250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

క్లాసిక్-రెట్రో స్టైల్ మోటార్‌సైకిళ్లను తయారు చేసే దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రస్తుతం మార్కెట్లో గట్టి పోటీని ఎదుర్కొంటోంది. హోండా, మహీంద్రా, టీవీఎస్, యమహా, బజాజ్, కెటిఎమ్, జావా, కవాసాకి వంటి అనేక దేశీయ మరియు విదేశీయ బ్రాండ్‌లు 251 సిసి నుండి 500 సిసి విభాగంలో పలు మోడళ్లను విక్రయిస్తున్నాయి.

250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

ఈ నేపథ్యంలో, మిడిల్-వెయిట్ ప్రీమియం మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అయినప్పటికీ, ఈ విభాగంలో చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ ఇప్పటికీ నెంబర్ వన్‌గానే ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 251 సిసి నుంచి 500 సిసి విభాగంలో తన ఆధిపత్యాన్ని అలానే కొనసాగిస్తోంది.

250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

ప్రత్యేకించి ఈ ఏడాది ఏప్రిల్ మరియు నవంబర్ మధ్య అమ్మకాలలో ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. గడచిన ఎనిమిది నెలల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ 251 సిసి నుండి 500 సిసి విభాగంలో మొత్తం 3,11,388 యూనిట్ల బైక్‌లను విక్రయించింది.

MOST READ:ఈ-రిక్షాలు ఇవ్వ‌నున్న‌ సోనూసూద్.. కానీ ఇవి వారికి మాత్రమే

250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

ఈ మొత్తం అమ్మకాల్లో 70 శాతం అమ్మకాలు ఒకే మోటార్‌సైకిల్ బ్రాండ్ నుండి రావటం విశేషం. అదే రాయల్ ఎన్‍‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్. ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ కాంపిటీటర్ల అమ్మకాలు చాలా స్వల్పంగా ఉన్నాయి.

250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

ప్రస్తుతం రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు 251 సిసి నుండి 500 సిసి విభాగంలో ప్రధాన పోటీదారుగా బజాజ్ ఆటో మరియు కెటిఎమ్ కంపెనీలు ఉన్నాయి. గడచిన ఏప్రిల్ - నవంబర్ 2020 మధ్య కాలంలో ఈ రెండు బ్రాండ్‌లు కలిసి కేవలం 9,870 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగాయి.

MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?

250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

ఈ విభాగంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలతో పోలిస్తే, బజాజ్ మరియు కెటిఎమ్ బ్రాండ్ల అమ్మకాలు 3 శాతం మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ టీజ్ చేసేలా బజాజ్ ఆటో "హతి మత్ పాలో" (ఏనుగులను పోషించకండి) అనే ప్రకటనల సిరీస్‌ను కూడా ప్రారంభించింది.

250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

అయినప్పటికీ, ఈ ప్రకటనలు బజాజ్ ఆటో కోసం పని చేయలేదు. అదే సమయంలో, హోండా మోటార్‌సైకిల్ ఏప్రిల్-నవంబర్ 2020 మధ్య కాలంలో 5,357 యూనిట్లను మాత్రమే విక్రయించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలతో పోలిస్తే హోండా అమ్మకాలు 1.72 శాతం మాత్రమే ఉన్నాయి.

MOST READ:ఎక్స్‌యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ, ఎలాగో చూసారా ?

250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

ఇక ఇదే సెగ్మెంట్లో టీవీఎస్, బిఎమ్‌డబ్ల్యూ వంటి బ్రాండ్ల అమ్మకాలు అత్యల్పంగా ఉన్నాయి. ఏప్రిల్-నవంబర్ 2020లో ఈ రెండు బ్రాండ్లు కలిపి 2,189 యూనిట్లను మాత్రేమ విక్రయించాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలతో పోలిస్తే ఇది 1 శాతం కన్నా తక్కువే. ఇదే సమయంలో, మహీంద్రా ద్విచక్ర వాహనం విభాగం మహీంద్రా టూవీలర్స్ కేవలం 179 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

ఏప్రిల్ మరియు నవంబర్ 2020 మధ్య కాలంలో 251 సిసి నుండి 500 సిసి విభాగంలో 2020 మొత్తం 3,28,983 యూనిట్ల మోటార్‌సైకిళ్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ అత్యధికంగా 3,11,388 యూనిట్లను విక్రయించి, ఈ విభాగంలో 95 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.

MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ భారత మార్కెట్ కోసం ఓ సరికొత్త 650 సిసి మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌ను మొదటిసారిగా టెస్టింగ్ సమయంలో గుర్తించడం జరిగింది. ఈ టెస్టింగ్ మోడల్‌కు ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఇంటర్‌సెప్టర్ 650 మోడల్‌కు అనేక పోలికలు ఉన్నాయి.

250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

ఇందులో ప్రధానంగా టెయిల్ ల్యాంప్ విభాగం మరియు స్క్వేర్ టర్న్ సిగ్నల్ ఉన్నాయి. దీనితో పాటు, ఇ 650 సిసి మోడల్‌లో ఫుట్‌పెగ్, రియర్ ఫెండర్ మరియు రియర్ సస్పెన్షన్ వంటి అంశాలు కూడా లీక్ అయ్యాయి. ఈ టెస్ట్ వాహనంలో బ్లాక్ ఫినిషింగ్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇదే మోడల్ 349 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో కూడా లభించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

250-500సిసి విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండే రాజా

ఇకపోతే, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ 650 సిసి ట్విన్ మోటార్‌సైకిళ్లకు ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వడానికి కంపెనీ ఇందులో అల్లాయ్ వీల్స్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో వీటి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Royal Enfield Market Share In 251-500cc Bike Segment Upto 95 Percent Details, Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X