Just In
Don't Miss
- Finance
దారుణంగా పతనమైన బిట్కాయిన్, మార్చి నుండి ఇదే వరస్ట్
- Movies
HIT2 అప్డేట్.. ప్రాజెక్ట్ నుంచి విశ్వక్ సేన్ అవుట్!.. కొత్త హీరో ఎవరంటే?
- News
ఆ తపన ఉన్నా శరీరం సహకరించలేదు: చిన్నప్పుడు చీరాలలో: ఆ యుద్ధ విద్యలకు ప్రోత్సాహం: పవన్
- Sports
హైదరాబాద్లోనూ ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించండి.. బీసీసీఐకి కేటీఆర్ రిక్వెస్ట్!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 6వ తేదీ వరకు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కోవిడ్-19 టెస్ట్ కోసం తిరంగ ప్రాజెక్టును ప్రారంభించిన కేరళ గవర్నమెంట్
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా వైరస్ భారతదేశాన్ని కూడా ప్రభావితం చేసింది. కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

సాధారణంగా వ్యాధి సోకినా రోగులను పరీక్షించేటప్పుడు ఆరోగ్య కార్యకర్తలకు కూడా వ్యాధి సోకే అవకాశం ఉంది. ఆరోగ్య సంరక్షణ కార్మికులు పరిరక్షణను చూసుకోవలసిన అవసరం ప్రభుత్వాలకు ఎంతైనా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి తిరంగ కారును కేరళకు తీసుకువచ్చారు. ఈ తిరంగ కారు మాడిఫై చేయబడిన టయోటా ఇన్నోవా కారు.

రోగులను సురక్షితంగా పరీక్షించడానికి ఈ కారు ఉపయోగించబడుతుంది. కోవిడ్ -19 వైరస్ సోకిన రోగులను త్వరగా గుర్తించడానికి కేరళలోని పతనమిట్ట జిల్లాలో ఇది ప్రారంభించబడింది. ఈ టయోటా ఇన్నోవా కారులో 3 మంది ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్ -19 రోగులను తనిఖీ చేస్తుంటారు.
MOST READ : యమహా లాంచ్ చేయనున్న రెండు కొత్త బైక్స్ : FZ 25 & FZS 25

కరోనా రోగులను పరీక్షించడానికి అనుకూలంగా ఈ కారు తయారుచేయబడింది. టెస్ట్ కోసం బయట నిలబడిన వారు కారు లోపల ఆరోగ్య కార్యకర్తలను చూడలేరు. అదేవిధంగా ఆరోగ్య కార్యకర్తలు కూడా బయట ఉన్న వారిని చూసే అవకాశం ఉండదు. ఆరోగ్య కార్యకర్తలు పబ్లిక్ నోటీసు విధానం ద్వారా బయట ప్రజలతో మాట్లాడతారు.

ఈ టయోటా ఇన్నోవా కారులో ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ ఏర్పాటు చేయబడింది. అదనంగా థర్మల్ స్క్రీన్ సిస్టం, టు వే మైక్రోఫోన్ సిస్టం ఉంటుంది. ప్రజలతో కనెక్ట్ అవ్వడానికి ఆరోగ్య కార్యకర్తలు దీనిని ఉపయోగిస్తారు.
MOST READ: అప్డేట్ ఫీచర్స్ తో లాంచ్ కానున్న 2020 జీప్ కంపాస్ ఫేస్లిఫ్ట్

ఆరోగ్య కార్యకర్తలు కారు నుండి బయటికి రాకుండానే ఇవన్నీ నిర్వహిస్తారు. ఈ రకమైన వాహనాన్ని భారతదేశంలో ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఈ వాహనం ప్రస్తుతం పరీక్ష కోసం ఉపయోగించబడుతోంది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన కూడా ఉంది.
కోవిడ్ -19 వైరస్ యొక్క లక్షణాలు కనుగొనబడినప్పుడు లేదా పరీక్ష సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, అవి సేకరించబడతాయి. ఈ లక్షణాలతో ఉన్న వ్యక్తి 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని సలహా ఇస్తారు. పరీక్ష తర్వాత కోవిడ్ -19 వైరస్ సిండ్రోమ్ వివరాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పిహెచ్‌సి) పంపుతారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అటువంటి వ్యక్తులను ఎల్లప్పుడూ పరిశీలిస్తూ ఉంటారు.
MOST READ:త్వరలో లాంచ్ కానున్న కొత్త కవాసకి నింజా ZX-25R బైక్ [వీడియో]

మాడిఫై చేయబడిన టయోటా ఇన్నోవాను ఆర్‌ఎస్‌వి-1 అంటారు. ఆర్‌ఎస్‌వి-1 అనేది రాపిడ్ స్క్రీన్ వాహనం. ఆర్‌ఎస్‌వి -2 ను కూడా పరిశీలిస్తున్నారు. ఈ వాహనాలు అనుమానితుల నుండి నమూనాలను సేకరిస్తాయి.

ఆర్‌ఎస్‌వి-2 ప్రస్తుతం ఉత్పత్తిలో ఉంది. కేరళ ప్రభుత్వం ఈ చర్యకు విస్తృత ప్రశంసలు అందుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి కేరళ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు భారతదేశం అంతటా విస్తృతంగా ప్రశంసించబడ్డాయి.
MOST READ: విమానాల బుకింగ్స్ ఆపివేయాలని ఆదేశించిన డిజిసిఎ, ఎందుకో తెలుసా..?

ఇటీవల కాలంలో కరోనా రోగుల వల్ల చాలా మంది ఆరోగ్య కార్యకర్తలు మరియు డాక్టర్లు కూడా ఈ వైరస్ భారిన పడ్డారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై ఇలాంటి భారిన పడే అవకాశం ఉండదు.