Just In
- 1 hr ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 2 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 4 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 4 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- Finance
నిర్మల సీతారామన్ బడ్జెట్ పైన స్టార్టప్స్ అంచనాలు
- News
ఏకగ్రీవాలపై వివరణ కోరాం, ఆటంకం కలిగిస్తే కోర్టుకే, మంత్రి వ్యాఖ్యలు బాధించాయి: నిమ్మగడ్డ రమేష్ కుమార్
- Sports
3 బంతుల్లో 15 పరుగులు.. ధోనీ తరహాలో చివరి బంతికి సిక్స్ బాదిన సోలంకి! సెమీస్‌కు బరోడా!
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హోండా మోటార్‌సైకిళ్లలో సరికొత్త స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్
జపనీస్ టూవీలర్ బ్రాండ్ హోండా మోటార్‌సైకిల్, భవిష్యత్తులో తమ కొత్త తరం వానాల్లో ఓ అధునాతన ఫీచర్‌ను జోడించబోతోంది. ద్విచక్ర వాహనం నడుపుతున్న ఆ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి, సంస్థ తమ వాహనాల్లో ఓ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్‌ను పొందుపరచబోతోంది.

రాబోయే స్కూటర్ మరియు బైక్ మోడళ్లలో ఓ మొబైల్ అప్లికేషన్ ఆధారిత కనెక్టివిటీ ఫీచర్‌ను పరిచయం చేసేందుకు హోండా సన్నాహాలు చేస్తోంది.హోండా ఈ కనెక్టివిటీ టెక్నాలజీకి 'రోడ్‌సింక్' అనే పేరును కూడా ఖరారు చేసింది.

హోండా రోడ్‌సింక్ ఇతర బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ల మాదిరిగానే, బ్లూటూత్ ఆప్షన్ ద్వారా బైక్‌ను డ్రైవర్ యొక్క మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేస్తుంది. రోడ్‌సింక్ సహాయంతో, మెసేజింగ్, నావిగేషన్, ఫోన్ కాల్స్ మరియు మ్యూజిక్ వంటి ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.

ఇందులో వాయిస్ సపోర్ట్ ఫీడ్‌బ్యాక్ కూడా ఉంటుంది. డ్రైవర్ తన వాయిస్‌తో కొన్ని రకాల కమాండ్స్ చేయటం ద్వారా ఈ టెక్నాలజీలోని వివిధ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. హోండా రోడ్‌సింక్ టెక్నాలజీని ముందుగా సిబిఆర్ 1000 ఆర్, హోండా ఫోర్జా మరియు 750 మరియు ఎక్స్-అడ్వెంచర్ మోడళ్లలో ప్రవేశపెట్టనున్నారు.

వచ్చే ఏడాది (2021)లో ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్లను భారతదేశంలో కూడా విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. భారత మార్కెట్లో హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ భవిష్యత్తులో విడుదల చేయబోయే మోడళ్లలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

హోండా ఇటీవలే అంతర్జాతీయ మార్కెట్లలో ఆవిష్కరించిన తమ మాక్సీ స్కూటర్ పిసిఎక్స్ 160ని కంపెనీ భారత్‌లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ స్కూటర్‌లో హోండా రోడ్‌సింక్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఆప్రిలియా విడుదల చేయనున్న ఎస్‌ఎక్స్ఆర్ 160కి పోటీగా హోండా తమ పిసిఎక్స్ 160 స్కూటర్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

హోండా పిసిఎక్స్ 160 విషయానికి వస్తే, ఈ స్కూటర్‌లో శక్తివంతమైన 156సిసి నాలుగు వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 16.31 బిహెచ్‌పి పవర్‌ను మరియు 15 న్యూటన్ మీటర్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టార్క్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు సింగిల్ ఛానల్ ఎబిఎస్ వంటి కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఈ హోండా స్కూటర్‌లో ఉన్నాయి. ఈ స్కూటర్‌లో మోటార్‌సైకిళ్ల మాదిరిగా డ్యూయెల్ రియర్ షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటుంది. ముందు భాగంలో డ్యూయల్ టెలిస్కోపిక్ ఫోర్కులు ఉంటాయి.

ఈ మాక్సి స్కూటర్ 14/13 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంటాయి. మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం దీని ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు కూడా అమర్చబడి ఉంటాయి. మునపటి వెర్షన్‌తో పోల్చుకుంటే ఈ కొత్త స్కూటర్ డిజైన్‌ను భారీగా అప్‌గ్రేడ్ చేశారు.

సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ ఇండికేటర్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ డిజైన్‌తో ఇప్పుడు ఈ స్కూటర్ మరింత షార్ప్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఇంకా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఇగ్నిషన్, మొబైల్ ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్ సి పోర్ట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

హోండా పిసిఎక్స్ బిగ్ స్కూటర్‌లో దాని పరిమాణానికి అనుగుణంగా 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 8 లీటర్లు. వచ్చే ఏడాది అంతర్జాతీ మార్కెట్లలో విడుదల కానుంది.