Just In
- 18 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 1 day ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 1 day ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 1 day ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
జనసేన-బీజేపీ అభ్యర్థులను మద్దతివ్వండి, ఇక వైసీపీ దాష్టీకానికి ముగింపే: పవన్ కళ్యాణ్
- Finance
IPO: LIC ఆథరైజ్డ్ క్యాపిటల్ భారీ పెంపు, రూ.25,000 కోట్లకు..
- Movies
‘ఆచార్య’ టీంకు షాక్.. మొదటి రోజే ఎదురుదెబ్బ.. లీకులపై చిరు ఆగ్రహం
- Sports
కిడ్స్ జోన్లో టీమిండియా క్రికెటర్ల ఆట పాట!వీడియో
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
యమహా ఎమ్‌టి-15 కస్టమైజ్ కలర్ అప్సన్ : పూర్తి వివరాలు
యమహా మోటార్ ఇండియా తన ఎమ్‌టి-15 కొనుగోలుదారుల కోసం దేశంలో కస్టమైజ్ ప్రోగ్రాం ప్రారంభించింది. "కస్టమైజ్ యువర్ వారియర్ (CYW)" అని పిలువబడే, ఈ సంస్థ ఎమ్‌టి-15 ను కొనుగోలు చేసేటప్పుడు వీటిలో ఎంచుకోవడానికి మొత్తం 11 డిఫరెంట్ కలర్స్ లో వీటిని అందిస్తోంది.

ఎమ్‌టి-15 కోసం కొత్త కలర్ కస్టమైజేషన్ ప్రోగ్రాం కింద, సివైడబ్ల్యు అనే మోటారుసైకిల్ యొక్క కొత్త వేరియంట్‌ను కంపెనీ విడుదల చేసింది. కొత్త ఎమ్‌టి-15 సివైడబ్ల్యు వారెంట్ ధర రూ. 1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఎమ్‌టి-15 ను మూడు బాడీ పెయింట్ మరియు చక్రాల కోసం నాలుగు కలర్ స్కీమ్‌లలో అందిస్తున్నారు. ఇది వినియోగదారులకు వారి ఎమ్‌టి-15 సివైడబ్ల్యు మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసేటప్పుడు ఎంచుకోవడానికి 14 వివిధ కలయికలను ఇస్తుంది. వినియోగదారుల నుండి అందుకున్న ఆర్డర్ ఆధారంగా ఈ వాహనాలను యమహా తయారు చేస్తుంది. డెలివరీ జనవరి 2021 నుండి ప్రారంభమవుతుంది. కంపెనీ ప్రకారం, ఎల్లో కలర్ వీల్ మోడల్ మార్చి 2021 నుండి డెలివరీని ప్రారంభిస్తుంది.

కొత్త ఎమ్‌టి-15 (సివైడబ్ల్యు) కలర్ కస్టమైజేషన్ ప్రోగ్రామ్ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుందని, ఇది యువ వినియోగదారులను ఎమ్‌టి ప్రపంచంలోకి ఆకర్షిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది వారి అవసరానికి అనుగుణంగా రంగు కలయికతో అనేక ఎంపికలను అందిస్తుంది.

కొత్త కలర్ కాంబినేషన్ కాకుండా, మోటారుసైకిల్‌లో ఇతర మార్పులు చేయలేదు. కొత్త ఎమ్‌టి-15 సివైడబ్ల్యూకి స్టాండర్డ్ వేరియంట్‌పై రూ. 4,000 ప్రీమియం ధర లభించింది. ఇప్పుడు దీని ధర రూ. 1.39 లక్షలు (ఎక్స్‌షోరూమ్,ఢిల్లీ).
MOST READ:కుండపోత వర్షంలో నిలబడి 4 గంటలు డ్యూటీ చేసిన పోలీస్.. ఎక్కడో తెలుసా ?

ఎమ్‌టి-15 లిక్విడ్ కూల్డ్ ఎస్ఓహెచ్సి 155 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది బ్రాండ్ యొక్క వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇది 10000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 18 బిహెచ్‌పి మరియు 8500 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్-అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

యమహా ఎమ్‌టి-15 యొక్క హైలైట్ చేసిన కొన్ని ఫీచర్స్ గమనించినట్లైతే దీని ముందుభాగంలో సింగిల్-ఛానల్ ఎబిఎన్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ లాంప్‌లు, పుల్లీ డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు మరిన్ని ఉన్నాయి. ఎమ్‌టి-15 యొక్క రూపకల్పన బ్రాండ్ యొక్క ఎమ్‌టి-09 సూపర్ బైక్ నుండి ప్రేరణ పొందింది. ఇది మోటారుసైకిల్ దూకుడుగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
MOST READ:గ్లోస్టర్ ఎస్యూవీ డెలివరీస్ షురూ చేసిన ఎంజి మోటార్స్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:
యమహా కొత్త కలర్ కస్టమైజేషన్ ప్రోగ్రామ్‌ను భారతీయ మార్కెట్లో 150 సిసి విభాగంలో ఖచ్చితంగా అందించే స్పెషల్ ఆఫర్. కొత్త కస్టమైజ్ యువర్ వారియర్ (సివైడబ్ల్యు) ప్రోగ్రామ్‌తో, ఎమ్‌టి-15 మోడల్‌కు ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.