భారత మార్కెట్లో విడుదలైన కొత్త Ampere Magnus EX స్కూటర్: ధర రూ. 68,999

దేశీయ విఫణిలో రోజురోజుకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్న సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Ampere Electric (ఆంపియర్ ఎలక్ట్రిక్) తన పోర్ట్‌ఫోలియోలో కొత్త Ampere Magnus (ఆంపియర్ మాగ్నస్) లాంగ్ రేంజ్ వేరియంట్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ Ampere Magnus EX అనే పేరుతో మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 68,999 (ఎక్స్-షోరూమ్, పూణే). ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Ampere Magnus EX స్కూటర్: వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఆధునిక ఫీచర్స్ మరియు ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా చాలా ఉంటుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అత్యంత అద్భుతమైన ఫీచర్ దాని పరిధి. ఈ పరిధి ఏఆర్ఏఐ ద్వారా ధృవీకరించబడింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క చార్జికి 121 కి.మీ.ల పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Ampere Magnus EX స్కూటర్: వివరాలు

Ampere Magnus EX స్కూటర్ డిటాచబుల్, తేలికైన మరియు పోర్టబుల్ అడ్వాన్స్‌డ్ లిథియం బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇంటిలో లేదా ఆఫీస్ లో లేదా కాఫీ షాప్‌లో లేదా ప్లగ్-ఆన్-ది-వాల్ ఛార్జ్ పాయింట్‌లో ఏదైనా 5-amp సాకెట్ ద్వారా సులభంగా ఛార్జింగ్ చేయడానికి దాని డిటాచబుల్ బ్యాటరీ సెటప్ అనుమతిస్తుంది అని కంపెనీ పేర్కొంది.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Ampere Magnus EX స్కూటర్: వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి 1200-వాట్ల మోటార్ లభిస్తుంది, ఇది ఈ విభాగంలో అత్యధిక రేటింగ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని మోటార్ కేవలం 10 సెకన్లలో 0 నుండి 40 కిమీ వేగవంతం చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా, ఈ స్కూటర్‌లో రెండు రైడింగ్ మోడ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. అవి సూపర్ సేవ్ ఎకో మోడ్ మరియు పెపియర్ పవర్ మోడ్.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Ampere Magnus EX స్కూటర్: వివరాలు

కొత్త ఆంపియర్ మాగ్నస్ EX ఎలక్ట్రిక్ స్కూటర్‌లో అందుబాటులో ఉన్న ఇతర ఫీచర్ల విషయానికి వస్తే, ఇది ఎల్ఈడీ హెడ్‌లైట్, 450 మిమీ లెగ్‌రూమ్ స్పేస్, కీలెస్ ఎంట్రీ, వెహికల్ ఫైండర్ మరియు యాంటిథెఫ్ట్ అలారం వంటివి కలిగి ఉంటుంది. ఇందులో బ్యాటరీని తీసివేయడం సులభం, అంతే కాకుండా దీనికి రీఛార్జ్ చేయడం కూడా సులభం, కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Ampere Magnus EX స్కూటర్: వివరాలు

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి డిజైన్ పొందుతుంది. ఈ డిజైన్ మరింత అద్భుతంగా కనిపించేలా చేయడానికి సౌకర్యంతమైన మరియు విశాలమైన సీటుని కలిగి ఉంటుంది. కావున రైడర్స్ కి చాలా మంచి రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. Ampere Magnus EX ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మెటాలిక్ రెడ్, గ్రాఫైట్ బ్లాక్ మరియు గెలాక్సీ గ్రే కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షనీయంగా ఉంటాయి.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Ampere Magnus EX స్కూటర్: వివరాలు

Ampere Magnus EX ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ గురించి మాట్లాడుతూ, ఆంపియర్ ఎలక్ట్రిక్ COO, రాయ్ కురియన్ ప్రస్తుతం దేశంలో అధికంగా పెరుగుతున్న ఇంధన ధరలు సాధారణ ప్రజలపాలిట చాలా భారాన్ని కలిగిస్తోంది. ఈ సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల అవసరం ఎంతైనా ఉంది. కావున ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి ఆదరణ పొందుతుందని విశాసిస్తున్నామన్నారు.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Ampere Magnus EX స్కూటర్: వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటుందని కూడా అయన అన్నారు. ఇది మంచి డిజైన్ మరియు మరియు మంచి సామర్త్యాన్ని అందిస్తుంది, కావున వాహనదారులకు అనుకూలంగా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Ampere Magnus EX స్కూటర్: వివరాలు

ఆంపియర్ మాగ్నస్ EX దాని సుదూర ఛార్జ్‌తో వినియోగదారులు బహుళ పర్యటనలు చేయడానికి అనుమతిస్తుంది. కొత్త ఆంపియర్ మాగ్నస్ EX యూజర్లు వారి పని మరియు జీవిత లక్ష్యాలను సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. కావున ఈ స్కూటర్ మార్కెట్లో వినియోగదారులను పెద్ద సంఖ్యలో ఆకర్శించే అవకాశం ఉంటుంది, అంతే కాకుండా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుంది.

భారత మార్కెట్లో విడుదలైన కొత్త Ampere Magnus EX స్కూటర్: వివరాలు

మార్కెట్లో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. కావున ఈ సమయంలో కంపెని అతి తక్కువ ధరకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేయడమే కాకుండా అధునాతన ఫీచర్స్ అందిస్తున్న కారణంగా వినియోగదారులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు ముందుకు వస్తారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు రాయితీలను కల్పిస్తున్నాయి. కావున రానున్న కాలంలో ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగంలో ఉంటాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
Ampere magnus ex long range electric scooter launched at rs 68999 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X