మీకు తెలుసా.. 2021 కవాసకి నింజా 650 బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా..

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి తన కొత్త 2021 నింజా 650 బైక్‌ను జపాన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త కవాసకి నింజా 650 బైక్‌ ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లో విడుదలైంది. ఈ కొత్త కలర్ ఎడిషన్ కవాసకి నింజా 650 బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మీకు తెలుసా.. 2021 కవాసకి నింజా 650 బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా..

కొత్త 2021 కవాసకి నింజా 650 బైక్ మెటాలిక్ స్పార్క్ బ్లాక్ / మెటాలిక్ ఇంపీరియల్ రెడ్ మరియు లైమ్ గ్రీన్ / ఎబోనీ వంటి కొత్త కలర్ ఆప్షన్‌లను అందుకుంటుంది. అయితే భారత మార్కెట్లో, కవాసకి నింజా 650 బైక్ మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అవి లైమ్ గ్రీన్, లైమ్ గ్రీన్ / ఎబోనీ మరియు పెర్ల్ ఫ్లాట్ స్టార్‌డస్ట్ వైట్ కలర్ ఆప్షన్స్.

మీకు తెలుసా.. 2021 కవాసకి నింజా 650 బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా..

కొత్త కవాసాకి నింజా 650 బైక్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్‌లో ఫ్యూయెల్ ట్యాంక్, ఫ్రంట్ ఫెండర్ మరియు కొన్ని ఇతర భాగాలపై లైమ్ గ్రీన్ పెయింట్ చూడవచ్చు. 2021 కవాసాకి నింజా 650 బైక్ లైమ్ గ్రీన్ / ఎబోనీ కెఆర్టి కలర్ ఆప్షన్‌ బైక్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో రేసింగ్ కోసం ఉపయోగించే కవాసకి నింజా జెడ్‌ఎక్స్ఎక్స్-10 ఆర్ఆర్ మాదిరిగానే ఉంటుంది.

MOST READ:గుడ్ న్యూస్.. రెనాల్ట్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్.. ఏ వేరియంట్‌పై ఎంతో చూడండి

మీకు తెలుసా.. 2021 కవాసకి నింజా 650 బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా..

కవాసకి నింజా 650 బైక్ చూడటానికి మంచి స్టైలిష్ గా ఉంటుంది. ఈ విధంగా మంచి దూకుడు రూపాన్ని కలిగి ఉండటానికి ఫెయిరింగ్ అప్డేట్ చేయబడింది. అంతే కాకుండా ఇందులో కొంత అప్డేట్ చేయబడిన గ్రాఫిక్స్ డిజైన్ కూడా ఉంది.

మీకు తెలుసా.. 2021 కవాసకి నింజా 650 బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా..

నింజా 650 బైక్ కొత్త కలర్ ఆప్షన్స్ కాకుండా ఇతర మార్పులను గమనించినట్లయితే, ఇందులో 649 సిసి లిక్విడ్ కూల్డ్ ట్విన్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజిన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 68 బిహెచ్‌పి శక్తిని మరియు 6,700 ఆర్‌పిఎమ్ వద్ద 65.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

MOST READ:ఈ కారు ప్రయాణికుల పాలిట రక్షణ కవచం.. ఇంతకీ ఏ కారనుకుంటున్నారు

మీకు తెలుసా.. 2021 కవాసకి నింజా 650 బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా..

ఈ బైక్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, 4.3 ఇంచెస్ టిఎఫ్‌టి కలర్ ఇన్‌స్ట్రక్షన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ మరియు డన్‌లాప్ స్పోర్ట్స్ మాక్స్ రోడ్‌స్పోర్ట్ టైర్లు ఉన్నాయి. ఈ బైక్‌లోని ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంటేషన్ స్క్రీన్లు ఈ బైక్ రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

మీకు తెలుసా.. 2021 కవాసకి నింజా 650 బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా..

ఈ బైక్‌లో వెయిట్ లెస్ చాసిస్ మరియు సౌకర్యవంతమైన సీట్లు అమర్చబడి ఉంటాయి. ఇక ఈ బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, నిజం 650 బైక్ ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ఉన్నాయి. బ్రేక్‌లు ముందు భాగంలో 300 మిమీ పెటల్ డిస్క్ మరియు వెనుక వైపు 200 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటాయి.

MOST READ:పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

మీకు తెలుసా.. 2021 కవాసకి నింజా 650 బైక్, ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా..

ఈ కొత్త కవాసకి నింజా 650 బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, వాహనదారునికి మంచి రైడింగ్ అనుభవాన్ని కూడా ఇస్తుంది. ఇది మునుపటికంటే అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకి మరింత ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది.

Most Read Articles

English summary
Kawasaki Ninja 650 Gets New Colour Options. Read in Telugu.
Story first published: Monday, January 11, 2021, 11:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X