యం కానుంది. మల్టీస్ట్రాడా వి4 బ్రాండ్ యొక్క పోర్ట్‌ఫోలియోలో పానిగల్ వి4 మోటార్‌సైకిల్‌కు శక్తినిచ్చే సరికొత్త ఇంజిన్‌తో పనిచేస్తుంది. అయితే, కంపెనీ ఈ ఇంజన్‌ను అడ్వెంచర్ టూరర్ యొక్క ఫీచర్లకు అనుగుణంగా మోడిఫై చేసింది.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

ఇందులోని 1158 సిసి వి4 గ్రాంటూరిస్మో లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 10,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 170 బిహెచ్‌పి శక్తిని మరియు 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్-అసిస్ట్ క్లచ్ మరియు (డిక్యూఎస్) డ్యుకాటి క్విక్ షిఫ్ట్ బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ టెక్నాలజీతో కూడిన సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ఎట్టకేలకు భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ ఐ 20 : ధర & ఇతర వివరాలు

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 బ్రాండ్ యొక్క విలక్షణమైన అడ్వెంచర్-టూరర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. వి4 మోడల్ అగ్రెసివ్‌గా మరియు అందంగా కనిపిస్తుంది. ఇది ముందు వైపు నుండి ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్‌లో ఎయిర్-ఇన్‌లెట్‌లతో పాటుగా ఏర్పాటు చేసిన ట్విన్-పాడ్ హెడ్‌ల్యాంప్‌లు మరియు హెడ్‌ల్యాంప్స్‌లో ఇంటిగ్రేటెట్ చేసిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

ఇతర డిజైన్ ఫీచర్లలో పొడవైన సర్దుబాటు చేయగల విండ్‌స్క్రీన్, నకల్ గార్డ్స్, ఫ్రేమ్ ప్రొటెక్టర్స్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పైన జిపిఎస్ మౌంట్‌లతో పాటు 12వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ లగేజ్ ర్యాక్, అప్-స్వీప్ ఎగ్జాస్ట్, బ్యాక్‌లైట్ స్విచ్ గేర్, స్ప్లిట్ సీట్స్ మొదలైన వాటిని గమనించవచ్చు.

MOST READ:20,000 యూనిట్ల బుకింగ్స్ దాటిన మహీంద్రా థార్.. మళ్ళీ పెరిగిన వెయిటింగ్ పీరియడ్ పీరియడ్

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

ఈ మోటార్‌సైకిల్‌లో 22-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ అడ్వెంచర్-టూరర్ యొక్క వి4 ఎస్ స్పోర్ట్ వేరియంట్‌లో కార్బన్ ఫైబర్ ఫ్రంట్ మడ్‌గార్డ్‌తో పాటు అక్రపోవిక్ ఎండ్-కెన్ మఫ్లర్ కూడా ఉంటుంది.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 రాడార్ టెక్నాలజీ కారణంగా అడ్వెంచర్-టూరింగ్ విభాగంలో ఒక ముఖ్యమైన మరియు బెంచ్‌మార్క్ మోటార్‌సైకిల్‌గా నిలుస్తుంది. ఈ మోటార్‌సైకిల్ ముందు మరియు వెనుక భాగంలో రాడార్ టెక్నాలజీని కలిగి ఉన్న ప్రపంచంలో మొట్టమొదటి మోటారుసైకిల్ ఇది, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ మరియు రాడార్-గైడెడ్ క్రూయిజ్ కంట్రోల్‌ను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:రూ. 9 లక్షలకు ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్న యువకుడు.. ఇంతకీ ఏంటి ఈ నెంబర్ స్పెషల్

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

డబుల్ సైడెడ్ అల్యూమినియం స్వింగార్మ్‌తో కూడిన అల్యూమినియం మోనోకోక్ ఫ్రేమ్‌ను ఉపయోగించి మల్టీస్ట్రాడా వి4ను తయారు చేశారు. ఇందులో ముందు వైపు 50 ఎంఎం ట్రావెల్‌తో పూర్తిగా సర్దుబాటు చేయగల యుఎస్‌డి ఫోర్క్ మరియు వెనుక వైపు డ్యుకాటి స్కైహూక్ సస్పెన్షన్ (డిఎస్ఎస్) టెక్నాలజీతో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 215 కిలోల కెర్బ్ వెయిట్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో 170 మిమీ మరియు వెనుక భాగంలో 180 మిమీ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉంటుంది. మోటారుసైకిల్ సీటును 840 మిమీ మరియు 860 మిమీ మధ్య సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉంటుంది. దీని వీల్ బేస్ 1,567 మిమీగా ఉంటుంది.

MOST READ:కొత్త హ్యుందాయ్ ఐ 20 ఫస్ట్ లుక్ రివ్యూ.. చూసారా !

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

ఈ మోటారుసైకిల్‌ బ్రేకింగ్ ఫీచర్‌ను గమనిస్తే, ముందు వైపు 320 మిమీ డ్యూయల్-సెమీ ఫ్లోటింగ్ డిస్క్‌లతో పాటు రేడియల్‌గా అమర్చిన బ్రెంబో మోనోబ్లోక్ ఫోర్-పిస్టన్ కాలిపర్స్ మరియు ముందు భాగంలో రేడియల్ మాస్టర్ సిలిండర్ ద్వారా జరుగుతుంది. మరియు వెనుక భాగంలో, బ్రెంబో టూ పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్‌తో కూడిన 265 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. మోటారుసైకిల్ వరుసగా ముందు మరియు వెనుక భాగంలో సెక్షన్ 120/70 మరియు 170/60 పిరెల్లి స్కార్పియన్ ట్రైల్ II టైర్లతో అమర్చిన 19-ఇంచ్ మరియు 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 స్టాండర్డ్ వేరియంట్లో 5 ఇంచ్ టిఎఫ్‌టి డిస్‌ప్లే ఉంటుంది, మిగిలిన రెండు వేరియంట్లు 6.5 ఇంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ మోటారుసైకిల్‌లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉంటాయి, ఇవన్నీ వివిధ రైడింగ్ మోడ్లతో లోడ్ అవుతుంది, వీటిని స్విచ్ గేర్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉపయోగించి కంట్రోల్ చేయవచ్చు.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

ఇందులో స్పోర్ట్, టూరింగ్, అర్బన్ మరియు ఎండ్యూరో వంటి వివిధ రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. వీటిని ప్రారంభించడానికి రైడ్-బై-వైర్ సిస్టమ్ ఉంటుంది. ఇతర ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లలో (డిటిసి) డ్యుకాటి ట్రాక్షన్ కంట్రోల్, (డిడబ్ల్యుసి) డ్యుకాటి వీలీ కంట్రోల్, బాష్ నుండి కార్నరింగ్ ఎబిఎస్ మరియు (విహెచ్‌సి) వెహికల్ హోల్డ్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్-టూరింగ్ మోటార్‌సైకిల్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసే ప్రణాళికలను డ్యుకాటి ఇంకా ధృవీకరించలేదు. అయితే, దేశంలో హై-ఎండ్ పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీ ఈ అడ్వెంచర్ టూరర్‌ను ఇండియాలో ప్రవేశపెట్టే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిల్‌ ఆవిష్కరణ

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

డ్యుకాటి మల్టీస్ట్రాడా వి4 అగ్రెసివ్ ఇటాలియన్ స్టైలింగ్‌ను కలిగిన అద్భుతమైన అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్. ఇది పెర్ఫార్మెన్స్‌తో పాటుగా ఫుల్లీ లోడెడ్ ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లతో లభ్యం కానుంది. ఈ అడ్వెంచర్ టూరర్ సరికొత్త రాడార్ టెక్నాలజీ వంటి ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో ఈ విభాగంలో ఓ కొత్త బెంచ్‌మార్క్‌ను సృష్టించనుంది.

Most Read Articles

English summary
Ducati has globally unveiled the much-awaited Multistrada V4 adventure-touring motorcycle. The Multistrada V4 is now the brand's flagship adventure touring motorcycle and is available in three variants: Standard, V4S and the V4 S Sport. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X