మోటార్ సైకిల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన సుజుకి

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన సంస్థ సుజుకి మోటార్ సైకిల్. సుజుకి కంపెనీ చాల వాహనాలను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కానీ భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాపించడం వల్ల కంపెనీ ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేసింది. ఇప్పడు దేశ వ్యాప్తంగా నాల్గవ దశ లాక్ డౌన్ మొదలైంది. భారత ప్రభుత్వం నిర్దేశించిన కొన్ని నిబంధనల ప్రకారం మళ్ళీ కంపెనీ తమ ఉత్పత్తులను తిరిగి ప్రారంభించింది.

 

మోటార్ సైకిల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన సుజుకి

భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా ఇప్పుడు లాక్ డౌన్ 4.0 నుండి అమలు చేయబడింది. ఇదిలావుండగా ప్రఖ్యాత బైక్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ హర్యానాలోని గురుగ్రామ్‌లో తన తయారీ కర్మాగారాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. స్థానిక పరిపాలన నుండి అనుమతి పొందిన తరువాత ఉత్పత్తిని ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.

మోటార్ సైకిల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన సుజుకి

ఉత్పత్తి సమయంలో కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఆదేశించినదాని ప్రకారం సామాజిక దూరాన్ని నిర్వహించడం సహా ఇతర నిబంధనలను పాటిస్తామని కంపెనీ తెలిపింది. సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ 2020 మార్చి 23 నుంచి ఉత్పత్తిని నిలిపివేసింది.

MOST READ:అదిరిపోయే ఫీచర్లతో లాంచ్ అయిన బిఎస్ 6 నిస్సాన్ కిక్స్

మోటార్ సైకిల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన సుజుకి

కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సుజుకి మోటార్‌సైకిల్ తన తయారీ కర్మాగారాలను నిలిపివేసింది. 55 రోజుల తర్వాత కంపెనీ తన తయారీ కర్మాగారంలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తుంది.

మోటార్ సైకిల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన సుజుకి

దీని గురించి సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కొచ్చిరో హిరావ్ మాట్లాడుతూ ప్రారంభంలో సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ పరిమిత సంఖ్యలో సిబ్బందితో ఉత్పత్తిని తిరిగి ప్రారంభిస్తుందని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పూర్తి స్థాయిలో ఉత్పత్తిని లాక్ డౌన్ పూర్తిగా తీసివేరిన తరువాత ప్రారంభిస్తామని చెప్పారు.

MOST READ:సన్నీలియోన్ మనసు దోచుకున్న పింక్ అంబాసిడర్.. మ్యాటర్ ఏంటంటే ?

మోటార్ సైకిల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన సుజుకి

కరోనావైరస్ అంటూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి సామాజిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ మరియు నాన్-మొబిలైజేషన్ సహా పలు రకాల భద్రతా చర్యలు తీసుకుంటామని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా తెలిపింది.

మోటార్ సైకిల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన సుజుకి

సంస్థ తన తయారీ కర్మాగారంలో క్రిమిసంహారక గదిని కూడా నిర్మించింది. ప్రతి ఉద్యోగి ప్రతిరోజూ ఈ గది గుండా వెళ్ళాలి. ఇది సంక్రమణ వ్యాప్తిని నిరోధిస్తుంది. ఇప్పుడు ప్రారంభ దశలో తక్కువమంది ఉద్యోగులతో ప్రారంభిస్తామని కంపెనీ యాజమాన్యం తెలిపింది. కరోనా వైరస్ కారణంగా ఉత్పత్తులు పూర్తిగా నిలిచిపోవడం వల్ల కంపెనీ ఆర్థికంగా బాగా దిగజారింది. ఇప్పుడు మళ్ళీ ఉత్పత్తులను తిరిగి ప్రారంభించడం వల్ల ఆర్థిక వ్యవస్థ సరైన క్రమంలోకి రావడానికి అవకాశం ఉంటుంది.

MOST READ:ఇండియాలో 2020 ఎఎమ్‌జి జిటి-ఆర్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన మెర్సిడెస్ బెంజ్

Most Read Articles

English summary
Suzuki Motorcycle restarts production. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X