హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, వివరాలు

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, దేశీయ విపణిలో విక్రయిస్తున్న మాస్ట్రో స్కూటర్‌లో కంపెనీ ఓ సరికొత్త స్పెషల్ ఎడిషన్ వేరియంట్‌ను విడుదల చేసింది. "హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్" పేరుతో విడుదలైన ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ స్టాండర్డ్ వేరియంట్ కన్నా భిన్నంగా ఉంటుంది.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, వివరాలు

కొత్త హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్‌ స్కూటర్‌లో పారామెట్రిక్ ప్యాటర్న్స్, సుపీరియర్ మెటీరియల్ ఫినిష్, ప్రీమియం ‘స్టీల్త్' క్రెస్ట్ బ్యాడ్జింగ్, కార్బన్ ఫైబర్ టెక్చర్ స్ట్రైప్స్, వైట్ యాక్సెంట్స్ మరియు టోన్-ఆన్-టోన్ స్ట్రైప్స్, పదునైన యాక్సెంట్స్ ఉంటాయి. ఇవి స్కూటర్‌కు ప్రత్యేకమైన లుక్‌ని ఇస్తాయి. ఈ స్కూటర్ స్పెషల్ మ్యాట్ గ్రే పెయింట్ స్కీమ్‌లో లభిస్తుంది.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, వివరాలు

స్కూటర్‌లో బయట వైపు అమర్చిన ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సైడ్-స్టాండ్ అండ్ సర్వీస్ ఇండికేటర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో హీరో మోటోకార్ప్ యొక్క సిగ్నేచర్ ఐ3ఎస్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే సీట్ క్రింది భాగంలో యుఎస్‌బి పోర్ట్, ఇది ప్రయాణించేటప్పుడు రైడర్స్ తమ స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి సహకరిస్తుంది.

MOST READ:భారత్‌లో ఎంజి గ్లోస్టర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఈ స్కూటర్‌లో 124.6సీసీ బిఎస్6 కంప్లైంట్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ‘ఎక్స్‌సెన్స్ టెక్నాలజీ' ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 7000 ఆర్‌పిఎమ్ వద్ద 9 బిహెచ్‌పి పవర్‌ను మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 10.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, వివరాలు

మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో సింగిల్ డిస్క్ మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ సెటప్ ఉంటాయి. ఇందులో బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి.

భారత మార్కెట్లో హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్ ధర రూ.72,950 ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది. హీరో మోటోకార్ప్ ఈ ఏడాది ప్రారంభంలో మాస్ట్రో ఎడ్జ్ 125 బిఎస్6 మోడల్‌ను ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో విడుదల చేసింది.

MOST READ:కొత్త కారు కొంటే ఈ పండుగ సీజన్‌లోనే కొనాలి, ఎందుకో తెలుసా?

హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, వివరాలు

ఈ కొత్త స్కూటర్‌ను మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా, హీరో మోటోకార్ప్, సేల్స్ అండ్ ఆఫ్టర్‌సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ, "మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్‌తో మా పండుగ ప్రచారాన్ని ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము, ఇది ఈ విభాగంలో ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. మా స్కూటర్ బ్రాండ్ మాస్ట్రో ఎడ్జ్ కస్టమర్లతో బాగా ప్రాచుర్యం పొందింది మరియు ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌కు బ్రాండ్‌కు అదనపు ఆకర్షణను తెచ్చిపెడుతుంది. రాబోయే వారాల్లో మేము అనేక కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని" అన్నారు.

హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్ స్పెషల్ ఎడిషన్ విడుదల: ధర, వివరాలు

హీరో మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్ స్కూటర్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

స్టాండర్డ్ మాస్ట్రో ఎడ్జ్ 125 చాలా అధునాతనమైన స్కూటర్ మరియు ఇప్పటికే ఇది పెద్ద సంఖ్యలో అమ్ముడైంది. కొత్తగా వచ్చిన మాస్ట్రో ఎడ్జ్ 125 స్టీల్త్ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ఇప్పుడు మరింత ఆకర్షనీయంగా ఉంది. ఇది ఎక్కువ మంది యువ కొనుగోలుదారులను ఆకర్షించే అవకాశం ఉంది.

MOST READ:హాట్ కేకులా అమ్ముడవుతున్న విటారా బ్రెజ్జా; ఇందులో అంత స్పెషల్ ఏంటో?

Most Read Articles

English summary
Hero MotoCorp has launched the all-new Maestro Edge 125 Stealth scooter in India. The Hero Maestro Edge 125 Stealth will be available at Rs 72,950 ex-showroom (Delhi) and will be the latest addition to the company's premium scooter portfolio. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X