ఫిబ్రవరి 10వ విడుదలవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ ఎడిషన్

రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల చేసేందుకు సిర్వం సిద్దం చేసుకుంది. అయితే, మిగతా మోడళ్ల తరహాలో ఇది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూముల్లో లభించదు కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్‌సైట్లోనే దీనిని బుక్ చేసుకోవాలి. అందరికీ కాకుండా కేవలం పరిమిత సంఖ్యలోనే దీనిని విక్రయిస్తున్నట్లు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది.

ఫిబ్రవరి 10వ విడుదలవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ ఎడిషన్

రాయల్ ఎన్ఫీల్డ్ మార్చి 31, 2020 నుండి క్లాసిక్ 500 మరియు థండర్‍‌బర్డ్ 500 మోటార్ సైకిళ్ల విక్రయాలను పూర్తి స్థాయిలో నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. 500-సిరీస్ బైకులు ప్రొడక్షన్ శాస్వతంగా ఆపేస్తున్న నేపథ్యంలో చివరి ఎడిషన్‌గా క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను పరిమిత సంఖ్యలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

ఫిబ్రవరి 10వ విడుదలవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ ఎడిషన్

క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ ఎడిషన్ మోటార్ సైకిల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా లైనప్‌లో చివరి 500 బైకు ఇదే. అతి తక్కువ సంఖ్యలో ఈ మోడల్ ఉత్పత్తి జరుగుతుంది. "ఎండ్ ఆఫ్ బిల్డ్" పేరుతో సీరియల్ నెంబర్ వచ్చేలా అత్యంత అరుదైన మోడల్‌గా దీనిని తీర్చిద్దారు.

ఫిబ్రవరి 10వ విడుదలవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ ఎడిషన్

రాయల్ ఎన్ఫీల్డ్ కథనం మేరకు, ప్రతి క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిల్‌ను తమిళనాడులోని తిరువొత్తియూర్ ప్రొడక్షన్ ప్లాంటులో ప్రత్యేక శ్రద్దతో చేతితో తయారు చేస్తున్నారు. ఫ్యూయల్ ట్యాంక్ మీద డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ ప్రధాన హైలట్.

ఫిబ్రవరి 10వ విడుదలవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ ఎడిషన్

ఫిబ్రవరి 10, 2020న మధ్యాహ్న 2 నుండి 5 గంటల మధ్య నిర్వహించే ఫ్లాష్ సేల్ ద్వారా ఔత్సాహిక కస్టమర్లు క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ బైకును కొనుగోలు చేయచ్చు. అయితే, దీనిని ఎంచుకోవాలనుకునే కస్టమర్లు ఈ ఫ్లాష్ సేల్‌లో పాల్గొనేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్‌సైట్‌లో ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఫిబ్రవరి 10వ విడుదలవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ ఎడిషన్

బుల్లెట్ 500, క్లాసిక్ 500 మరియు థండర్‌బర్డ్ 500 బైకుల తరహాలోనే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ లిమిటెడ్ ఎడిషన్ బైకులో కూడా బీఎస్-4 ప్రమాణాలను పాటించే 499సీసీ కెపాసిటీ గల 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో లభించే ఇంజన్ 27.2బిహెచ్‌పి పవర్ మరియు 41.3ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఫిబ్రవరి 10వ విడుదలవుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ ఎడిషన్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ట్రిబ్యూట్ బ్లాక్ ఎడిషన్ ఆన్-రోడ్(ఢిల్లీ) ధర రూ. 2.49 లక్షలు. ఇండియన్ మార్కెట్లో బుల్లెట్ 500, క్లాసిక్ 500 మరియు థండర్‌బర్డ్ 500 మోటార్ సైకిళ్ల సేల్స్ నిలిపేసినప్పటికీ, ఈ మూడు మోడళ్లు అంతర్జాతీయ విపణిలో యధావిధిగా అందుబాటులో ఉంటాయి.

Most Read Articles

English summary
Royal Enfield Classic 500 Tribute Black Limited Edition launched. Read in Telugu.
Story first published: Sunday, February 9, 2020, 8:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X