ఆప్రిలియా ఆర్ఎస్ 125 మరియు టుయెనో 125 బైక్ ఆవిష్కరణ

ఇటాలియన్ ప్రీమియం టూవీలర్ బ్రాండ్ ఆప్రిలియా ఇటీవలే తమ సరికొత్త ఆర్ 660 మరియు టుయెనో 660 లను స్పోర్ట్స్ బైక్‌లైను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా, ఈ కంపెనీ ఇప్పుడు ఇదే సిరీస్‌లో రెండు 125సీసీ ఎంట్రీ లెవల్ వేరియంట్లను ఆవిష్కరించింది.

ఆప్రిలియా ఆర్ఎస్ 125 మరియు టుయెనో 125 బైక్ ఆవిష్కరణ

ఆప్రిలియా ఆర్ 125 మరియు ఆప్రిలియా టుయెనో 125 అనే రెండు కొత్త అప్‌గ్రేడెడ్ 2021 మోడళ్లను కంపెనీ గ్లోబల్ మార్కెట్ల కోసం ఆవిష్కరించింది. ఇవి డిజైన్ పరంగా చూడటానికి వాటి బిగ్ బ్రదర్స్ (660సీసీ మోడళ్ల) మాదిరిగానే కనిపిస్తాయి. అయితే, వీటిలో లభించే ఇంజన్ మరియు ఫీచర్లలో మాత్రం భారీ మార్పులు ఉంటాయి.

ఆప్రిలియా ఆర్ఎస్ 125 మరియు టుయెనో 125 బైక్ ఆవిష్కరణ

ఆప్రిలియా ఆవిష్కరించిన ఈ 2021 మోడళ్లు రీడిజైన్ చేయబడిన బాడీ-వర్క్‌ని పొందుతాయి. ఈ రెండు బైక్‌లు ఇప్పుడు కొత్త ఎక్స్‌టర్నల్ పెయింట్ స్కీమ్‌లతో లభిస్తాయి. ఈ కొత్త పెయింట్ స్కీమ్స్‌తో ఇవి మునుపటి కన్నా మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తాయి.

MOST READ:కరోనా నివారణలో దేశానికి అండగా హ్యుందాయ్; పూర్తి వివరాలు

ఆప్రిలియా ఆర్ఎస్ 125 మరియు టుయెనో 125 బైక్ ఆవిష్కరణ

ఈ రెండు బైక్‌లలో (ఆర్ 125 మరియు టుయెనో 125) ప్రధానమైన అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, ఇందులో మునుపటి మోడళ్లలో ఉపయోగించిన సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ స్థానంలో కొత్త ప్రీమియం మరియు అప్ క్లాస్ మార్కెట్ ఫీల్‌ను అందించే కొత్త ఫుల్ డిజిటల్ ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ కస్టర్‌ను జోడించారు.

ఆప్రిలియా ఆర్ఎస్ 125 మరియు టుయెనో 125 బైక్ ఆవిష్కరణ

మెకానికల్స్ విషయానికొస్తే, ఈ రెండు బైక్‌లు ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉంటాయి. వీటిలో అప్‌గ్రేడెడ్ 124సిసి సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 10 బిహెచ్‌పి శక్తిని జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:స్నేహం ముందు తలవంచిన కరోనా.. అసలు విషయం ఏంటంటే?

ఆప్రిలియా ఆర్ఎస్ 125 మరియు టుయెనో 125 బైక్ ఆవిష్కరణ

ఇందులోని కొత్త ఇంజన్‌ను కంపెనీ యూరో-5 (భారత్‌లో బిస్6 నిబంధనలకు సమానమైన) ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌డేట్ చేసింది. ఈ బైక్‌లు అప్‌డేట్ చేయబడిన ఇంజన్‌ను మాత్రమే కాకుండా, వెడల్పాటి టైర్లు మరియు మెరుగైన ఏబిఎస్ వ్యవస్థను కూడా పొందుతాయి.

ఆప్రిలియా ఆర్ఎస్ 125 మరియు టుయెనో 125 బైక్ ఆవిష్కరణ

కాగా, ఆప్రిలియా ఆర్ 125 మరియు ఆప్రిలియా టుయెనో 125 ఛాస్సిస్ మరియు అనేక ఇతర విడిభాగాల్లో ఎలాంటి మార్పులు లేవు. మునుపటి మోడళ్లలో వినియోగించినవే, ఈ కొత్త మోడళ్లలో కూడా కొనసాగుతాయి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, అధిక ధరల కారణంగా ఈ రెండు బైక్‌లు ఇప్పట్లో భారత మార్కెట్‌కు వచ్చే అవకాశం లేదు.

MOST READ:అప్పుడే అమ్ముడైపోయిన 2021 సుజుకి హయాబుసా బైక్.. మళ్ళీ బుకింగ్స్ ఎప్పుడంటే?

ఆప్రిలియా ఆర్ఎస్ 125 మరియు టుయెనో 125 బైక్ ఆవిష్కరణ

అయితే, ఇదే సిరీస్‌లో పెద్ద ఇంజన్‌తో కూడిన మోడళ్లను కోరుకునేవారికి మాత్రం కంపెనీ ఆర్‌ఎస్ 660 మరియు టుయోనో 660 మోడళ్లను త్వరలో భారతదేశంలో విడుదల చేయనుంది. దేశీయ విపణిలో ఇప్పటికే ఈ రెండు మోడళ్ల కోసం బుకింగ్‌లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం.

ఆప్రిలియా ఆర్ఎస్ 125 మరియు టుయెనో 125 బైక్ ఆవిష్కరణ

ఈ రెండు మోటార్‌సైకిళ్లు ఒకే రకమైన 660సిసి పారలల్ ట్విన్ ఇంజన్‌ను కలిగి ఉంటాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ బైక్‌లలో పెద్ద ఇంజన్ ఉన్నప్పటికీ, వాటి బరువు మాత్రమే 165 కిలోలుగానే ఉంటాయి. వీటిని 650సిసి విభాగంలోనే తేలికైన మోటార్‌సైకిళ్లుగా కూడా పరిగణిస్తారు.

ఇదిలా ఉంటే, భారతదేశంలో కెటిఎమ్ ఆర్‌సి 390 వంటి మోడళ్లకు పోటీగా ఓ కొత్త మోటార్‌సైకిల్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అప్రిలియా ధృవీకరించింది. ఈ బైక్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. రాబోయే కాలంలో మరిన్ని వివరాలు తెలుస్తాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

MOST READ:కోవిడ్-19 పేషెంట్ల కోసం రైలునే ఆస్పత్రిగా మార్చారు: ఆక్సిజెన్ కూడా ఉంది!

Most Read Articles

English summary
Aprilia Unveils New RS 125 And Tuono 125 Models For Global Markets. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X