ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ లాంచ్; ఆగస్ట్ 11న మార్కెట్లో విడుదల

ట్రయంప్ మోటార్‌సైకిల్ ఇండియా త్వరలో భారత్‌లో మరో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. ఈ బ్రాండ్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ 2020 ఆగస్టు 11 న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ లాంచ్; ఆగస్ట్ 11న మార్కెట్లో విడుదల

ఈ మేరకు ట్రైయంప్ తమ నేక్డ్ స్ట్రీట్ మోటార్‌సైకిల్ లాంచ్ టైమ్‌లైన్‌ను తెలియజేస్తూ తమ సోషల్ మీడియా ఛానెళ్లలో ఓ టీజర్‌ను విడుదల చేసింది. #TheDefinitiveStreetfighter అనే అధికారిక హ్యాష్‌ట్యాగ్‌తో పాటు టైమ్‌లైన్‌ను వెల్లడించే ఒక టీజర్ వీడియోను విడుదల కంపెనీ చేసింది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ లాంచ్; ఆగస్ట్ 11న మార్కెట్లో విడుదల

ఈ మోడల్ మార్కెట్లో విడుదల కావటానికి ముందే, ట్రయంప్ మోటార్‌సైకిల్స్ ఇండియా రూ.1 లక్ష టోకెన్ అమౌంట్‌తో స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ కోసం ప్రీ-బుకింగ్స్ ప్రారంభించింది. త్వరలో విడుదల కానున్న ఈ మో మోటార్‌సైకిల్ గతంలో కంపెనీ విక్రయించిన ‘ఎస్’ వేరియంట్‌ను భర్తీ చేస్తూ స్ట్రీట్ ట్రిపుల్ లైనప్‌లో కొత్త ఎంట్రీ లెవల్ వేరియంట్‌గా రానుంది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ లాంచ్; ఆగస్ట్ 11న మార్కెట్లో విడుదల

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ వేరియంట్ మాదిరిగానే స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ వేరియంట్‌లో కూడా అదే 765 సిసి, ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. అయితే, ‘ఆర్‌’ వేరియంట్‌లోని ఇంజన్ కొద్దిగా తక్కువ ట్యూన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 116 బిహెచ్‌పి శక్తిని మరియు 9,400 ఆర్‌పిఎమ్ వద్ద 77 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ లాంచ్; ఆగస్ట్ 11న మార్కెట్లో విడుదల

ఇది ఆర్ఎస్ వేరియంట్ ఇంజన్ గణాంకాలతో పోలిస్తే, 5 బిహెచ్‌పి మరియు 2 ఎన్ఎమ్ తక్కువగా ఉంటుంది. ఈ ఇంజన్ స్లిప్-అసిస్టెడ్ క్లచ్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఆర్ఎస్ వేరియంట్‌తో పోలిస్తే ఆర్ వేరియంట్‌లో డౌన్ ట్యూన్ చేసిన ఇంజన్ మినహా, మిగిలిన అన్ని ఫీచర్లను ఇది కలిగి ఉంటుంది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ లాంచ్; ఆగస్ట్ 11న మార్కెట్లో విడుదల

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ‘ఆర్ఎస్’ వేరియంట్‌లో టిఎఫ్‌టి కలర్ డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో పోలిస్తే ఆర్ వేరియంట్‌లో అనలాగ్ టాకోమీటర్‌తో కూడిన ఎల్‌సిడి మాత్రమే ఉంటుంది. ట్రిపుల్ ఆర్ఎస్‌లో మూడు రైడింగ్ మోడ్స్ ఉండే, ట్రిపుల్ ఆర్‌లో రెండు రైడింగ్ మోడ్స్ మాత్రమే ఉంటాయి.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ లాంచ్; ఆగస్ట్ 11న మార్కెట్లో విడుదల

ఏదేమైనప్పటికీ, ఈ మోటార్‌సైకిల్ యొక్క మొత్తం డిజైన్ మరియు సిల్హౌట్ టాప్-స్పెక్స్ ఆర్ఎస్ వేరియంట్ మాదిరిగానే అనిపిస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు మరియు ట్విన్-పాడ్ ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లతో అగ్రెసివ్‌గా కనిపించే ఫ్రంట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ లాంచ్; ఆగస్ట్ 11న మార్కెట్లో విడుదల

ఇందులో సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు భాగంలో 41 మిమీ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్ ఉంటాయి. ఇవి రెండూ షోవా నుండి గ్రహించబడినవి మరియు పూర్తిగా సర్దుబాటు చేయడానికి వీలుగా ఉంటాయి. ఇక బ్రేకింగ్‌ను గమనిస్తే, ఈ మోటార్‌సైకిల్‌పై ముందు భాగంలో 310 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 220 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇవి రెండూ డ్యూయల్-ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేస్తుంది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ లాంచ్; ఆగస్ట్ 11న మార్కెట్లో విడుదల

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ భారత మార్కెట్లో విడుదలైతే, ఇది ఈ సెగ్మెంట్లో కొత్తగా విడుదలైన బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్ 900ఆర్, కవాసాకి జి900 మరియు త్వరలో విడుదల కానున్న బిఎస్ B కెటిఎమ్ 790 డ్యూక్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ లాంచ్; ఆగస్ట్ 11న మార్కెట్లో విడుదల

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ మోడల్‌ను రిటైల్ రూ.11.33 లక్షలకు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) విక్రయించడాన్ని చూస్తుంటే, ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ ధర సుమారు రూ.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా.

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ లాంచ్; ఆగస్ట్ 11న మార్కెట్లో విడుదల

ట్రైయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ టీజర్ వీడియోపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ మోడల్, ఈ సిరీస్‌లోని టాప్-స్పెక్ ఆర్ఎస్ వేరియంట్లో కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఎలక్ట్రానిక్ అసిస్టెన్స్ ఫీచర్లను కోల్పోతుంది. ఇంజన్ కూడా ఆర్ఎస్ వేరియంట్ కన్నా తక్కువగా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్ బరువును పరిగణలోకి తీసుకుంటే, ఇది ధరకు తగిన విలువను అందిస్తుందనేది మా అభిప్రాయం.

Most Read Articles

English summary
Triumph Motorcycle India will soon add another motorcycle to the line-up. The two-wheeler manufacturer has confirmed that the Street Triple R will be launching on August 11, 2020, in the Indian market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X