తక్కువ ధరలో పెద్ద కారు కావాలా? రూ.5.65 లక్షలకే 7 సీటర్.. తక్కువ ఖర్చుతో ఫుల్ ఫ్యామిలీ ట్రిప్స్
నిస్సాన్ (Nissan) కంపెనీ భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని మరోసారి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా విడుదల చేసిన 7-సీటర్ 'నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite)' తక్కువ ధరలో ఎక్కువ విలువ అందించే కారుగా నిలుస్తోంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాల కోసం సరసమైన ధరలో విశాలమైన SUV కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మారింది. ఈ కారు రూపకల్పనలోనే వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. లోపలి క్యాబిన్ విస్తారంగా ఉండటం వల్ల ప్రయాణికులు సౌకర్యంగా కూర్చొని ప్రయాణించవచ్చు. మూడు వరుసల సీటింగ్ ఏర్పాటుతో మొత్తం 7 మంది సులభంగా ప్రయాణించగలుగుతారు. లెదరెట్ క్విల్టెడ్ సీట్లు ఉండటం వల్ల ప్రయాణంలో మరింత కంఫర్ట్ ఫీలింగ్ కలుగుతుంది.
ధర విషయానికి వస్తే, ఈ కారు మార్కెట్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. కేవలం రూ.5.65 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ప్రారంభమయ్యే ఈ మోడల్, టాప్ వేరియంట్ వరకు రూ. 8.49 లక్షల వరకూ లభిస్తుంది. మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులు తమ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవచ్చు. ఫీచర్ల పరంగా కూడా ఈ కారు వినియోగదారులను నిరాశపరచదు.

డిజైన్ పరంగా గ్రావైట్ ముందుభాగంలో సిగ్నేచర్ LED హెడ్‌ల్యాంప్‌లు, వాటితో కలిసిన ఇంటిగ్రేటెడ్ DRLలు కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. ఆల్-రౌండ్ LED లైటింగ్ సెటప్, క్రిస్టల్ ఎడ్జ్ LED టెయిల్ ల్యాంప్‌లు, LED ఫాగ్ ల్యాంప్‌లు ఇవన్నీ కలిపి ఈ SUVకి మరింత మోడర్న్ టచ్‌ను అందిస్తున్నాయి. పియానో బ్లాక్ ఫినిష్‌తో ఉన్న ప్రత్యేక గ్రిల్, పై భాగంలో స్టైలిష్ రూఫ్ రైల్స్ కారును రోడ్డుపై ప్రత్యేకంగా నిలబెడతాయి.
బయట డిజైన్ చూస్తే ఇది తక్కువ ధరలో వచ్చినా, లుక్ మాత్రం హై-ఎండ్ SUVలా ఫీలింగ్ ఇస్తుంది. ప్రాక్టికాలిటీ విషయంలో కూడా ఈ కారు వినియోగదారులను ఆకట్టుకుంటుంది. సాధారణంగా 7-సీటర్ కార్లలో బూట్ స్పేస్ పరిమితంగా ఉంటుంది. కానీ ఈ మోడల్‌లో మూడవ వరుస సీట్లను మడిచేస్తే బూట్ స్పేస్‌ను 625 లీటర్ల వరకు పెంచుకోవచ్చు. అంటే ఫ్యామిలీ ట్రిప్స్‌కు వెళ్లేటప్పుడు పెద్ద మొత్తంలో లగేజీ తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఇంజన్, పనితీరు విషయానికి వస్తే, ఈ కారు 1.0-లీటర్ 3-సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 72PS పవర్, 96Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగరంలో స్మూత్ డ్రైవింగ్‌కు, సాధారణ ప్రయాణాలకు ఇది సరిపడే పనితీరును అందిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ EZ-షిఫ్ట్ (AMT) కూడా లభిస్తుంది, దీంతో డ్రైవర్ తనకు నచ్చిన విధంగా ఎంపిక చేసుకోవచ్చు.
మైలేజీ విషయంలో కూడా ఈ కారు నిరాశపరచదు. కంపెనీ ప్రకారం, మాన్యువల్ వేరియంట్ లీటర్‌కు సుమారు 19.3 కి.మీ వరకు, ఆటోమేటిక్ (AMT) వేరియంట్ లీటర్‌కు సుమారు 19.6 కి.మీ వరకు మైలేజీ ఇస్తుంది. అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నిస్సాన్ గ్రావైట్‌కు డీలర్ స్థాయిలో CNG ఆప్షన్ కూడా అందుబాటులో ఉండటం.

గ్రావైట్‌లో ఫీచర్లు బాగానే ఉన్నాయి. ఫ్లోటింగ్ 8-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, వాక్ అవే లాక్, అప్రోచ్ అన్‌లాక్, ఆటో LED హెడ్‌ల్యాంప్స్, భద్రత పరంగా అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. ESC, TCS, ABS with EBD, హిల్ స్టార్ట్ అసిస్ట్, బ్రేక్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








