రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్.. మార్కెట్లోకి కొత్త బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ బైకును పూర్తిగా మార్చేస్తోంది. కొత్త తరం రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ బైకును మెటియోర్ పేరుతో ఒక కొత్త మోడల్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రాయల్ ఎన్పీల్డ్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే సరికొత్త మెటియోర్ బైకును ఇండియన్ రోడ్ల మీద పరీక్షిస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్.. మార్కెట్లోకి కొత్త బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ జనరేషన్ థండర్‌బర్డ్ బైకును మోడ్యూలర్ జె-ఫ్లాట్‌ఫామ్ మీద నిర్మిస్తోంది. J1C0 కోడ్ పేరుతో దీనిని అభివృద్ది చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవల మార్కెట్ నుండి తొలగించిన 500సీసీ బుల్లెట్, క్లాసిక్ మోటార్ సైకిళ్లను కూడా ఇదే ఫ్లాట్‌ఫామ్ మీద కొత్తగా రీడిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్.. మార్కెట్లోకి కొత్త బైక్

ఇంజన్‌ను కూడా కంప్లీట్‌గా మార్చేస్తున్నట్లు తెలిసింది. మునుపటి 500సీసీ ఇంజన్‌కు బదులుగా రాయల్ ఎన్ఫీల్డ్ 650సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ తరహాలో 650 కంటే తక్కువ కెపాసిటీ గల ఇంజన్‌ను ప్రత్యేకంగా అభివృద్ది చేస్తోంది. 350సీసీ నుండి 500సీసీ మధ్యనున్న దూరాన్ని తగ్గించబోయే ఈ ఇంజన్ సింగల్ సిలిండర్‌తోనే రానుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్.. మార్కెట్లోకి కొత్త బైక్

బీఎస్6 ప్రమాణాలను పాటించేందుకు ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ మరియు ఇతర సాంకేతిక అప్‌డేట్స్‌తో పాటు బీఎస్6 మోడళ్లలో ఉండాల్సిన అన్ని తప్పనిసరి ఫీచర్లు మరియు టెక్నాలజీని అందిస్తున్నారు.

రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్.. మార్కెట్లోకి కొత్త బైక్

1950ల కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తి చేసిన మెటియోర్ మినోర్ 500సీసీ మోటార్ సైకిల్ ఆధారంగా గత ఏడాది జూలైలో యూరప్‌లో ఈ కొత్త మోడల్‌కు మెటియోర్ అనే పేరు మీద ట్రేడ్‌మార్క్ కూడా సంపాదించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్.. మార్కెట్లోకి కొత్త బైక్

సుమారుగా 70 ఏళ్ల క్రితం మార్కెట్లో ఉన్న మెటియోర్ మోడల్‌ పేరునే వాడకుంటున్నారు. కానీ థండర్‌బర్డ్ స్థానంలోనే దీనిని తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ దృష్ట్యా మెటియోర్ పేరును ఖరారు చేయడంతో రాయల్ ఎన్ఫీల్డ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని అంతర్జాతీయ మార్కెట్లలో దీనిని విడుదల చేసే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్.. మార్కెట్లోకి కొత్త బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ బైక్ విషయానికొస్తే, ఇందులో పూర్తి స్థాయిలో కొత్త తరం డిజైన్ లక్షణాలు, V-ఆకారంలో ఉన్న అల్లాయ్ వీల్స్, వెనుక వైపున రెండు షాక్ అబ్జార్వర్లు మరియు కంప్లీట్ బ్లాక్‌ఔట్ ఇంజన్ వచ్చింది.

రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్.. మార్కెట్లోకి కొత్త బైక్

మునుపటి అనలాగ్ స్పీడో మీటర్ స్థానంలో బైక్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్నిచ్చేలా అత్యాధునిక డిజిటల్ డిస్ల్పే అందించారు. విశాలమైన సీటు, పగటిపూట వెలిగే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ మరియు ఇండికేటర్లతో పాటు వైబ్రేషన్స్ తగ్గించేందుకు డిజైన్ మరియు సాంకేతికంగా ఎన్నో మార్పులు చేశారు.

రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్.. మార్కెట్లోకి కొత్త బైక్

రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త తరం థండర్‌బర్డ్ బైక్ మెటియోర్‌ను ఖచ్చితంగా ఎప్పుడు విడుదల చేస్తారనే స్పష్టమైన సమాచారం లేదు. బహుశా ఇది2021 ప్రారంభానికల్లా ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Source: Gaadiwaadi

Most Read Articles

English summary
New Generation Royal Enfield Thunderbird Could Be Called Meteor; Spied Testing
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X