Just In
- 1 hr ago
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- 1 hr ago
45 లీటర్ల ఇంధన ట్యాంక్‌లో 48 లీటర్ల పెట్రోల్.. దీనితో మొదలైన గొడవ.. చివరికి ఏమైందంటే
- 2 hrs ago
సూపర్ సోకో నుండి మూడు సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్స్
- 3 hrs ago
చెన్నైలో కొత్త డీలర్షిప్ ప్రారంభించిన వోల్వో.. పూర్తి వివరాలు
Don't Miss
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- Sports
ఇంగ్లండ్ ఓటమిని ఎగతాళి చేసిన ఆ దేశ మహిళా క్రికెటర్.. మండిపడ్డ పురుష క్రికెటర్లు!
- News
ఏపీ మున్సిపల్ పోరుకు లైన్ క్లియర్- 16 పిటిషన్లను తోసిపుచ్చిన హైకోర్టు
- Movies
ఈ సినిమా చేస్తే కొడతారని చెప్పింది.. అందుకే కాజల్‌కు ఫోన్ చేశా: మంచు విష్ణు
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి: ఈవీ ఇండియా కొత్త ఫైనాన్స్ స్కీమ్
ఒడిశాకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ, ఈవీ ఇండియా జెస్ట్‌మనీతో కలిసి దేశంలో భవిష్యత్ కొనుగోలుదారుల కోసం కొత్త ఫైనాన్స్ పథకాలను ప్రవేశపెట్టింది. కస్టమర్లు ఈవీ ఇండియా ప్రోడక్ట్ లైనప్‌లో ఎంచుకునే మోడళ్లపై అందుబాటులో ఉన్న వివిధ రకాల ఫైనాన్స్ పథకాల నుండి తమకు అనుకూలమైన దానిని ఎంచుకోవచ్చు.

ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే వినియోగదారులకు పారదర్శక మరియు ఇబ్బంది లేని ఈఎమ్ఐ పరిష్కారాలను అందించడమే ఈ భాగస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యమని ఇరు కంపెనీలు తెలిపాయి. కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో కెవైసి ఫార్మాలిటీలను పూర్తి చేసి, రుణాన్ని తిరిగి చెల్లించడం కోసం 3, 6 లేదా 12 నెలల ఈఎమ్ఐ కాలపరిమితిలో తమకు నచ్చిన దానిని ఎంచుకోవచ్చు.

వీటికి అదనంగా, ఈ భాగస్వామ్యంలో భాగంగా 'ఇప్పుడు కొనండి తరువాత చెల్లించండి' (బై నౌ పే లేటర్) అనే తాత్కాలిక ఈఎమ్ఐ నిషేధాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. ఈవీ అందిస్తున్న అన్ని రకాల స్కూటర్లపై ఈఎమ్ఐ హాలిడే సౌకర్యం అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో జెనియా, 4యు, యువర్ అండ్ ది విండ్ మోడళ్లు ఉన్నాయి. ఈ స్కూటర్లన్నీ రూ.51,900 నుండి రూ.73,900 మధ్యలో ఉన్నాయి (ఎక్స్-షోరూమ్).
MOST READ:భీష్మ డైరెక్టర్‌కి రేంజ్ రోవర్ గిఫ్ట్ గా ఇచ్చిన హీరో నితిన్, ఎందుకో తెలుసా !

ఎలాంటి సిబిల్ స్కోర్ లేని కొనుగోలుదారులు కూడా జెస్ట్‌మనీ ద్వారా ఫైనాన్సింగ్ సొల్యూషన్స్‌కు అర్హులు కావచ్చని కంపెనీ ధృవీకరించింది. ఈ ఆర్థిక సేవలను ఎలాంటి భౌతిక పత్రాలు లేకుండా రిమోట్‌గా పొందవచ్చని తెలిపింది. అవాంతరం లేని కొనుగోలు అనుభవాన్ని అందించడం కోసం రుణాలను తక్షణమే ఆమోదించబడతాయని కంపెనీ పేర్కొంది.

భువనేశ్వర్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈవీ ఇండియా తూర్పు భారతదేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ. ప్రస్తుతం ఇది 63 డీలర్ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది మరియు ఈ సంవత్సరం చివరి నాటికి దేశంలోని 200 ఇతర ప్రాంతాలకు తమ ఉనికిని విస్తరించుకోవాలని కంపెనీ యోచిస్తోంది.
MOST READ:కియా సోనెట్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది

ఈ కొత్త భాగస్వామ్యంపై ఈవీ ఇండియా డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు హర్శ్వర్ధన్ దిద్వానీ మాట్లాడుతూ, "మా కస్టమర్లు ఇప్పుడు ఈవీ ఇండియాతో వివిధ రకాల ఈఎమ్ఐ ఆప్షన్లను పొందగలరు. ఈవీ ఇండియాలో, హై-ఎండ్ టెక్నాలజీ మరియు సుస్థిరతే మా ప్రధమ ప్రాధాన్యత" అని అన్నారు.

"జెస్ట్‌మనీతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా కోవిడ్-19 పరిస్థితుల్లో కాంటాక్ట్‌లెస్ డాక్యుమెంటేషన్‌ను అందిస్తున్నాము. జెస్ట్‌మనీతో అందుబాటులో ఉన్న సులభమైన ఈఎమ్ఐ ఆప్షన్ల ద్వారా ప్రతి ఒక్కరూ ఇప్పుడు మా ఎలక్ట్రిక్ స్కూటర్లను సొంతం చేసుకోవచ్చని" ఆయన చెప్పారు.
MOST READ:కొత్త 2020 మహీంద్రా థార్ ప్రారంభ ధరెంతో తెలుసా?

ఇదే విషయం గురించి జెస్ట్‌మనీ సిఇఓ మరియు సహ వ్యవస్థాపకుడు లిజ్జీ చాప్మన్ మాట్లాడుతూ, "మా ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం భారీ డిమాండ్ ఉంది. ఈవీతో భాగస్వామ్యం ద్వారా డిజిటల్ క్రెడిట్ సౌలభ్యం కాకుండా, పెద్ద సంఖ్యలో ప్రజలకు ఎలక్ట్రిక్ స్కూటర్లను చేరువ చేయటం సులువుగా మారతుందని ఆశిస్తున్నామని" అన్నారు.

ఈవీ ఇండియా ఫైనాన్స్ ఆప్షన్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
వినియోగదారులు గ్రీన్ మొబిలిటీకి మారడంపై ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. ఇదే సమయంలో, అనేక కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈవీ ఇండియా ప్రవేశపెట్టిన కొత్త ఫైనాన్స్ పథకంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లను సొంతం చేసుకోవడం మరింత సులభతరం కానుంది.
MOST READ:ఖరీదైన బైక్ చూసి నోరుతెరిచిన పోలీస్.. తర్వాత ఏం జరిగిందంటే ?