వెనుక కూర్చుంటే కారే మసాజ్ చేస్తుంది..ఆరుగురు ప్రాణాలు కాపాడే సేఫ్టీ ఉంది..మార్చి 21న మ్యాజిక్ మొదలవుతుంది

భారతీయ రోడ్లపై జర్మన్ టెక్నాలజీతో, చెక్ రిపబ్లిక్ డిజైన్ తో సంచలనం సృష్టించిన స్కోడా కుషాక్ (Skoda Kushaq) ఇప్పుడు సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. 2021లో మొదటిసారిగా లాంచ్ అయిన ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ, ఐదేళ్ల తర్వాత భారీ మార్పులతో మన ముందుకు వస్తోంది. ఈ కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్ ధరలను మార్చి 21, 2026న అధికారికంగా వెల్లడించనున్నట్లు స్కోడా ఇండియా ధృవీకరించింది. జనవరిలో జరిగిన జపాన్ మొబిలిటీ షోలో దీని ప్రోటోటైప్‌ను ప్రదర్శించినప్పటి నుంచి వాహన ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కారు కోసం ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, కేవలం రూ.15,000 చెల్లించి ఈ సరికొత్త వాహనాన్ని రిజర్వ్ చేసుకోవచ్చు.

డిజైన్ విషయానికి వస్తే, కొత్త కుషాక్ ఫేస్‌లిఫ్ట్ తన పెద్దన్న అయిన స్కోడా కొడియాక్ (Kodiaq) నుంచి స్ఫూర్తి పొందింది. ముందు భాగంలో మరింత దూకుడుగా ఉండే గ్రిల్, దానిపై మెరిసే క్రోమ్ ఫినిషింగ్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ (LED DRLs) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వెనుక వైపు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ మరియు మధ్యలో ప్రకాశించే SKODA అక్షరాలు కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. మొత్తం ఐదు వేరియంట్లలో (Classic+, Signature, Sportline, Prestige, Monte Carlo) ఇది లభించనుంది. కొత్తగా ప్రవేశపెట్టిన షిమ్లా గ్రీన్, చెర్రీ రెడ్ రంగులు కారుకు ఒక కొత్త స్టైలిష్ అప్పియరెన్స్ ఇస్తున్నాయి.

Skoda Kushaq Facelift 2026 Price Reveal on March 21 with Segement First Features

సాంకేతికంగా ఈ కారులో ఒక విప్లవాత్మక మార్పు జరిగింది. అదే 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్. 1.0 లీటర్ టీఎస్ఐ (TSI) ఇంజిన్ లో పాత 6-స్పీడ్ గేర్‌బాక్స్ స్థానంలో ఈ సరికొత్త 8-స్పీడ్ గేర్‌బాక్స్‌ను స్కోడా పరిచయం చేసింది. ఇది ఈ సెగ్మెంట్లోనే మొదటిసారి. దీనివల్ల కారు నడుపుతున్నప్పుడు గేర్ మార్పులు చాలా స్మూత్ గా ఉండటమే కాకుండా, మైలేజీ కూడా మెరుగుపడే అవకాశం ఉంది. ఇక 1.5 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ లో 150 హెచ్‌పి పవర్ తో పాటు 7-స్పీడ్ డీసీటీ (DCT) గేర్‌బాక్స్ ఆప్షన్ యథావిధిగా కొనసాగుతోంది. 1.5 లీటర్ వేరియంట్లలో ఇప్పుడు నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్లను అందించడం వల్ల బ్రేకింగ్ సామర్థ్యం మరింత పెరిగింది.

ఇక ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. స్కోడా ఈసారి సౌకర్యానికి పెద్దపీట వేసింది. ముఖ్యంగా సెగ్మెంట్లోనే తొలిసారిగా వెనుక సీట్లలో మసాజ్ ఫీచర్ను అందించింది. లాంగ్ ట్రిప్స్ కి వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది. లోపల 10.1 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ కాక్‌పిట్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో స్కోడా ఎప్పుడూ నెంబర్ వన్. ఈ కారుకు ఇప్పటికే గ్లోబల్ ఎన్‌క్యాప్ (GNCAP) నుంచి 5-స్టార్ రేటింగ్ ఉంది. దానికి అదనంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో స్టాండర్డ్ గా లభిస్తున్నాయి.

మార్కెట్లో దీని ధర సుమారు రూ.11 లక్షల నుంచి రూ.19.5 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇది నేరుగా హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, త్వరలో రాబోయే టాటా సియెర్రా ఈవీ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది. బిల్డ్ క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, ఇప్పుడు ఈ అడ్వాన్సుడ్ ఫీచర్లతో స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్ తన పాత వైభవాన్ని మళ్ళీ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 17, 2026, 17:33 [IST]
English summary
Skoda kushaq facelift 2026 price reveal on march 21 with segement first features
Read more on: #skoda kushaq #facelift
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+