న్యూ హోండా షైన్ విడుదల: మైలేజ్ పెరిగింది గురూ..!

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా విపణిలోకి సరికొత్త హోండా సీబీ షైన్ బైకును విడుదల చేసింది. ఇండియాలో అత్యధిక అమ్ముడవుతున్న 125సీసీ మోటార్ సైకిల్ హోండా సీబీ షైన్ ఇప్పుడు బీఎస్6 వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది.

బీఎస్6 వెర్షన్ హోండా సీబీ షైన్ ధర, వేరియంట్లు, ఫీచర్లు మరియు మైలేజ్‌తో పాటు పూర్తి వివరాల తెలుసుకుందాం రండి..

న్యూ హోండా షైన్ విడుదల: మైలేజ్ పెరిగింది గురూ..!

సరికొత్త 2020 హోండా సీబీ షైన్ బీఎస్6 మోడల్ ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అనే రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 67,857 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

న్యూ హోండా షైన్ విడుదల: మైలేజ్ పెరిగింది గురూ..!

సాంకేతికంగా ఇందులో మునుపటి బీఎస్4 ఇంజన్ స్థానంలో బీఎస్6 ప్రమాణాలను పాటించే 125సీసీ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది పాత ఇంజన్ కంటే కాస్త ఎక్కువ పవర్ ఇస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 10.72బిహెచ్‌పి పవర్ మరియు 10.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

న్యూ హోండా షైన్ విడుదల: మైలేజ్ పెరిగింది గురూ..!

బీఎఎస్6 వెర్షన్ ఇంజన్‌లో హోండా భారీ మార్పులే చేసింది. సరికొత్త eSP టెక్నాలజీ జోడింపు మరియు కార్బోరేటర్ స్థానంలో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అందివ్వడంతో మైలేజ్ 14శాతం పెరిగింది.

న్యూ హోండా షైన్ విడుదల: మైలేజ్ పెరిగింది గురూ..!

2020 హోండా సీబీ షైన్ నాలుగు విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి, బ్లాక్, జెనీ గ్రే మెటాలిక్, రెబల్ రెడ్ మెటాలిక్ మరియు అథ్లెటిక్ బ్లూ మెటాలిక్. అదనపు ఫీచర్లు మరియు ప్రీమియం లుక్‍లో ఉన్న ఉన్న హోండా ఎస్‌పీ షైన్ 125 మోడల్ సీబీ షైన్ కంటే పైస్థానంలో ఉంది. హోండా ఎస్‌పీ షైన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 72,900.

న్యూ హోండా షైన్ విడుదల: మైలేజ్ పెరిగింది గురూ..!

అత్యుత్తమ గ్రిప్ మరియు హ్యాండ్లింగ్ కోసం లో రెసిస్టెన్స్ గల ట్యూబ్ లెస్ టైర్లు వచ్చాయి. ఇంజన్ స్టార్ట్/స్టాప్ స్విచ్, ఇంటిగ్రేటెడ్ హెడ్‌ల్యాంప్ బీమ్, పాసింగ్ స్విచ్, అధునాతన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ డిజైన్ మరియు లేటెస్ట్ బాడీ గ్రాఫిక్స్ వచ్చాయి

న్యూ హోండా షైన్ విడుదల: మైలేజ్ పెరిగింది గురూ..!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా సీబీ షైన్ 125 మోటార్ సైకిల్ భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ 125 బైక్. అత్యుత్తమ మైలేజ్, స్టన్నింగ్ లుక్ మరియు స్మూత్ ఇంజన్ దీని ప్రత్యేకత. సరసమైన ధరలో దేశవ్యాప్తంగా విసృతమైన డీలర్ నెట్‌వర్క్ కూడా దీని సక్సెస్‌కు కారణమని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బీఎస్6 వెర్షన్ విడుదల కావడంతో సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
New Honda Shine launched in india, price details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X