కొత్త పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ బైక్‌ను విడుదల చేయనున్న బజాజ్

బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ లైనప్‌లో పల్సర్ సిరీస్ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన సంగతి మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం బజాజ్ పల్సర్ రేంజ్‌లో 125సీసీ నుండి 220సీసీ వరకూ మొత్తం 10 రకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, ఇప్పుడు ఈ లైనప్‌లో మరో కొత్త వేరియంట్‌ను చేర్చేందుకు బజాజ్ ఆటో సన్నాహాలు చేస్తోంది.

కొత్త పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ బైక్‌ను విడుదల చేయనున్న బజాజ్

తాజా సమాచారం ప్రకారం, బజాజ్ ఆటో త్వరలోనే పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. బజాజ్ ఆటో ఈ కొత్త మోటార్‌సైకిల్‌ను 150-200సిసి విభాగంలో ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న సెమీ ఫెయిర్డ్ పల్సర్ 180ఎఫ్ నియాన్ సరసన ఉంచనుంది.

కొత్త పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ బైక్‌ను విడుదల చేయనున్న బజాజ్

కొత్తగా వస్తున్న బజాజ్ పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ మోటార్‌సైకిల్ ఈ విభాగంలో హోండా హార్నెట్ 2.0, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 మరియు సుజుకి జిక్సర్ 155 వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది. ఈ కొత్త పల్సర్ 180 రోడ్‌స్టర్ గురించి బజాజ్ ఆటో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, కంపెనీ ఈ కొత్త బైక్‌ను రూ.1,05,216 ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేయవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

MOST READ:హోండా యాక్టివా 6జి కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఆఫర్లు & వివరాలు

కొత్త పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ బైక్‌ను విడుదల చేయనున్న బజాజ్

బజాజ్ పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ డిజైన్ విషయానికి వస్తే, పేరుకు తగినట్లుగానే ఇది తక్కువ ఫెయిరింగ్‌తో నేక్డ్ రోడ్‌స్టర్ రూపంలో ఉండనుంది. చూడటానికి ఇది పల్సర్ 125 మరియు పల్సర్ 150 సిరీస్‌లో లభిస్తున్న నేక్డ్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుత పల్సర్ సిరీస్‌తో పోలిస్తే కంపెనీ ఈ బైక్‌లో చాలా మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.

కొత్త పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ బైక్‌ను విడుదల చేయనున్న బజాజ్

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ బైక్ ముందు భాగంలో హాలోజన్ హెడ్‌లైట్, బికినీ ఫెయిరింగ్, టింటెడ్ వైజర్, మజిక్యులర్ ఫ్యూయెల్ ట్యాంక్, ఇంజన్ కౌల్, స్ప్లిట్ సీట్స్, ట్విన్ డిఆర్‌ఎల్స్ మరియు స్పోర్టీ పిలియన్ గ్రాబ్ రైల్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

MOST READ:గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత డ్రైవింగ్ ట్రైనింగ్.. కేవలం 50 మందికి మాత్రమే.. ఎక్కడో తెలుసా?

కొత్త పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ బైక్‌ను విడుదల చేయనున్న బజాజ్

ఇక ఇందులో ఉపయోగించేబోయే హార్డ్‌వేర్, పరికరాలు మరియు ఇంజన్ వంటి తదితర భాగాలను ప్రస్తుత కంపెనీ విక్రయిస్తున్న సెమీ ఫెయిర్డ్ వెర్షన్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. పల్సర్ 180 రోడ్‌స్టర్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ ఫ్యూసెట్‌లు మరియు వెనుక భాగంలో గ్యాస్-ఛార్జ్డ్ రియర్ స్ప్రింగ్‌లను ఉపయోగించవచ్చని సమాచారం.

కొత్త పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ బైక్‌ను విడుదల చేయనున్న బజాజ్

ఈ బైక్‌లోని బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ఇందులోని రెండు చక్రాలపై సింగిల్ డిస్క్ బ్రేక్‌లు ఉండనున్నాయి. ఇవి సింగిల్ ఛానెల్ ఏబిఎస్‌ను సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పల్సర్ 180ఎఫ్ నియాన్ ఇంజన్‌నే ఈ కొత్త పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్‌లోనూ ఉపయోగించనున్నారు.

MOST READ:ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు కోసం భారీ నిధులు విడుదల చేసిన కేంద్రం.. ఎంతో తెలుసా?

కొత్త పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ బైక్‌ను విడుదల చేయనున్న బజాజ్

ప్రస్తుతం పల్సర్ 180ఎఫ్ నియాన్‌లోని 178.6 సిసి, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 16.6 బిహెచ్‌పి శక్తిని మరియు 14.52 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. కొత్త పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్‌లోని ఇంజన్ కూడా ఇదేరకమైన గణాంకాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

కొత్త పల్సర్ 180 నేక్డ్ రోడ్‌స్టర్ బైక్‌ను విడుదల చేయనున్న బజాజ్

బజాజ్ ఆటోకి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, గడచిన జనవరి 2021లో కంపెనీ మొత్తం 3,84,936 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. గత ఏడాది జనవరి 2020తో పోలిస్తే, ఈ ఏడాది జనవరిలో కంపెనీ అమ్మకాలు 16 శాతం వృద్ధి చెందాయి.

MOST READ:అలెర్ట్.. ఇప్పుడు ఆన్‌లైన్ డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ఇది తప్పనిసరి

గమనిక: ఈ కథనంలో ఉపయోగించిన చిత్రాలు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం మాత్రమేనని గమనించండి.

Most Read Articles

English summary
Bajaj Auto Plans To Launch New Pulsar 180 Naked Roadster, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X