ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ నుండి 9 కొత్త మోడళ్లు వస్తున్నాయ్!

బ్రిటీష్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ కొత్త సంవత్సరం కోసం కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. జనవరి 2021 నుండి భారత మార్కెట్లో వరుసగా కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. రానున్న ఆరు నెలల్లో భారత మార్కెట్లో తొమ్మిది కొత్త బైక్‌లను ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది.

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ నుండి 9 కొత్త మోడళ్లు వస్తున్నాయ్!

భారత మార్కెట్ కోసం ట్రైయంప్ ప్లాన్ చేస్తున్న కొత్త మోడళ్లలో కొన్ని స్పెషల్ ఎడిషన్ మోడళ్లు కూడా ఉండనున్నాయి. తాజాగా, పిటిఐ నుండి వచ్చిన నివేదికల ప్రకారం, ట్రైయంప్ భారత మార్కెట్లోని ద్విచక్ర వాహన విభాగంలో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడానికి కృషి చేస్తోంది.

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ నుండి 9 కొత్త మోడళ్లు వస్తున్నాయ్!

ప్రస్తుత సంవత్సరం (2020లో) ప్రథమార్థంలో కరోనా మహమ్మారి కారణంగా ట్రైయంప్ భారత మార్కెట్లో ఫ్లాట్ అమ్మకాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో, వచ్చే సంవత్సరం (జూలై 2020 - జూన్ 2021 మధ్య కాలానికి) 20 నుండి 25 శాతం వృద్ధిని సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది.

MOST READ:ఒక్క ఫోటో ద్వారా లాక్‌డౌన్ ఫీలింగ్స్ పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆ ఫోటో మీరు చూడండి

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ నుండి 9 కొత్త మోడళ్లు వస్తున్నాయ్!

ఈ విషయం గురించి ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ షూబ్ ఫారూక్ మాట్లాడుతూ, వచ్చే సంవత్సరం జనవరి నుండి జూన్ వరకు తొమ్మిది కొత్త మోడళ్లను విడుదల చేయబోతున్నాం, ఇందులో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మోడళ్లకు స్పెషల్ ఎడిషన్లు కూడా రానున్నాయని చెప్పారు.

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ నుండి 9 కొత్త మోడళ్లు వస్తున్నాయ్!

అలాగే, ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న కొన్ని రకాల మోడళ్లలో రిఫ్రెష్డ్ వెర్షన్లను కూడా ప్రవేశపెట్టనున్నామని ఆయన తెలిపారు. కాబట్టి, రానున్న ఆరు నెలల్లో తాము కొత్త ఉత్పత్తుల విడుదల చాలా బిజీగా ఉంటామని, వచ్చే జూన్ నాటికి సరికొత్త పోర్ట్‌ఫోలియోని కలిగి ఉంటామని ఫారుఖ్ తెలిపారు.

MOST READ:నిజంగా ఇతడు గ్రేట్ పోలీస్.. ఎందుకో మీరే చూడండి ?

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ నుండి 9 కొత్త మోడళ్లు వస్తున్నాయ్!

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ ఇప్పటికే భారత మార్కెట్లో విస్తృతమైన ఉత్పత్తుల శ్రేణిని కలిగి ఉంది. ఇందులో రోడ్‌స్టర్స్, అడ్వెంచర్ టూరర్స్, మోడరన్-క్లాసిక్స్ మరియు రేంజ్-టాపింగ్ రాకెట్ 3 జిటి వంటి మోడళ్లు కూడా ఉన్నాయి.

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ నుండి 9 కొత్త మోడళ్లు వస్తున్నాయ్!

మరోవైపు ట్రైయంప్ త్వరలోనే తమ ఎంట్రీ లెవల్ మోడల్ ట్రైడెంట్ 660ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు ప్లాన్స్ చేస్తోంది. కాగా, ఈ మోటారుసైకిల్ కోసం కంపెనీ ఇప్పటికే బుకింగ్స్‌ను కూడా ప్రారంభించింది. జనవరి 2021లో ఈ మోడల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో వచ్చే ఏడాది భారతదేశంలో ట్రైయంప్ విడుదల చేయబోయే తొమ్మిది మోడళ్లలో ట్రైయంప్ ట్రైడెంట్ 660 మొదటిగా నిలుస్తుంది.

MOST READ:కొత్త బైక్‌ను వెంబడించిన ట్రక్ డ్రైవర్.. తర్వాత ఏం జరిగిందో చూడండి

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ నుండి 9 కొత్త మోడళ్లు వస్తున్నాయ్!

ట్రైయంప్ నుండి వచ్చే ఏడాది ఆశించబోయే కొత్త మోడళ్లలో సరికొత్త 2021 టైగర్ 850 స్పోర్ట్ మోటార్‌సైకిల్ కూడా ఒకటిగా ఉంటుంది. కంపెనీ ఇటీవలే ఈ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. కొత్త ట్రైయంప్ టైగర్ 850 స్పోర్ట్ ఈ శ్రేణిలో బ్రాండ్ యొక్క కొత్త ఎంట్రీ లెవల్ మోడల్‌గా రానుంది.

ట్రైయంప్ మోటార్‌సైకిల్స్ నుండి 9 కొత్త మోడళ్లు వస్తున్నాయ్!

ఈ మోటారుసైకిల్ కూడా రోడ్-ఓరియెంటెడ్ అడ్వెంచర్-టూరర్‌గా ఉంటుంది. ఇది కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన టైగర్ 900 మోడల్‌కు దిగువన బేస్-లెవల్ వేరియంట్‌గా అందుబాటులోకి రానుంది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:లగ్జరీ బైక్ కొన్న సాధారణ యువకుడు.. ఇంతకీ ఎలా కొన్నాడో తెలుసా?

Most Read Articles

English summary
Triumph Motorcycles Plans To Launch Nine New Bikes In India In Next Six Months. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X