Bajaj Chetak vs TVS iQube: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా సెమీకండక్టర్ల కొరత ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది, మరోవైపు దిగుమతి ఆంక్షలు కూడా వాహనాల అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇంకోవైపు నిత్యం పెరుగుతున్న పెట్రోల్ ధరలు మరో ప్రధాన సమస్యగా పరిణమించింది.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

ఈ పరిస్థితుల నేపథ్యంలో, దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో లభిస్తున్న ప్రధాన ఎలక్ట్రిక్ స్కూటర్లలో Bajaj Chetak మరియు Tvs iQube మోడళ్లు కూడా ఉన్నాయి. గడచిన జులై నెలలో ఇవి రెండూ ప్రోత్సాహకర వృద్ధిని కనబరచాయి.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా, గత నెలలో Bajaj Chetak మరియు Tvs iQube అమ్మకాలు కూడా భారీగానే పెరిగాయి. తాజా డేటా ప్రకారం, జూలై 2021 నెలలో Bajaj ఆటో మొత్తం 730 Chetak ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో ఇవి కేవలం 31 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

అంటే, వార్షిక అమ్మకాల పరంగా చూసుకుంటే, ఈ సమయంలో Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు 2254.84 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇదే సమయంలో Tvs Motor కంపెనీ అందిస్తున్న iQube (ఐక్యూబ్) ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు కూడా మెరుగుపడ్డాయి.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

గత జూలై 2021 నెలలో Tvs Motor (టీవీఎస్ మోటార్) కంపెనీ మొత్తం 540 యూనిట్ల iQube (ఐక్యూబ్) ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ వీటిని కేవలం 23 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ సమయంలో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు 2247.83 శాతం పెరిగాయి.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

ఇక, నెలవారీ అమ్మకాల విషయానికి వస్తే జూన్ 2021 లో Bajaj Auto (బజాజ్ ఆటో) మొత్తం 452 యూనిట్ల Chetak (చేతక్) ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయించింది. ఈ నెలతో పోలిస్తే, జూలై 2021 నెలలో దాని అమ్మకాలు 61.50 శాతం పెరిగాయి. కానీ, Tvs iQube (టీవీఎస్ ఐక్యూబ్) విషయంలో, ఇది ఇందుకు వ్యతిరేకంగా ఉంది.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

జూన్ 2021 నెలలో Tvs iQube (టీవీఎస్ ఐక్యూబ్) అమ్మకాలు 639 యూనిట్లుగా నమోదయ్యాయి. జూన్ నెలతో జులై నెల అమ్మకాలు పోల్చి చూసినప్పుడు, ఇవి 15.49 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఇక ఈ ఏడాది జనవరి నుండి జూలై వరకు జరిగిన అమ్మకాలను చూస్తే, ఈ సమయంలో Bajaj Auto (బజాజ్ ఆటో) మొత్తం 1,261 యూనిట్ల Chetak (చేతక్) ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

కాగా, ఇదే సమయంలో (జనవరి నుండి జూలై) Tvs Motor కంపెనీ మొత్తం 1,715 యూనిట్ల iQube ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. మొత్తం అమ్మకాల పరంగా చూసుకుంటే, Tvs iQube అమ్మకాలు Bajaj Chetak అమ్మకాల కంటే 454 యూనిట్లు అధికంగా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తుంటే, భారత వినియోగదారులు Tvs iQube ని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు స్పష్టమవుతుంది.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

Bajaj Auto తమ Chetak ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మొదట్లో పూణే మరియు బెంగళూరు మార్కెట్లలో మాత్రమే విక్రయించేది. కాగా, కంపెనీ ఇప్పుడు నాగపూర్, ఔరంగాబాద్, మైసూర్ మరియు మంగళూరు నగరాల్లో కూడా విక్రయిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని 20 ఇతర నగరాల్లో Bajaj తమ Chetak ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

ఇక, Tvs iQube విషయానికి వస్తే, ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూణే, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై మరియు కోయంబత్తూరు నగరాలలో కంపెనీ విక్రయిస్తోంది. త్వరలోనే దీనిని అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై మరియు కోల్‌కతా వంటి నగరాల్లో ప్రారంభించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దేశంలోని అనేక టైర్-1 నగరాల్లో కూడా Tvs iQube ని కంపెనీ అందుబాటులోకి తీసుకురానుంది.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

Bjaja Chetak ఫీచర్లు:

Bajaj Chetak ఎలక్ట్రిక్ స్కూటర్ అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.1.42 లక్షలు మరియు రూ.1.44 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. ఈ స్కూటర్‌లో ఐపి67 రేటెడ్ 3 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

పూర్తి చార్జ్‌పై ఇది 95 కిమీ రేంజ్‌ను (ఎకో మోడ్‌లో) అందిస్తుంది. ఇందులో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. స్పోర్ట్ మోడ్‌లో దీనిని గరిష్టంగా గంటకు 70 కిమీ వేగంతో రైడ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయటానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

Tvs iQube ఫీచర్లు:

ప్రస్తుతం మార్కెట్లో Tvs iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.01 లక్షలు (ఆన్-రోడ్, ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్‌లో అమర్చిన 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. పూర్తి చార్జ్‌పై ఈ స్కూటర్ 80 కిలోమీటర్ల రేంజ్‌ను (ఎకో మోడ్‌లో) ఆఫర్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు.

బజాజ్ చేతక్ vs టీవీఎస్ ఐక్యూబ్: ప్రజలు ఏ స్కూటర్‌ని ఎక్కువ కొంటున్నారు?

Tvs iQube ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇందులోని బ్యాటరీలను 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. వీటిని పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయటానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.

Most Read Articles

English summary
Bajaj chetak vs tvs iqube which electric scooter is best in sales
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X