Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇకపై మీ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ని మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు, ఎలాగంటే..?
భారతదేశంలో అత్యధికంగా కస్టమైజ్ చేయబడే మోటార్‌సైకిళ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమర్లు తరచూ తమ మోటార్‌సైకిళ్లను వారి వ్యక్తిత్వానికి అనుగుణంగా కొన్ని కాస్మెటిక్ మార్పులతో మోడిఫై (కస్టమైజ్) చేయించుకుంటడాన్ని మనం గమనిస్తూనే ఉంటాం.

బైక్ మోడిఫికేషన్ కోసం కస్టమర్లు థర్డ్ పార్టీ కంపెనీలను ఆశ్రయిస్తుంటారు. ఈ మార్కెట్ ధోరణిని గమనించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఇకపై తమ మోటార్‌సైకిళ్లకు తామే స్వయంగా కస్టమైజేషన్ ఆప్షన్లను అందించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే, 'మేక్-ఇట్-యువర్స్' (ఎమ్ఐవై) పేరిట ఓ పర్సనలైజ్డ్ కస్టమైజేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.

కంపెనీ పేర్కన్న సమాచారం ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్ళు వాటి ఓల్డ్-స్కూల్ డిజైన్‌తో సరళమైన రూపకల్పనకు ప్రసిద్ది చెందినవి, ఫలితంగా ఇది వాటిని కస్టమైజ్ చేయటానికి చాలా సులువుగా మారుస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రారంభించిన ఈ కొత్త ప్రణాళికతో కస్టమర్లు ఇప్పుడు తమ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసే సమయంలోనే కస్టమైజ్ చేసుకోవటానికి వివిధ రకాల ఆప్షన్లను అందుబాటులో ఉంటాయి.
MOST READ:కొత్త కలర్స్‌లో లాంచ్ అయిన బజాజ్ పల్సర్ NS & RS బైక్స్ ; ఇప్పుడు వీటి రేటెంతో తెలుసా ?

రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ కస్టమైజేషన్ లేదా పర్సనలైజేషన్‌కు సంబంధించి కంపెనీ ఓ కొత్త యాప్‌ను కూడా డెవలప్ చేసింది. ఇది 3డి కాన్ఫిగరేటర్ ద్వారా పనిచేస్తుంది. దీని సాయంతో కస్టమర్లు అందుబాటులో ఉన్న వేలాది కాంబినేషన్ల ద్వారా తమ అభిమాన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడల్‌ను తమకు నచ్చిన ఉపకరణాలతో వర్చ్యువల్‌గా కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

కస్టమర్లు మోటార్‌సైకిల్‌ను బుకింగ్ చేసుకునే సమయంలోనే కలర్ ఆప్షన్లు, వేరియంట్లు, బాడీ గ్రాఫిక్స్ మరియు జెన్యూన్ మోటార్‌సైకిల్ యాక్ససరీస్‌ను ఎంచుకోవచ్చు. కస్టమర్‌లు యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న తర్వాత, వారు తమ మోటార్‌సైకిల్ యొక్క డెలివరీ టైమ్‌లైన్‌కు సంబంధించిన వివరాలను కూడా సదరు యాప్‌లోనే తెలుసుకోవచ్చు.
MOST READ:మీకు తెలుసా.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఎస్యూవీ యాక్సెసరీ ప్యాకేజస్ ఇవే

రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం ఈ కొత్త ఎమ్ఐవై పర్సనలైజేషన్ ఫీచర్‌ను దాని ఫ్లాగ్‌షిప్ మోడళ్లైన ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 మోడళ్లకు మాత్రమే అందిస్తోంది. ఈ యాప్ సాయంతో వినియోగదారులు ఫ్యాక్టరీలో పరీక్షించిన, నమ్మదగిన మరియు జెన్యూన్ మోటార్‌సైకిల్ యాక్ససరీలను పొందవచ్చు. ఇవి రెండు సంవత్సరాల వారంటీతో లభిస్తాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ మోటార్‌సైకిళ్ల కస్టమైజేషన్ లేదా పర్సనలైజేషన్ ప్రక్రియను దశలవారీగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ 3డి కాన్ఫిగరేటర్‌తో కూడిన ఎమ్ఐవై ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.
MOST READ:బజాజ్ పల్సర్ 125 స్ప్లిట్ సీట్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ విడుదల; ధర, ఫీచర్లు

యాప్‌కు ప్రత్యామ్నాయంగా, సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌లోను మరియు దేశవ్యాప్తంగా ఉన్న 320కి పైగా రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్ కేంద్రాలలోనూ ఈ కొత్త కస్టమైజేషన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. పైన పేర్కొన్న రెండు మోడళ్లు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లను ఈ జాబితాలో చేర్చాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

కంపెనీ 3డి కాన్ఫిగరేటర్‌తో కూడిన ఎమ్ఐవై యాప్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించాలని రాయల్ ఎన్‌ఫీల్డ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మొబైల్ అప్లికేషన్ సాయంతో కస్టమర్లు కేవలం కస్టమైజేషన్ ఆప్షన్లను పొందడం మాత్రమే కాకుండా, పొడిగించిన (ఎక్స్టెండెడ్) వారంటీ మరియు వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్ (యాన్యువల్ మెయింటినెన్స్) ప్యాకేజీలను ఎంచుకోవడం కూడా చేయవచ్చు.
MOST READ:భారత మార్కెట్లో మారుతి సుజుకి సెలెరియో లాంచ్ డీటైల్స్

ఈ కొత్త ప్రణాళిక గురించి రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ వినోద్ కె. దాసరి మాట్లాడుతూ, "మోటార్‌సైకిళ్లు కస్టమర్ల వ్యక్తిత్వానికి ప్రతీకగా ఉంటాయి, ఆసక్తిగల మోటార్‌సైకిలిస్టులు వారి యంత్రాలను వారి వ్యక్తిత్వానికి అనుగుణంగా కస్టమైజ్ చేసుకోవాలని భావిస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని, ఇబ్బందులు లేని డిజిటల్ పరిష్కారాన్ని అందించడం కోసమే ఈ ఎమ్ఐవై యాప్‌ను అభివృద్ధి చేశామని" తెలిపారు.

"ఎమ్ఐవై సాయంతో కస్టమర్లు తమ అభిమాన మోటార్‌సైకిల్‌ను తమకు నచ్చినట్లుగా వారి చేతుల్తోనే స్వయంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఇలా మోడిఫై చేసి ఆర్డర్ చేయబడిన మోటార్‌సైకిళ్లను చెన్నైలోని మా ప్లాంట్‌లో కేవలం 24 నుండి 48 గంటలలోపే వాటిని తయారు చేయటం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ దుకాణాలన్నింటికీ దశలవారీగా మా అన్ని మోటార్‌సైకిళ్ల కోసం మేము ఎమ్ఐవైని విడుదల చేస్తాము. ఇకపై రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి అన్ని కొత్త మోటార్‌సైకిల్ మోడళ్లు ఎమ్ఐవై ఫీచర్‌తో వస్తాయని" చెప్పారు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ అధికారిక కస్టమైజేషన్ ప్లాన్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఇకపై రాయల్ ఎన్‌ఫీల్డ్ యజమానులు తమ మోటార్‌సైకిళ్లను కస్టమైజ్ చేసుకోవటానికి థర్డ్ పార్టీ కంపెనీలను, ఆఫ్టర్ మార్కెట్ యాక్ససరీలను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశపెట్టిన మేక్-ఇట్-యువర్స్ ప్రోగ్రామ్ సాయంతో, ఇకపై కస్టమర్లు తమ మోటార్‌సైకిళ్లను తమకు నచ్చినట్లుగా ఫ్యాక్టరీ నుండి లభించే జెన్యూన్ యాక్ససరీలతో కస్టమైజే చేసుకోవచ్చు.