పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ ధరలు; ఎంతో తెలుసా?

ప్రముఖ దేశీయ ప్రీమియం మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ మోడల్ బుల్లెట్ 350 బిఎస్6 ధరలను మరోసారి పెంచింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదలైన బిఎస్6 వెర్షన్ బుల్లెట్ ధరలను కంపెనీ ఇదివరకే ఓసారి పెంచింది.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ ధరలు; ఎంతో తెలుసా?

తాజాగా, ఇప్పుడు అన్ని బుల్లెట్ 350 వేరియంట్లపై సుమారు రూ.2,756 మేర ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి: ఎంట్రీ లెవల్ ఎక్స్ వేరియంట్, స్టాండర్డ్ బ్లాక్ వేరియంట్ మరియు టాప్-ఎండ్ ఈఎస్ (ఎలక్ట్రిక్ స్టార్ట్) వేరియంట్.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ ధరలు; ఎంతో తెలుసా?

ధరల పెంపుకు ముందు బుల్లెట్ 350 ప్రారంభ ధర రూ.1.21 లక్షలుగా ఉండేది. కాగా, రెండవసారి ఈ మోడల్‌పై ధరను పెంచడంతో దీని ప్రారంభ ధర రూ.1.27 లక్షలకు చేరుకుంది.

వేరియంట్ల వారిగా పెరిగిన ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి:

బుల్లెట్ ఎక్స్350 - రూ.1,27,093

బుల్లెట్ 350 (బ్లాక్) - రూ.1,33,260

బుల్లెట్ ఎక్స్350 ఈఎస్ (ఎలక్ట్రిక్ స్టార్ట్)- రూ.1,42,705

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

MOST READ:సాధారణ ఇన్నోవా డ్రైవర్‌ని సన్మానించిన టయోటా డీలర్.. ఎందుకో తెలుసా ?

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ ధరలు; ఎంతో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో చాలా కాలం నుంచి అందుబాటులో ఉన్న మోడళ్లలో బుల్లెట్ కూడా ఒకటి. అయితే, కాలానుగుణంగా, కంపెనీ ఇందులో అనేక మార్పులు చేర్పులు చేస్తూ, మారుతు ట్రెండ్, టెక్నాలజీకి అనుగుణంగా దీనిని అప్‌గ్రేడ్ చేస్తూ వచ్చింది.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ ధరలు; ఎంతో తెలుసా?

ఇంజన్ పరంగా ఈ మోడల్‌లో అదే పాత 346సిసి, సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్-ఇంజెక్ట్ ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 19.1 పిఎస్ పవర్‌ను మరియు 28 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. మార్కెట్లో బుల్లెట్ 350కి గట్టి పోటీనిచ్చే మోడల్ ఏదీ లేదు, ఎందుకంటే ఈ విభాగంలో చాలావరకు సబ్ 400 సిసి బైక్‌లు కాస్తంత అధిక ధరను కలిగి ఉంటాయి.

MOST READ:బిఎండబ్ల్యు సూపర్ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా.. ఈ బైక్ ఎలా ఉందో మీరే చూడండి

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ ధరలు; ఎంతో తెలుసా?

ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు సంబంధించిన ఇతర వార్తలను గమనిస్తే, కంపెనీ భారత మార్కెట్‌కు మరో సరికొత్త క్రూయిజర్ స్టైల్ మోటార్‌సైకిల్‌ను పరిచం చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 పేరుతో కంపెనీ ఓ కొత్త మోటార్‌సైకిల్‌ను మరికొద్ది రోజుల్లోనే మార్కెట్లో విడుదల చేయనుంది. ఇది ప్రస్తుత థండర్‌బర్డ్ సిరీస్ మోడళ్ల స్థానాన్ని భర్తీ చేయనుంది.

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ ధరలు; ఎంతో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్‌లో కొత్త 346 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,100 ఆర్‌పిఎమ్ వద్ద 20.2 బిహెచ్‌పి పవర్‌ని మరియు 4,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:ఇప్పుడే చూడండి.. రూ. 10 లక్షల లోపు ఉన్న టాప్ 5 కొత్త కార్లు

పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్‌సైకిల్ ధరలు; ఎంతో తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధరల పెంపుపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ఏడాది వరుసగా రెండోసారి బుల్లెట్ ధరలను పెంచడానికి గల కారణాలను కంపెనీ వివరించలేదు. అయితే, ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి కారణంగా అనేక ఆటోమొబైల్ కంపెనీలు మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాయి. ఇదే కోవలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా తమ బుల్లెట్ 350 ధరలను పెంచినట్లుగా తెలుస్తోంది.

Most Read Articles

English summary
Indian premium motorcycle brand Royal Enfield has increased the prices of the Bullet 350 BS6 motorcycle for the second time in India after launching the updated version earlier this year. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X